Virat Kohli-India U19: మన ఆధిపత్యం కొనసాగుతోంది.. భారత్ అండర్-19 జట్టుకు కోహ్లీ విషెష్!
- 2026 అండర్-19 వరల్డ్‌కప్ భారత్ సొంతం
- భారత్ యువ జట్టుపై కోహ్లీ ప్రశంసలు
- మన ఆధిపత్యం కొనసాగుతోంది అంటూ కామెంట్స్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Virat Kohli Praises India U19 Team: అండర్-19 వరల్డ్‌కప్‌లో భారత్ మరోసారి తన ఆధిపత్యాన్ని చాటింది. శుక్రవారం జరిగిన ఫైనల్ మ్యాచ్‌లో ఇంగ్లాండ్‌పై ఘన విజయం సాధించి రికార్డు స్థాయిలో ఆరోసారి ట్రోఫీని సొంతం చేసుకుంది. ఈ ఏకపక్ష ఫైనల్‌లో భారత్ యువ జట్టు చూపిన ప్రదర్శన ప్రపంచ క్రికెట్ దృష్టిని ఆకర్షించింది. ముఖ్యంగా 14 ఏళ్ల యువ సంచలనం వైభవ్ సూర్యవంశీ చరిత్ర సృష్టించిన ఇన్నింగ్స్ మ్యాచ్‌కే హైలైట్‌గా నిలిచింది. ఈ అద్భుత విజయంపై భారత క్రికెట్ దిగ్గజం విరాట్ కోహ్లీ హర్షం వ్యక్తం చేశాడు. 2008లో అండర్-19 వరల్డ్‌కప్ గెలిచిన కెప్టెన్ కోహ్లీ ఈ విజయం ఎంతో ప్రత్యేకమని పేర్కొన్నాడు.
‘మరోసారి అండర్-19 వరల్డ్‌కప్ గెలిచిన భారత యువ జట్టుకు అభినందనలు. వయో కేటగిరీ క్రికెట్‌లోనే కాదు.. దాని తర్వాతి స్థాయిల్లోనూ మన ఆధిపత్యం కొనసాగుతోంది. అండర్-19 జట్టు, సపోర్ట్ స్టాఫ్‌కు శుభాకాంక్షలు’ అని విరాట్ కోహ్లీ సోషల్ మీడియాలో పోస్టు చేశారు. భారత యువ క్రికెట్ వ్యవస్థ ఎంత బలంగా ఉందో ఈ విజయం మరోసారి రుజువు చేస్తోందని కింగ్ అభిప్రాయపడ్డారు. అండర్-19 స్థాయిలో భారత జట్టు సాధిస్తున్న వరుస విజయాలే భవిష్యత్తులో సీనియర్ టీమిండియా బలంగా నిలవడానికి పునాది అని కోహ్లీ చెప్పుకొచ్చారు. గతంలో కోహ్లీ కూడా అండర్-19 వరల్డ్‌కప్ గెలిచిన కెప్టెన్ కావడంతో.. యువ ఆటగాళ్ల విజయానికి కింగ్ స్పందన మరింత ప్రత్యేకంగా మారింది.
Also Read
- Shai Hope: నా దగ్గర ఆ బ్యాట్స్ ఉన్నాయి.. అందుకే బంతి బౌండరీలు దాటుతోంది.. విండీస్ కెప్టెన్ ఆసక్తికర వ్యాఖ్యలు!
- Danish Kaneria: “పోలీసులు టాస్ గెలిస్తే బ్యాటింగ్ ఎంచుకోవాలి”.. సీజేపీ నిరసనలపై పాకిస్థాన్ మాజీ క్రికెటర్ సంచలన పోస్ట్..
- IPL 2027-CSK: సీఎస్కేలో ఏం జరుగుతోంది.. మొన్న ఇద్దరు, ఇవాళ మరొక కోచ్ అవుట్!
- Shreyas Iyer Records: అయ్యో అయ్యర్.. నీకే ఎందుకిలా.? ఖాతాలో అరుదైన చెత్త రికార్డు..!
Also Read: iPhone 17e Launch: డైనమిక్ ఐలాండ్, సరికొత్త చిప్.. అతి తక్కువ ధరలో ‘ఐఫోన్ 17ఈ’!
ఆరోసారి అండర్-19 వరల్డ్‌కప్‌ను గెలవడం భారత క్రికెట్ చరిత్రలోనే అరుదైన ఘనత. ఈ విజయం యువ ఆటగాళ్ల ప్రతిభకు, కోచింగ్ స్టాఫ్ కృషికి నిదర్శనంగా నిలుస్తోంది. విరాట్ కోహ్లీ లాంటి దిగ్గజ ఆటగాళ్ల నుంచి వస్తున్న ప్రశంసలు యువ క్రికెటర్లకు మరింత ఉత్సాహాన్ని అందిస్తాయని క్రికెట్ వర్గాలు అభిప్రాయపడుతున్నాయి. ఇక ఫైనల్ మ్యాచ్‌లో భారత విజయంకు ప్రధాన కారణం వైభవ్ సూర్యవంశీ ఆడిన అసాధారణ ఇన్నింగ్స్. ఇంగ్లాండ్ బౌలర్లపై విరుచుకుపడ్డ ఈ టీనేజ్ సంచలనం కేవలం 80 బంతుల్లోనే 175 పరుగులు చేశాడు. అతడి ఇన్నింగ్స్‌లో 15 సిక్సులు, 15 ఫోర్లు ఉండటం విశేషం.
తాజావార్తలు
-
Shai Hope: నా దగ్గర ఆ బ్యాట్స్ ఉన్నాయి.. అందుకే బంతి బౌండరీలు దాటుతోంది.. విండీస్ కెప్టెన్ ఆసక్తికర వ్యాఖ్యలు!
-
Danish Kaneria: “పోలీసులు టాస్ గెలిస్తే బ్యాటింగ్ ఎంచుకోవాలి”.. సీజేపీ నిరసనలపై పాకిస్థాన్ మాజీ క్రికెటర్ సంచలన పోస్ట్..
-
Tollywood Movie Releases: కుర్రళ్లోయ్.. కుర్రాళ్లు..! బాక్సాఫీస్ వద్ద యంగ్ హీరోల దండయాత్ర..
-
Alias Rukmini Heroine: ‘అలియాస్ రుక్మిణీ’.. టైటిల్ రోల్ పోషించేది ఈమేనా?
-
AP BC Reservations: స్థానిక సంస్థల్లో బీసీలకు 28.1 శాతం.. పార్టీ పరంగా మరో 6 శాతం
ట్రెండింగ్
-
3D ఎఫెక్ట్‌తో మెకానికల్ లుక్.. లిక్విడ్ కూలింగ్ సిస్టమ్‌తో భారత్‌లోకి Infinix GT 50 Pro..!
-
కొత్త అల్లాయ్ వీల్స్, అప్డేటెడ్ లుక్ తో Toyota Fortuner 2026 Leader ఎడిషన్ లాంచ్.. ధర ఎంతంటే.?
-
IND vs WI: 249 పరుగులు చేసినా ఓటమి తప్పలేదు.. భారత్ కొంపముంచిన 5 కారణాలు ఇవే!
-
Hair Combs Cleaning: ₹1 ఖర్చుతో దువ్వెనలను ఇలా క్లీన్ చేయండి.. మీ జుట్టుకు చేరే మురికి, బ్యాక్టీరియా మాయం.!
-
Crispy Snacks: నూనెను ఎక్కువగా పీల్చుకోకుండా బొంబాయి రవ్వతో ‘క్రిస్పీ బైట్స్’.. తినడం మొదలు పెడితే గిన్నె ఖాళీ కావాల్సిందే.!