అజంతా & ఎల్లోరా గుహలు: మహారాష్ట్రలోని జల్గావ్ నగరంలో ఈ గుహలున్నాయి. క్రీస్తు శకం 2 నుంచి 6 శతాబ్ధాల మధ్య అజంతా గుహలను, క్రీస్తు శకం 6 నుంచి 11 శతాబ్ధాల మధ్య ఎల్లోరా గుహలను నిర్మించారు.

బాదామీ గుహలు: ఇది కర్ణాటకలోని బాగల్‌కోట్ జిల్లాలో ఉన్నాయి. క్రీస్తు శకం 6 & 7వ శతాబ్ధంలో చాళుక్యులు వీటిని నిర్మించారు.

బొర్రా గుహలు: విశాఖపట్నంకు ఉత్తరాన 90 కిలోమీటర్ల దూరంలో ఉన్నాయి. దాదాపు 150 మిలియన్ సంవత్సరాల వయస్సు కలిగిన ప్రకృతి అద్భుతం ఇది.

ఎలిఫెంటా గుహలు: ఇవి ముంబై నగరానికి 10 కిలోమీటర్ల దూరంలో ఉన్నాయి. 6వ శతాబ్దంలో కృష్ణరాజా అనే మహారాజు వీటిని నిర్మించాడు.

ఖండగిరి గుహలు: భువనేశ్వర్కు సమీపంలో ఖండగిరి గుహలను.. క్రీ. పూ. 2వ శతాబ్దంలో ఖార్వెలా అనే మహారాజు నిర్మించాడు.

మావ్స్‌మై గుహలు: మేఘాలయాలో ఉండే ఈ గుహలు.. సున్నపురాతితో ఎన్నో సంవత్సరాలుగా సహజంగా రూపుదిద్దుకున్నాయి

పాతాలేశ్వర్ గుహలు: క్రీస్తుశకం 8వ శతాబ్ధానికి చెందినవి. మొత్తం గుహను ఏక రాతిపై చెక్కడం విశేషం.

ఉండవల్లి గుహలు: విజయవాడకు కేవలం 8 కిలోమీటర్ల దూరంలో కృష్ణా నది పరివాహిక ప్రాంతంలో ఉన్నాయి. ఈ నిర్మాణాలు విష్ణుకుండిన రాజులకు చెందినవి.