తంగేడు పువ్వులు, ఆకులు, బెరడు, వేర్లతో చేసే కషాయాలు.. అనేక అనారోగ్య సమస్యలకు చెక్ పెడతాయి.

తంగేడు ఆకుల పొడిని ఒక గ్లాసు గోరువెచ్చని నీళ్లతో కలిపి తీసుకుంటే.. మలబద్ధకం తగ్గుతుంది.

తంగేడు పూల పొడి, బెల్లంతో చూర్ణం చేసుకొని తీసుకుంటే.. అతిమూత్ర వ్యాధి నుంచి విముక్తి లభిస్తుంది.

ఒక గిన్నెలో నీళ్లు, తంగేడు చెట్టు వేర్లు వేసి మరగించాలి. గోరువెచ్చగా ఉన్నప్పుడు ఆ కషాయం తాగితే.. నీళ్ల విరేచనాలు దరిచేరవు.

ఒక గిన్నెలో నీళ్లు, తంగేడు పువ్వులు, నల్ల వక్కల పొడి వేసి బాగా మరిగించి, ఆ నీటిని వడగట్టి తాగితే.. మధుమేహం అదుపులో ఉంటుంది.

తంగేడు పూల పొడిలో కొద్దిగా శెనగపిండి కలిపి పేస్ట్ చేసుకోవాలి. ఈ పేస్టుని వారానికోసారి ముఖానికి అప్లై చేస్తే.. చర్మం నిగారింపు పెరుగుతుంది.

తంగేడు ఆకులను మజ్జిగతో కలిపి పేస్ట్ చేసుకోవాలి. ఈ పేస్టుని వారానికి రెండు సార్లు పాదాల పగుళ్ల చోట అప్లూ చేస్తే.. పాదాల పగుళ్లు రావు.

తంగేడు పువ్వులను పేస్టు చేసుకుని, కొబ్బరి నూనెలో వేసి మరిగించాలి. ఆ నూనెను తలకు పట్టిస్తే.. చుండ్రు సమస్య, హెయిర్ ఫాల్ ఉండదు.

పెరుగుతో పాటు తంగేడు చూర్ణం కలుపుకుని సేవిస్తే.. శరీరంపై మచ్చలు, తామర, గజ్జి వంటివి తగ్గుతాయి.

తంగేడు చూర్ణాన్ని అల్లం రసంతో కలిపి తీసుకుంటే.. దృష్టి వ్యాధులు తగ్గి, కళ్లకు మంచి కాంతినిస్తుంది.