Vaibhav Sooryavanshi: ‘సూర్యవంశీ వైభవ్‌ను అరెస్ట్ చేయాలి’.. ఐస్లాండ్ క్రికెటర్స్ షాకింగ్ డిమాండ్!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Vaibhav Sooryavanshi: క్రికెట్ ప్రపంచం మొత్తం ప్రస్తుతం భారత్ వైపు చూస్తోంది. దానికి ఏకైక కారణం 14 ఏళ్ల కుర్రాడు. కేవలం 14 ఏళ్ల వయసులోనే వైభవ్ సూర్యవంశీ అనే పేరు ప్రపంచ క్రికెట్‌ను షేక్ చేసింది. హరారే వేదికగా జరిగిన అండర్-19 వరల్డ్‌కప్ 2026 ఫైనల్లో ఆడిన ఇన్నింగ్స్ చూస్తే ఇది పిల్లల ఆట కాదని అందరికీ అర్థమైంది. ఇంగ్లండ్ బౌలర్లపై అతడు చూపిన దూకుడు చూసి క్రికెట్ ప్రపంచం నిశ్శబ్దమైపోయింది. ఫైనల్ లాంటి పెద్ద మ్యాచ్‌లోనూ వైభవ్ ఎలాంటి ఒత్తిడి లేకుండా బ్యాట్ పట్టాడు. మొదటి బంతి నుంచే ఇంగ్లండ్ బౌలర్లపై దాడి మొదలుపెట్టాడు. బౌండరీలు, సిక్సర్లు వరుసగా వస్తుండటంతో స్టేడియంలో ఉన్నవాళ్లంతా ఆశ్చర్యపోయారు. టీవీల ముందు కూర్చున్న అభిమానులు కూడా కళ్లార్పకుండా చూశారు. ఈ ఇన్నింగ్స్ సోషల్ మీడియాలో పెద్ద చర్చకు దారి తీసింది.
READ MORE: Minister Ramprasad Reddy: క్వాంటమ్ వ్యాలీతో ఇకపై అమరావతి వేగంగా అభివృద్ధి..
Also Read
- India Retail Inflation Rises: సామాన్యులకు ధరల సెగ.. సెప్టెంబర్‌లో పెరిగిన రిటైల్ ద్రవ్యోల్బణం..
- Hyderabadi Dalcha Recipe: అన్నంలోకి అదిరిపోయే సైడ్ డిష్.. ఇంట్లోనే అసలైన హైదరాబాదీ దాల్చా..
- Srisailam Reservoir: వరల్డ్ బుక్ ఆఫ్ రికార్డ్స్‌లో శ్రీశైలం జలాశయం.. దేశంలోనే తొలి ప్రాజెక్టుగా గుర్తింపు
- AP Mayor Reservations: ఏపీ మేయర్ రిజర్వేషన్లు ఖరారు.. పూర్తి జాబితా ఇదే
ఒక ప్రత్యేక పోస్ట్ వైరల్‌గా మారింది. ఇది ఐస్లాండ్ క్రికెట్ చేసిన సరదా ట్వీట్. వైభవ్ ఇంగ్లండ్ బౌలర్లను ఇలా చితక్కొట్టడంతో “వెంటనే వైభవ్ సూర్యవంశీని అరెస్ట్ చేయాలి” అంటూ సరదాగా ట్వీట్ చేశారు. “ఇంగ్లండ్ బౌలర్లపై మైదానంలో జరుగుతున్న ఈ హింస X-రేటెడ్” పేర్కొన్నారు. వాళ్ల రాతలు సోషల్ మీడియాలో నవ్వులు పూయించాయి. ఇది విమర్శ కాదు, వైభవ్ ఆటను పొగడ్తలతో చెప్పిన హాస్యమే. ఇప్పటికే తన ఫన్నీ పోస్టులతో ఫేమస్ అయిన ఐస్లాండ్ క్రికెట్, ఈసారి అభిమానులను ఆకట్టుకుంది. ఆ ట్వీట్‌ను వేల మంది షేర్ చేశారు.
నిజం చెప్పాలంటే వైభవ్ నిన్న ఆడిన మ్యాచ్ సాధారణ ఇన్నింగ్స్ కాదు. టోర్నీ ఫైనల్లో 175 పరుగులు చేయడం అంటే చిన్న విషయం కాదు. అతడు కొట్టిన షాట్లు చూస్తే, బంతి ఎక్కడ పడుతుందో బౌలర్లకే అర్థం కాలేదు. 15 ఫోర్లు, 15 సిక్సర్లు చాలా సులువుగా బాదాడు. పేస్ బౌలింగ్, స్పిన్, షార్ట్ బాల్స్, స్లో బాల్స్ ఏదీ అతడిని ఆపలేకపోయింది. రన్ రేట్ ఎప్పుడూ తగ్గలేదు. కెప్టెన్ ఆయుష్ మాథ్రేతో కలిసి వైభవ్ భారీ భాగస్వామ్యం నెలకొల్పాడు. ఇద్దరూ కలిసి ఇంగ్లండ్‌ను పూర్తిగా డిఫెన్స్‌లోకి నెట్టేశారు. డబుల్ సెంచరీకి కేవలం 25 పరుగుల దూరంలో వైభవ్ అవుట్ అయ్యాడు. ఒకవేళ ఆ 200 వచ్చి ఉంటే అండర్-19 వరల్డ్‌కప్ చరిత్రలో అతడు మరింత ప్రత్యేకంగా నిలిచేవాడు. అయినా సరే, ఫైనల్లో చేసిన 175 పరుగులే ఇప్పటివరకు అత్యధిక వ్యక్తిగత స్కోర్‌గా నిలిచాయి.
Someone arrest Vaibhav Sooryavanshi right now. This violence on the field against the English bowlers is X-rated!
— Iceland Cricket (@icelandcricket) February 6, 2026
తాజావార్తలు
-
India Retail Inflation Rises: సామాన్యులకు ధరల సెగ.. సెప్టెంబర్‌లో పెరిగిన రిటైల్ ద్రవ్యోల్బణం..
-
CM Revanth Reddy : దేశంలో మరో స్వతంత్ర పోరాటం తప్పదు
-
Pakistan Army Plane Crash: పాకిస్థాన్‌లో కూలిన ఆర్మీ శిక్షణ విమానం.. ఇద్దరు పైలట్లు మృతి
-
Hyderabadi Dalcha Recipe: అన్నంలోకి అదిరిపోయే సైడ్ డిష్.. ఇంట్లోనే అసలైన హైదరాబాదీ దాల్చా..
-
Coolpad Wide-Screen: రూ.13 వేలకే Coolpad వైడ్‌స్క్రీన్ ఫోన్? 16:10 డిస్ప్లే, Helio G99 చిప్సెట్తో రానుందా?
ట్రెండింగ్
-
Prince Yadav: 6 బంతులు.. 3 ఫోర్లు.. 13 పరుగులు.. ప్రిన్స్ యాదవ్ అరుదైన రికార్డు!
-
T20 Captain Record: ధోనీ, కోహ్లీని వెనక్కి నెట్టి అరుదైన రికార్డు కొల్లగొట్టిన టీమిండియా కెప్టెన్..!
-
Ranji Trophy: బ్యాట్‌తో మోత మోగించిన రవీంద్ర జడేజా.. ఫస్ట్ క్లాస్ క్రికెట్లో 16వ సెంచరీ నమోదు..!
-
iPhone 17 Pro vs iPhone 18 Pro.. కేవలం ఈ అప్‌డేట్స్ కోసం కొత్త ఫోన్ అవసరమా.?
-
Arshdeep Singh: టీ20ల్లో ఇదే నాకు అసలైన ఛాలెంజ్.. అర్ష్‌దీప్ కామెంట్స్ వైరల్..!