Tirumala Laddu Controversy: తిరుమల లడ్డూలో కల్తీ నెయ్యి.. కేంద్రమంత్రి శ్రీనివాస వర్మ సంచలన వ్యాఖ్యలు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Tirumala Laddu Controversy: కేంద్ర మంత్రి భూపతిరాజు శ్రీనివాస వర్మ తిరుమల లడ్డూలో కల్తీ నెయ్యి ఘటనపై సంచలన వ్యాఖ్యలు చేశారు. వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలను టార్గెట్ చేస్తూ, NDDB రిపోర్ట్ ఆధారంగా అవినీతి, టెండర్ లో మినహాయింపులు మరియు నిబంధనల ఉల్లంఘనలకు పాల్పడ్డారని ఆరోపించారు.. లడ్డూల తయారీకి ఉపయోగిస్తున్న నెయ్యిలో కల్తీ జరిగిందన్న ఆయన.. ఈ వ్యవహారంలో వైసీపీ నేతల వాదనలు హాస్యాస్పదంగా ఉన్నాయని మండిపడ్డారు.. వైసీపీ నేతల్లా అమ్మనా భూతులు తిట్టాలా..? లడ్డూ విషయంలో చాలా క్లీయర్ గా ఉన్నాం.. కల్తీ నెయ్యి విషయంలో పెద్ద ఎత్తు అవకతవకలు జరిగాయని పేర్కొన్నారు.
Also Read
- YS Jagan : రాయలసీమ హార్టికల్చర్‌పై చంద్రబాబువి అంకెల గారడీలు
- Sajjala Ramakrishna Reddy : లోకల్ ఎలక్షన్స్‌కు వైసీపీ లీగల్ టీమ్ రెడీ.. సజ్జల కీలక ఆదేశాలు
- Pan IIT Summit : చంద్రబాబు చూపు ఈవీపై.. ఏపీకి కొత్త టెక్నాలజీ ప్లాన్..
- Minister Nara Lokesh: స్పీడ్.. సర్వీస్.. స్టెబిలిటీ.. ఏపీ అభివృద్ధిపై మంత్రి లోకేష్ కీలక వ్యాఖ్యలు
వైవీ సుబ్బారెడ్డి, భూమన కరుణాకర్ రెడ్డి, చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి కల్తీ జరిగిందని ఒప్పుకున్నారు.. ఆ ముగ్గురు ఆ సమయంలో కలసి పని చేశారని తెలిపారు శ్రీనివాస వర్మ.. కానీ, ఇప్పుడు వైసీపీ నేతల మాటలు హాస్యాస్పదంగా ఉన్నాయి.. జంతువుల కొవ్వు కలిసిందని NDDB రిపోర్టు బయట పెట్టింది… దాన్నే ముఖ్యమంత్రి చంద్రబాబు బయట పెట్టారు.. ఆ రిపోర్టును కూటమి ప్రభుత్వం ఏమీ తయారు చేయలేదు కదా? అని ప్రశ్నించారు.. భోలే బాబాకు అసలు పాల ఉత్పత్తి లేదు.. డైరీ లేదు… పాలు లేదు కాని.. నెయ్యి చేశారు అని ఆవేదన వ్యక్తం చేశారు..
వైఎస్ జగన్‌కు క్లీన్‌చీట్ ఎవరు ఇచ్చారు.. చూపించండి? అని నిలదీశారు శ్రీనివాస వర్మ.. అయితే, వైవీ సుబ్బారెడ్డి కల్తీ జరిగిందని.. తప్పు చేశామని ఒప్పుకున్నారు.. జగన్‌కు ఏంటి బాధ.. రికార్డులను ట్యాంపరింగ్ చేస్తే శిక్ష తప్పదు.. అలాంటి అవకాశం లేదు అని స్పష్టం చేశారు.. టెండర్లు నిబంధనలలో పెద్దఎత్తున మార్పులు చేశారు.. కేవలం అవినీతి కోసం అలా చేశారు.. ఆ నెయ్యితోనే స్వామివారికి హారతి ఇస్తాం… అలాంటి నెయ్యిని కల్తీ చేశారు అని మండిపడ్డారు.. 2022లో రిపోర్ట్ ఇస్తే.. ఎందుకు చర్యలు తీసుకోలేదు..? అని ప్రశ్నించారు.. అర్హత లేనివారికి ఎలా నెయ్యి కాంట్రాక్టు ఇస్తారు…? అని నిలదీశారు కేంద్ర మంత్రి భూపతిరాజు శ్రీనివాస వర్మ.
తాజావార్తలు
-
Singeetam Srinivasa Rao: టాలీవుడ్లో విషాదం.. ప్రముఖ దర్శకుడు సింగీతం శ్రీనివాసరావు కన్నుమూత
-
Story Board : తెలుగు రాష్ట్రాల్లో కమ్ముకొస్తున్న తాగునీటి కొరత
-
Akbaruddin Owaisi : వచ్చే ఎన్నికల్లో పోటీ చేయను.. ఎంఐఎం ఎమ్మెల్యే అక్బరుద్దీన్ ఓవైసీ సంచలన వ్యాఖ్యలు
-
OTR: కౌన్ బనేగా ఎమ్మెల్సీ? ఆ లక్కీ లీడర్ ఎవరు?
-
Mad Sandhu: ప్రముఖ పంజాబీ ఇన్ఫ్లుయెన్సర్ దారుణహత్య.. నడిరోడ్డుపై కాల్చి చంపిన దుండగులు..
ట్రెండింగ్
-
National Boyfriend Day: మీ ప్రేమను మరింత స్పెషల్‌గా మార్చే సింపుల్ టిప్స్.!
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!
-
Rajasthani Dal Baati: నోట్లో వేస్తే కరిగిపోయే నెయ్యి బాటీలు, ఘాటైన దాల్ కాంబినేషన్ ఇలా చేయండి..!