Trump: ట్రంప్‌పై విమర్శలు.. ఒబామా దంపతుల కోతి బొమ్మల వీడియో తొలగింపు
- ట్రంప్ వీడియోపై పెద్ద ఎత్తున విమర్శలు
- ఒబామా దంపతులను కోతి బొమ్మలగా చిత్రీకరిస్తూ వీడియో
- విమర్శల తర్వాత వీడియో తొలగించిన వైట్‌హౌస్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
మాజీ అమెరికా అధ్యక్షుడు ఒబామా, మాజీ ప్రథమ మహిళ మిచెల్ దంపతులను కోతులుగా చిత్రీకరిస్తూ ట్రంప్ సోషల్ మీడియాలో పోస్ట్ చేసిన వీడియోపై పెద్ద ఎత్తున విమర్శలు వెల్లువెత్తాయి. డెమోక్రాట్ నాయకులు తీవ్రంగా ధ్వజమెత్తారు. జాత్యహంకార దాడిగా అభివర్ణించారు. తొలుత విమర్శలను వైట్‌హౌస్ ఖండించినా.. కొద్దిసేపటి తర్వాత దిద్దుబాటు చర్యలు చేపట్టారు. విమర్శులు తీవ్ర రూపం దాల్చడంతో ట్రంప్ సోషల్ మీడియా నుంచి వీడియో తొలగించారు.
సోషల్ మీడియా నుంచి వీడియో తొలగించినట్లుగా వైట్‌హౌస్ ప్రకటించింది. సెనేట్ నుంచి తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవ్వడంతో వీడియో తొలగించినట్లుగా తెలుస్తోంది. దాదాపు 12 గంటల తర్వాత వీడియోను డిలీట్ చేశారు.
Also Read
- Donald Trump honours Satya Nadella: సత్య నాదెళ్ల, ఎలాన్ మస్క్‌కు ట్రంప్ అరుదైన గౌరవం.. ఆరుగురు టెక్ దిగ్గజాలకు అవార్డులు
- Pakistan: పాకిస్థాన్‌ను 15 'ముక్కలు' చేసేందుకు ఆర్మీ కుట్ర?.. దేశవ్యాప్తంగా వెల్లువెత్తుతున్న నిరసనలు!
- US: భారతీయ ఐటీ సంస్థలకు అమెరికా షాక్.. గ్రీన్ కార్డ్ ప్రోగ్రామ్ నుంచి సస్పెన్షన్!
- Saudi-India: ‘అప్రమత్తంగా ఉండండి.. ఇంట్లోనే ఉండండి’.. సౌదీలోని భారతీయులకు కేంద్రం సూచన
బరాక్ ఒబామా.. రెండు పర్యాయలు అగ్ర రాజ్యం అమెరికాను పరిపాలించిన అధ్యక్షుడు. ప్రపంచ దేశాలతో మంచి సంబంధాలు కలిగిన నేతగా గుర్తింపు పొందారు. అలాంటి నేతపై ప్రస్తుత అమెరికా అధ్యక్షుడు ట్రంప్ అనుచిత చర్యకు పాల్పడ్డారు. బరాక్ ఒబామా, మిచెల్ ఒబామా దంపతులను కోతులుగా చిత్రీకరించి ట్రూత్ సోషల్ మీడియాలో ట్రంప్ పోస్ట్ చేశారు. వీడియోలో ‘‘ది లయన్ స్లిప్స్ టునైట్’’ పాట ప్లే అవుతుండగా మాజీ అధ్యక్షుడు బరాక్ ఒబామా, మాజీ ప్రథమ మహిళ మిచెల్ ఒబామా ముఖాలు కోతి రూపాల్లో ఒక క్షణం పాటు కనిపించాయి. అంతేకాకుండా 2020 ఎన్నికల్లో మోసం జరిగిందంటూ ఆరోపణలు గుప్పించారు.
ఇది కూడా చదవండి: Mumbai: ముంబై మేయర్‌గా రీతూ తాన్డే.. డిప్యూటీ మేయర్‌గా సంజయ్ ఘడి ఎన్నిక
అయితే వీడియోపై పెద్ద ఎత్తున విమర్శలు వెల్లువెత్తున్నాయి. ఇది చాలా అసహ్యకరమైన ప్రవర్తన అంటూ కాలిఫోర్నియా గవర్నర్ గవిన్ న్యూసమ్ పేర్కొన్నారు. ‘‘అధ్యక్షుడి అసహ్యకరమైన ప్రవర్తన. ప్రతి ఒక్కరు రిపబ్లికన్ నేత తీరును ఖండించాలి.’’ అని న్యూసమ్ ఎక్స్‌లో రాశారు. చరిత్రలో ట్రంప్ ఒక మచ్చ అని.. ‘‘జాత్యహంకరం’’ అని మాజీ జాతీయ భద్రతా సలహాదారు, ఒబామా సన్నిహితుడు బెన్ రోడ్స్ అభివర్ణించారు. ఇక డెమోక్రాట్ల విమర్శలను ‘‘నకిలీ ఆగ్రహం’’గా వైట్‌హౌస్ కొట్టిపారేసింది. మొత్తానికి సెనేట్ నుంచి కూడా తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవ్వడంతో 12 గంటల తర్వాత వీడియోను వైట్‌హౌస్ తొలగించింది.
U.S. President Donald Trump posted this on Truth Social, which featured the Obamas as monkeys. pic.twitter.com/f0ovYjPnDy
— Open Source Intel (@Osint613) February 6, 2026
తాజావార్తలు
-
Vaibhav Sooryavanshi: “బుడ్డోడి విధ్వంసం”.. ఫోర్లు, సిక్సర్ల వర్షం కురిపించిన వైభవ్.. కోచ్ గంభీర్ ఫిదా!(వీడియో)
-
Donald Trump honours Satya Nadella: సత్య నాదెళ్ల, ఎలాన్ మస్క్‌కు ట్రంప్ అరుదైన గౌరవం.. ఆరుగురు టెక్ దిగ్గజాలకు అవార్డులు
-
BC Reservations Case: బీసీ రిజర్వేషన్ల కేసుపై నేడు సుప్రీంకోర్టులో విచారణ.. 34 శాతం రిజర్వేషన్లపై ఉత్కంఠ!
-
Pakistan: పాకిస్థాన్‌ను 15 ‘ముక్కలు’ చేసేందుకు ఆర్మీ కుట్ర?.. దేశవ్యాప్తంగా వెల్లువెత్తుతున్న నిరసనలు!
-
MS Dhoni: రెండో టీ20 మ్యాచ్‌కు ఎంఎస్ ధోనీ.. ఆ స్టార్ ఓపెనర్ కోసమేనా?.. వైభవ్ కోసం కాదండోయ్!
ట్రెండింగ్
-
Bathroom Design Tips: బాత్రూమ్ ఎంత శుభ్రం చేసినా మళ్లీ తడిగానే ఉంటోందా? కారణం మీ క్లీనింగ్ కాదు.. ఈ సమస్య కావచ్చు!
-
AI Dance Video: “ప్రాంప్ట్ ఇదిగో”.. ఇద్దరు డ్యాన్స్.. కారులో నుంచి మూడో వ్యక్తి ఎంట్రీ! ఈ వైరల్ ఏఐ వీడియోను మీరే ఈజీగా చేసుకోండి..!
-
10,000mAh బ్యాటరీ, IP68/IP69-రేటెడ్ ప్రొటెక్షన్ తో రాబోతున్న Redmi Turbo 6 Max..!
-
Gen Z Side Hustles: జీతం ఒక్కటే సరిపోవడం లేదు.. అదనపు సంపాదన కోసం జెన్‌జీ కొత్త దారులు
-
CM Vijay: 600 కోట్లు చూపించి 30 కోట్లు దాచారా? సీఎం విజయ్ పిటిషన్‌పై హైకోర్టు కీలక వ్యాఖ్యలు.!