Vikrant Massey: ఇది ముగింపు కాదు, కేవలం విరామం మాత్రమే.. !
- Follow Us :
-
-
Add as a preferred
source on google
సీరియల్స్‌తో కెరీర్ మొదలుపెట్టి, ‘ట్వెల్త్ ఫెయిల్’ వంటి సెన్సేషనల్ హిట్‌తో స్టార్‌డమ్ అందుకున్న విక్రాంత్ మాస్సే, 2024 చివర్లో తన రిటైర్మెంట్ గురించి చేసిన పోస్ట్ అందరినీ దిగ్భ్రాంతికి గురిచేసింది. ఒక నటుడిగా ఎదుగుతున్న సమయంలోనే సినిమాలకు గుడ్ బై చెప్పడం ఏంటి అని అభిమానులు ఆందోళన చెందారు. అయితే, ఆ నిర్ణయం వెనుక ఉన్న ఉద్దేశం అది కాదని ఆయన తాజా ఇంటర్వ్యూలో వెల్లడించారు. తాను చెప్పాలనుకున్న విషయాన్ని క్లుప్తంగా చెప్పడం వల్లే అందరూ తప్పుగా అర్థం చేసుకున్నారని, తన ప్రయాణం ఇంకా ముగియలేదని ఆయన స్పష్టం చేశారు.
Also Read : D55 :ధనుష్-రాజ్‌కుమార్ పెరియసామి మూవీ షురూ.. ఒకే ఫ్రేమ్‌లో సాయి పల్లవి, శ్రీలీల.. క్రేజీ మల్టీస్టారర్!
Also Read
- ఆఫర్లే ఆఫర్‌లు.. OnePlus Festive Sale వచ్చేసిందోచ్.. వాటిపై భారీ డిస్కౌంట్స్.!
- Road Accident: లారీ-ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు ఢీ.. బస్సులో 30 మంది ప్రయాణికులు.?
- GST Scam: భారీ జీఎస్టీ స్కామ్.. అమాయకుల పత్రాలతో కోట్ల లావాదేవీలు.!
- Luxury Sneakers: జెన్ జీ, మిలీనియల్స్‌ను తెగ ఆకర్షిస్తున్న స్నీకర్స్.. అంత స్పెషల్ ఏంటో తెలుసా..?
విక్రాంత్ మాస్సే మాట్లాడుతూ.. ‘వరుస ప్రాజెక్టులతో నేను తీవ్రమైన శారీరక, మానసిక ఒత్తిడికి లోనయ్యాను. రోజుకు 14 నుంచి 16 గంటలు పని చేయడం, ఏడాదికి నాలుగు సినిమాలు పూర్తి చేయడం చాలా కష్టంగా అనిపించింది. నా కుటుంబానికి తగినంత సమయం కేటాయించలేక పోయాననే భావన నన్ను వేధించింది. అందుకే కొన్ని నెలల పాటు నటనకు విరామం ఇచ్చి, నా వ్యక్తిగత జీవితంపై దృష్టి పెట్టాలని నిర్ణయించుకున్నాను. అంతే తప్ప శాశ్వతంగా సినిమాలకు దూరమవుతానని నేను ఎక్కడా చెప్పలేదు’ అని వివరించారు. ఈ 7 నెలల విరామం తనకు ఎంతో ఊరటనిచ్చిందని, ఇప్పుడు కొత్త ఉత్సాహంతో మళ్ళీ సినిమాలను అంగీకరిస్తున్నట్లు ఆయన పేర్కొన్నారు. ప్రస్తుతం విక్రాంత్ చేతిలో కొన్ని ఆసక్తికరమైన ప్రాజెక్టులు ఉండగా, త్వరలోనే ఆయన మళ్లీ వెండితెరపై అలరించనున్నారు.
తాజావార్తలు
-
Komaki MG-Pro+ Electric Scooter: రూ.85,999కే 150+KM రేంజ్.. 4 వేరియంట్లతో వచ్చిన ఈ ఎలక్ట్రిక్ స్కూటర్ అదిరింది!
-
ఆఫర్లే ఆఫర్‌లు.. OnePlus Festive Sale వచ్చేసిందోచ్.. వాటిపై భారీ డిస్కౌంట్స్.!
-
Road Accident: లారీ-ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు ఢీ.. బస్సులో 30 మంది ప్రయాణికులు.?
-
GST Scam: భారీ జీఎస్టీ స్కామ్.. అమాయకుల పత్రాలతో కోట్ల లావాదేవీలు.!
-
Russia Mystery Pneumonia: రష్యాలో మిస్టరీ న్యూమోనియా కలకలం.. ల్యాబ్ ఉద్యోగి మృతి, 197 మందికి క్వారంటైన్
ట్రెండింగ్
-
Family Secrets Leak : ఇంటి గుట్టు లంకేశ్వరుడికి ఎరుక.. కుటుంబ రహస్యాలు పొరుగువారికి చేరుతున్నాయా.?
-
World Teachers Day 2026 : చాట్‌జీపీటీ అన్నీ చెప్పేస్తుందా.. మరి టీచర్ ఎందుకు కావాలి.?
-
Shreyas Iyer: పాకిస్థాన్ బ్యాటర్లు భయపెట్టారు.. గోల్డ్ మెడల్ పోతుందనుకున్నా.. అతడే కాపాడాడు!
-
National Boyfriend Day: మీ ప్రేమను మరింత స్పెషల్‌గా మార్చే సింపుల్ టిప్స్.!
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..