మొఘల్‌ గార్డెన్‌ పేరును అమృత్ ఉద్యాన్‌గా కేంద్రప్రభుత్వం మార్చిన సంగతి తెలిసిందే. 

రాష్ట్రపతి ద్రౌపది ముర్ము అమృత్ ఉద్యాన్‌ను ప్రారంభించారు.

 జనవరి 31 నుంచి అమృత్ ఉద్యాన్‌లోకి ప్రజలను అనుమతించనున్నట్టు కేంద్రం వెల్లడించింది.  

ప్రజల సందర్శన కోసం నెల రోజుల పాటు అమృత్‌ ఉద్యాన్‌లోకి ప్రవేశం కల్పించనున్నట్టు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము డిప్యూటీ ప్రెస్ సెక్రటరీ నవికా గుప్తా వెల్లడించారు.

రాష్ట్రపతి భవన్‌లో 15 ఎకరాల్లో మొఘల్‌ గార్డెన్‌ ఉంది. 

మొఘల్ గార్డెన్స్‌ను మొఘల్‌ చక్రవర్తులు నిర్మించారు. 

ఇవి పెర్షియన్ శైలిలో నిర్మించిన తోటలు. 

ఈ రకపు తోటలు పెర్షియా తోటల చార్ బాగ్ నిర్మాణంలో కట్టినవి. 

సాధారణంగా ఈ గార్డెన్స్‌లో సరస్సులు, ఫౌంటైన్లు, కాలువలు కూడా ఉండటం విశేషం. 

భారత్, పాకిస్థాన్, బంగ్లాదేశ్‌లలో ఎన్నో మొఘల్ గార్డెన్స్ ఉన్నాయి.