YS Viveka Murder Case: వైఎస్ వివేకా హత్య కేసుపై విచారణ.. సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు
- సుప్రీంకోర్టులో వైఎస్ వివేకా హత్యకేసు విచారణ..
- జస్టిస్ సుందరేష్ కీలక వ్యాఖ్యలు..
- ఈ కేసులో మళ్లీ మినీ ట్రయల్ నిర్వహించలేం..
- ఇలా అయితే మూడునాలుగేళ్లు పడుతుంది.. ఇది అంతులేకుండా ముందుకు వెళ్తుంది..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టించిన మాజీ మంత్రి, వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసుపై సుప్రీంకోర్టులో కీలక విచారణ జరిగింది. ఈ కేసులో ఒక అంశంపైనే దర్యాప్తు చేయాలన్న ట్రయల్ కోర్టు ఆదేశాలను సవాల్ చేస్తూ వైఎస్ వివేకా కూతురు సునీతా రెడ్డి సుప్రీంకోర్టును ఆశ్రయించారు. ఈ పిటిషన్‌పై జస్టిస్ సుందరేష్ ధర్మాసనం విచారణ చేపట్టింది. ఈ కేసులో ఇప్పటికే సీబీఐ దర్యాప్తు పూర్తయిందని, కోర్టుకు సీబీఐ తరపున న్యాయవాది వివరించారు. అయితే, ట్రయల్ కోర్టు ఆదేశాల మేరకు తదుపరి దర్యాప్తు కొనసాగిస్తున్నామని సీబీఐ స్పష్టం చేసింది.
Read Also: Priyanka Chopra : ప్రియాంక కూతురు మాల్తీకి ఏమైంది? ఆ మూడున్నర నెలలు నరకం చూశామన్న నిక్ జోనస్!
Also Read
సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు
కేసు విచారణ సందర్భంగా జస్టిస్ సుందరేష్ కీలక వ్యాఖ్యలు చేశారు. ఈ కేసులో మళ్లీ మినీ ట్రయల్ నిర్వహించలేం. అలా చేస్తే మూడు నుంచి నాలుగు సంవత్సరాలు పడుతుంది. ఇది అంతులేకుండా ముందుకు వెళ్తుంది అని ధర్మాసనం వ్యాఖ్యానించింది. అయితే, ట్రయల్ కోర్టు ఆదేశాల మేరకు సీబీఐ తన దర్యాప్తును కొనసాగించవచ్చని, అలాగే ఎవరిని విచారించాలన్న అంశంపై సుప్రీంకోర్టు ఎలాంటి ఆదేశాలు ఇవ్వదని స్పష్టం చేసింది. ఇదే సమయంలో.. వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసులో దర్యాప్తును వేగంగా పూర్తిచేయాలని సీబీఐకి సుప్రీంకోర్టు ఆదేశాలు జారీ చేసింది. ట్రయల్ కోర్టు ఇచ్చిన మార్గదర్శకాలకు అనుగుణంగా దర్యాప్తు కొనసాగించాలని పేర్కొంది.
ఈ కేసులో ఏపీ ప్రభుత్వం తరపున న్యాయవాది సిద్ధార్థ లూథ్రా అందుబాటులో లేకపోవడంతో, సుప్రీంకోర్టు విచారణను కొంతసేపు పాసోవర్ చేసింది. అనంతరం తిరిగి కేసును విచారించింది. రాష్ట్ర రాజకీయాల్లో తీవ్ర ప్రాధాన్యత కలిగిన ఈ కేసుపై సుప్రీంకోర్టు చేసిన వ్యాఖ్యలు కీలకంగా మారాయి. ముఖ్యంగా, మినీ ట్రయల్‌కు అవకాశం లేదని, దర్యాప్తు అంతులేని ప్రక్రియగా మారకూడదని చేసిన వ్యాఖ్యలు ఈ కేసులో తదుపరి న్యాయపరమైన ప్రక్రియకు దిశానిర్దేశం చేయనున్నాయి.
తాజావార్తలు
-
Asian Games 2026: షూటింగ్లో మరో రజత పతకం.. టేబుల్ టెన్నిస్‌లో పాకిస్థాన్‌ను 3-0తో చిత్తు చేసిన భారత్
-
Thick Milk Cream: పాలపై మీగడ రావడం లేదా? 1-5-6 ఫార్ములా ట్రై చేయండి.. మందమైన మీగడ పొందండి.!
-
Hanuman Ansh: ‘హనుమాన్ అంశ్’ను 15 సార్లు చూసిన నీమ్ కరోలి బాబా కుమార్తె.. ప్రతిసారీ కన్నీళ్లే..
-
Sanath Jayasuriya: టీమిండియా భవిష్యత్తు వైభవ్.. కానీ.. బీసీసీఐకి వరల్డ్ కప్ హీరో కీలక సలహా..
-
RBI New FD Rules: బల్క్ డిపాజిట్ల నుంచి FD వడ్డీ వరకు.. అక్టోబర్ 1 నుంచి RBI కొత్త నిబంధనలు
ట్రెండింగ్
-
Jio vs Airtel: రూ.3,599 ప్లాన్.. ఏడాది వ్యాలిడిటీతో పాటు OTT + అనేక ప్రయోజనాలు.. ఏది బెస్ట్.?
-
Suryakumar Yadav: ధోనీ, కోహ్లీ, రోహిత్ టాలెంట్ వద్దు.. ఆ ఒక్కడిలో ఆ ఒక్క టాలెంట్ దొంగిలిస్తా!
-
iPhone 18 Pro Max: ఐఫోన్ 18 ప్రో మాక్స్ ఛార్జింగ్ టెస్ట్‌లో సంచలనం..
-
Jio యూజర్లకు అదిరిపోయే ఆఫర్.. ఏడాది పాటు Amazon Prime Lite ఫ్రీ.. ఎలా పొందాలంటే.?
-
Asian Games 2026: బంగ్లాదేశ్‌పై భారత్ ఘన విజయం.. బంగారు పతకం కొసం ఫైనల్లో శ్రీలంకతో అమితుమీ.!