India-US Trade Deal: భారత రైతులకు రక్షణ.. ట్రేడ్ డీల్‌లో ఎవరికి ఎంత లాభం.. వివరాలు..
- భారత్ అమెరికా ట్రేడ్ డీల్.. రైతులు, డైరీ రంగానికి పూర్తి రక్షణ..
- భారత ఉత్పత్తులకు యూఎస్ మార్కెట్..
- వ్యవసాయేతర రంగాల్లోని యూఎస్ ఉత్పత్తులపై సుంకం తగ్గింపు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
India-US Trade Deal: భారత్, అమెరికా మధ్య కుదిరిన ట్రేడ్ డీల్ వివరాలను కేంద్ర వాణిజ్య మంత్రి పీయూష్ గోయల్ శనివారం వెల్లడించారు. ఈ డీల్‌లో భారతీయ రైతులు, పాడి పరిశ్రమకు, గ్రామీణ ఉపాధికి ఎలాంటి హాని కలగదని హామీ ఇచ్చారు. దేశంలో సున్నిత రంగాలను రక్షిస్తూనే, భారతీయ తయారీ, టెక్ ఉత్పత్తులకు అమెరికా విస్తృత మార్కెట్ లభిస్తుందని చెప్పారు. అమెరికా భారతీయ ఉత్పత్తులపై సుంకాలను సుమారుగా 50 శాతం నుంచి 18 శాతానికి తగ్గించింది. ఇది ఇతర దేశాలు ఎదుర్కొంటున్న సుంకాలతో పోలిస్తే చాలా తక్కువ. ఇదే సమయంలో దేశీయ ఉపాధికి ముప్పు కలిగించే రంగాల్లోకి అమెరికాను అనుమతించలేదు. ఈ ఒప్పందం రైతులను పూర్తిగా రక్షిస్తూనే, అధిక విలువ కలిగిన రంగాలలో భారత ఎగుమతి అవకాశాలను విస్తరిస్తుంది.
భారతదేశంలో పూర్తిగా రక్షించబడేవి.
Also Read
- CJP: కాక్రోచ్‌లంతా అస్సామేనా..? రాంకా అరెస్ట్.. దీప్కే కూడా అరెస్ట్ చేస్తారా?
- LNG Train: రైల్వే ప్రయాణికులకు శుభవార్త.. దేశంలో తొలి LNG రైలుకు గ్రీన్ సిగ్నల్..
- Bank Strike: సెప్టెంబర్ 28 నుంచి మూడు రోజుల బ్యాంక్ సమ్మె.. కారణం ఇదే
- Parvesh Verma Slap Row: ఆప్ ఎమ్మెల్యేతో వాగ్వాదం.. యువకుడిని కొట్టిన ఢిల్లీ మంత్రి..
- వ్యవసాయం
ఈ రంగాల్లో భారత్ సుంకాలను యథాతథంగా ఉంచుతుంది. ప్రధాన పంటలు, ఆహారా పదార్థాలు, రైతులకు మద్దతు ఇచ్చే ఆహార ఉత్పత్తుల్ని భారత్ రక్షించింది.
*గోధుమలు
*బియ్యం
*మొక్కజొన్న
*సోయా మరియు నూనెగింజలు
*పౌల్ట్రీ మరియు అనేక మాంసం వర్గాలు
*ఇథనాల్
*పొగాకు
వీటిపై అధిక సుంకాలు కొనసాగుతాయి. యూఎస్ ఎగుమతిదారులకు కొత్తగా ఎలాంటి ప్రవేశం లేదు.
2) సురక్షితంగా భారత పాడి పరిశ్రమ..
భారత్‌లో పాడిరంగం 100 శాతం సురక్షితంగా ఉంది. పాల ఉత్పత్తులలోకి అమెరికాకు యాక్సెస్ ఇవ్వలేదు.
*చీజ్
*వెన్న
*నెయ్యి
*క్రీమ్
*పెరుగు
*మజ్జిగ
*పనీర్
3) కూరగాయలు, పండ్లు, ప్రాసెస్ చేసిన ఆహారాలు, తాజా, ప్రోజెన్, ఎండిన, క్యాన్డ్ ఐటమ్స్‌కు పూర్తిగా రక్షణ లభించింది.
*కూరగాయలు( బంగాళాదుంపలు, వెల్లుల్లి, పుట్టగొడుగులు, పొట్లకాయలు, ఓక్రా, పచ్చిమిర్చి, బఠానీలు, బీన్స్, గుమ్మడికాయలు, ఇతర కూరగాయలు)
*ప్రాసెస్ చేసిన కూరగయాలు (ప్రోజెన్ బంగాళాదుంపలు, బఠానీలు, బీన్స్, మిక్సుడ్ వెజిటేబుల్స్, డబ్బాలో నిల్వ చేసే కూరగాయలు, పుట్టగొడుగులు)
* ఎండిన కూరగాయలు, పప్పులు (ఎండిన ఉల్లిపాయలు, వెల్లుల్లి, డీహైడ్రేటెడ్ పొడులు, పచ్చి బఠానీలు, కాబూలి చనా, బీన్స్, చిలగడదుంపలు)
* సున్నితమైన పండ్లు( అరటి ఉత్పత్తులు, మామిడి, మామిడి ఉత్పత్తులు, నారింజ, నిమ్మకాలు, నిమ్మకాలు, ద్రాక్ష పండ్లు, సిట్రస్ ఫ్రూట్స్, స్ట్రాబెరీలు, బెర్రీలు)
4) సుగంధ ద్రవ్యాలు, మిరియాలు, లవంగాలు, మిరపకాయలు, దాల్చిన చెక్క, కొత్తిమీర, జీలకర్ర, పసుపు, వాము, మెంతులు, ఆవాలు, కాసియా వంటి సుగంధ ద్రవ్యాలు.
5) టీ పరిశ్రమ పూర్తిగా రక్షించబడింది.
భారత్ ఏయే అమెరికా దిగుమతులపై సుంకాలు తగ్గిస్తుంది..
వ్యవసాయ, పాడి రంగాలకు బయట ఉన్న రంగాల్లోని అమెరికన్ దిగుమతులపై సుంకాలు ఉండవు.
1) పారిశ్రామిక, తయారీ వస్తువులు
*యంత్రాలు
*ఎలక్ట్రికల్ పరికరాలు
*వాహనాలు మరియు విడిభాగాలు
*రసాయనాలు
ఇది భారత తయారీకి ఊతమిస్తాయి. ఎగుమతులకు మద్దతు ఇస్తుంది.
2) టెక్నాలజీ, డేటా-సెంటర్, సెమీ కండక్టర్ హార్డ్ వేర్‌లపై భారత్ సుంకాలను తగ్గిస్తుంది.
*హై-ఎండ్ సర్వర్లు
*AI హార్డ్‌వేర్ మరియు GPUలు
*డేటా-సెంటర్ పరికరాలు
*సెమీకండక్టర్ ఇన్‌పుట్‌లు
ఇది భారతదేశ సాంకేతిక, AI మౌలిక సదుపాయాలను చౌకగా, మరింత పోటీతత్వంతో చేయడానికి ఉద్దేశించబడింది.
3) సున్నితమైనవి కాని వ్యవసాయ ఆహార ఉత్పత్తులు.
వీటిని ఎక్కువగా అధిక ఆదాయ కుటుంబాలు వినియోగిస్తాయి, వీటి వల్ల చిన్న రైతులకు ఇబ్బంది ఉండదు.
*ఎండిన డిస్టిలర్లు ధాన్యాలు
*ఎర్ర జొన్న
*ట్రీ నట్స్
*సోయాబీన్ నూనె
*కొన్ని సెలెక్టెడ్ పండ్లు
*వైన్లు, స్పిరిట్‌లు
3) ఏ భారత ఉత్పత్తులను అమెరికా అనుమతిస్తోంది
గతంలో అధిక సుంకాలను ఎదుర్కొన్న భారతీయ ఎగుమతులపై అమెరికా సుంకాలను 18 శాతానికి తగ్గిస్తుంది. దీని వల్ల ప్రయోజనం పొందే రంగాలు ఇవే..
*వస్త్రాలు మరియు దుస్తులు
*తోలు మరియు పాదరక్షలు
*ప్లాస్టిక్‌లు మరియు రబ్బరు వస్తువులు
*గృహ అలంకరణ మరియు తివాచీలు
*యంత్రాలు మరియు రసాయనాలు
*కళాఖండాల వస్తువులు
*ఔషధాలు
*రత్నాలు మరియు వజ్రాలు
*విమాన భాగాలు
కొన్ని భారతీయ ఉత్పత్తులపై గతంలో ఉన్న మెటల్-సెక్యూరిటీ సుంకాలను కూడా అమెరికా ఉపసంహరించుకుంటోంది.
4) ఆల్కాహాల్.
ఇది రక్షణ వర్గంలోకి రాదు. దీని వల్ల భారత రైతులకు పెద్దగా ఇబ్బంది ఉండదు. దిగుమతి చేసుకున్న విస్కీ, జిన్, రమ్, ఇలాంటి స్పిరిట్‌లపై గతంలో 150 శాతం సుంకాలు ఉన్నాయి. కొత్త భారత్–US, భారతదేశం–EU ఫ్రేమ్‌వర్క్‌ల ప్రకారం, ఇది 30 నుండి 40 శాతానికి తగ్గుతుందని భావిస్తున్నారు.
ముంబైలో దాదాపు రూ 4500 ఖరీదు చేసే మధ్యస్థ శ్రేణి స్కాచ్ కొత్త రేట్లు అమలులోకి వచ్చిన తర్వాత రూ. 2500 నుంచి రూ. 3000 తగ్గవచ్చు.
దీని వల్ల ఈయూ ఉప్పత్తులైన స్కాచ్, ఐరిష్ విస్కీ బ్రాండ్లు తక్కువ ధరలకు భారత్‌లో దొరకుతాయి.
అమెరికాకు చెందిన జాక్ డేనియల్స్, జిమ్ బీర్ వంటి వాటికి ధరలు తగ్గుతాయి.
The India-US Trade Deal will not only provide greater access to the US market for Indian products but also support our labour intensive sectors. Additionally, it will give a big boost to our digital infrastructure.#IndiaUSJointStatement pic.twitter.com/AAUB8x9MGM
— Piyush Goyal (@PiyushGoyal) February 7, 2026
తాజావార్తలు
-
Virat Kohli Records: “నువ్వు మామూలోడివి కాదు సామీ”.. ఒక్క సెంచరీతో ఏకంగా 10 సంచలన రికార్డులు బద్దలు..!
-
Aleksandar Vucic Resigns: సెర్బియాలో కీలక రాజకీయ పరిణామం.. అధ్యక్ష పదవికి వుసిచ్ రాజీనామా
-
ENG vs SL: శ్రీలంకకు చుక్కలు చూపించిన ఇంగ్లాండ్.. సిరీస్ కైవసం..!
-
Shubman Gill: కోహ్లీ మాత్రమే కాదు.. అతను కూడా మ్యాచ్ గెలుపులో కీలక పాత్ర పోషించాడు..!
-
Bank Strike Update: మూడు రోజుల సమ్మె వాయిదా.. కీలక కమిటీ ఏర్పాటు.. బ్యాంకులకు ఇక 5 రోజుల పని విధానమా?
ట్రెండింగ్
-
National Drink Beer Day : బీర్ కోసం ఓ రోజు.. National Drink Beer Day వెనుక కథ ఇదే.!
-
World Rabies Day 2026 : కుక్క కాటు.. ఈ 15 నిమిషాలు మిస్ అయితే డేంజర్.!
-
Why Do Dogs Howl at Night: రాత్రిపూట కుక్కలు ఎందుకు ఏడుస్తాయి? దెయ్యాలు కనిపిస్తాయా?.. అసలు రహస్యం ఇదే!
-
Xiaomi Pocket Guitar: చేతిలో ఫోన్.. వెనుక గిటార్..! Xiaomi సరికొత్త యాక్సెసరీ మాములుగా లేదుగా.!
-
Hardik Pandya: రీఎంట్రీకి మరో బ్రేక్.. స్కాన్‌లో బయటపడ్డ కొత్త గాయం.!