India-US Trade Deal: భారత్ మ్యాప్ విడుదల చేసిన అమెరికా.. పాకిస్థాన్‌కు స్ట్రాంగ్ సందేశం
- భారత్ మ్యాప్ విడుదల చేసిన అమెరికా
- పాకిస్థాన్‌కు వాషింగ్టన్ స్ట్రాంగ్ సందేశం
- భారత్-యూఎస్ మధ్య కుదిరిన వాణిజ్య ఒప్పందం
- Follow Us :
-
-
Add as a preferred
source on google
భారత్-అమెరికా మధ్య సంబంధాలు చాలా దృఢంగా బలపడుతున్నాయి. మోడీ-ట్రంప్ ఫోన్ కాల్ సంభాషణ తర్వాత అనూహ్యంగా రెండు దేశాల మధ్య కీలక వాణిజ్య ఒప్పందం జరిగింది. భారత్‌పై సుంకాన్ని 18 శాతానికి తగ్గిస్తున్నట్లు ట్రంప్ ప్రకటించారు. తాజాగా ఆ ఒప్పందంపై అధికారికంగా ముసాయిదా కూడా విడుదలైపోయింది. భారత్‌పై జరిమానాగా విధించిన 25 శాతం సుంకాన్ని పూర్తిగా తొలగించినట్లుగా అమెరికా ప్రకటించింది. దీంతో రెండు దేశాల మధ్య సంబంధాలు స్ట్రాంగ్ అయ్యాయి.
ఇక భారత్-అమెరికా మధ్య జరిగిన వాణిజ్య ఒప్పందం చట్రంలో కాశ్మీర్ మ్యాప్‌తో కూడిన భారతదేశ చిత్రాన్ని అగ్ర రాజ్యం విడుదల చేసింది. జమ్మూకాశ్మీర్ భారతదేశంలో అంతర్భాగంగా పేర్కొంటూ భారతదేశ చిత్ర పటాన్ని అమెరికా వాణిజ్య ప్రతినిధి కార్యాలయం విడుదల చేసింది. ఈ చిత్రంతో జమ్మూకాశ్మీర్.. భారతదేశంలో అంతర్భాగంగా తేల్చి చెప్పింది. దీంతో దాయాది దేశం పాకిస్థాన్‌కు అమెరికా స్ట్రాంగ్ సందేశం పంపించింది.
Also Read
- Ukraine War: రష్యాపై ఉక్రెయిన్ అతిపెద్ద దాడి.. 1000కి పైగా డ్రోన్లతో కల్లోలం..
- Global Fuel Crisis: అమెరికా, ఫ్రాన్స్, బ్రిటన్‌లో రికార్డ్ స్థాయికి చేరిన డీజిల్, పెట్రోల్ ధరలు.. నెక్ట్స్ భారత్ వంతేనా?
- PIA Uniform Makeover: పాకిస్థాన్ ఎయిర్‌లైన్స్‌పై ట్రోలింగ్.. కొత్త యూనిఫామ్‌పై నెటిజన్ల ప్రశ్నలు..
- Iran-US Talks: అమెరికాతో చర్చలకు ఇరాన్ 7 షరతులు.. ట్రంప్ తిరస్కరిస్తే నిర్ణాయక యుద్ధానికి సిద్ధమంటూ హెచ్చరిక
జమ్మూకాశ్మీర్ విషయంలో భారత్-పాకిస్థాన్ మధ్య చాలా కాలంగా వివాదం నడుస్తోంది. అయితే తాజాగా పాకిస్థాన్‌కు అత్యంత విశ్వసనీయ మిత్రదేశాల్లో ఒకటైన యునైటెడ్ స్టేట్స్ బిగ్ షాకిచ్చింది. కాశ్మీర్.. భారతదేశంలో అంతర్భాగంగా ఆమోద ముద్ర వేసింది. పాకిస్థాన్ చట్టవిరుద్ధంగా ఆక్రమించిన పాకిస్థాన్ ఆక్రమిత కాశ్మీర్ భారతదేశంలో భాగంగా అమెరికా వాణిజ్య ప్రతినిధి కార్యాలయం ఒక ఫొటోను విడుదల చేసింది.

పాకిస్థాన్‌కు అమెరికా గట్టిగానే బుద్ధి చెప్పింది. ఈ మధ్య అమెరికాతో పాకిస్థాన్ ప్రధాని షెహబాజ్ షరీఫ్, ఆర్మీ చీఫ్ అసిమ్ మునీర్ చాలా దగ్గరగా ఉంటున్నారు. అయినా వారి చెప్పేదంతా అబద్ధాలుగా తేల్చేస్తూ ఝలక్ ఇచ్చింది. తాజాగా విడుదల చేసిన భారతదేశ చిత్రంతో దాయాది దేశానికి భారీ షాక్ తగిలినట్లుగానే భావించవచ్చు.
Not a good News for Pakistan.
US Trade Representative’s Office has released India Map which shows entire J&K including PoK as part of India. Usually there is a clear demarcation. US agrees with India political map. pic.twitter.com/ke7ii0nlZS
— Aditya Raj Kaul (@AdityaRajKaul) February 7, 2026
తాజావార్తలు
-
SIR Notice: ఎల్కే అద్వానీకి SIR నోటీసులు..
-
రష్మికను ఇలా ఎప్పుడూ చూడలేదు.. MYSAA టీజర్లో యాక్షన్ పీక్స్!
-
Yogi Adityanath: హమీద్ అన్సారీ ‘హిందూ’ వ్యాఖ్యలపై యోగి ఘాటు కౌంటర్
-
The Paradise: నాని ‘ది ప్యారడైజ్’కు తెలంగాణ సర్కార్ గుడ్ న్యూస్.. టికెట్ రేట్లు పెంపు, స్పెషల్ షోలకు ఓకే!
-
Komatireddy Venkat Reddy : కేటీఆర్ నోరు అదుపులో పెట్టుకోవాలి.. మంత్రి కోమటిరెడ్డి హాట్ కామెంట్స్..
ట్రెండింగ్
-
Asian Games 2026: బంగ్లాదేశ్‌పై భారత్ ఘన విజయం.. బంగారు పతకం కొసం ఫైనల్లో శ్రీలంకతో అమితుమీ.!
-
200MP + 200MP కెమెరాలు, 8,500mAh బ్యాటరీతో వచ్చేస్తున్న Xiaomi 18 Pro సిరీస్..!
-
Shafali Verma: ఆకాశమే హద్దుగా సిక్సర్ల సునామీ.. షఫాలీ వర్మ అద్భుత సెంచరీ..! బంగ్లాకు భారీ టార్గెట్!
-
Karivepaku Kaaram Podi: ముద్దగ కాకుండా.. పొడిపొడిగా, పర్ఫెక్ట్గా “కరివేపాకు కారప్పొడి” కావాలా.? ఇంకెందుకు ఆలస్యం ఇలా ఫాలో అవ్వండంతే..!
-
11,000mAh బ్యాటరీ, IP68+IP69+IP69K రేటింగ్స్, 108MP కెమెరాతో వచ్చేస్తున్న Honor X9e ప్రో..!