Baby Bathing Tips: పసిపిల్లలకు స్నానం ఎప్పుడు చేయించాలి, ఎలా చేయించాలి..?
- పసిపిల్లలకు స్నానం ఎప్పుడు చేయించాలి..
- ఏ సమయంలో పసిపిల్లలకు స్నానం చేయించాలి..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Baby Bathing Tips: పసిపిల్లల సంరక్షణలో స్నానం చేయించడం చాలా కీలకమైంది. కొత్తగా పుట్టిన బిడ్డకు స్నానం విషయంలో తల్లిదండ్రులకు ఎన్నో అనుమానాలు ఉంటాయి. సరైన సమయంలో, సరైన విధానంలో స్నానం చేయిస్తే బిడ్డ ఆరోగ్యం, చర్మ సంరక్షణ రెండూ మెరుగ్గా ఉంటాయని వైద్య నిపుణులు పేర్కొంటున్నారు. అయితే, పిల్లలకు స్నానం ఎలా చేయించాలి, ఏ సమయంలో చేయించాలి అనే విషయం గురించి ఇప్పుడు తెలుసుకుందాం..
Also Read
- Ragi Drumstick Leaves Roti: డయాబెటిస్, బీపీ ఉన్నవారికి సంపూర్ణ ఆహారం.. సంపూర్ణ పోషణనిచ్చే 'రాగి మునగాకు రొట్టె' చేసేయండి ఇలా.!
- Beetroot Pachadi: బీట్రూట్ అంటే నచ్చదా? ఇలా పచ్చడి చేసి పెట్టండి.. ప్లేట్ మొత్తం ఖాళీ చేసేస్తారు.!
- Lemon Storage Tips: రసం తగ్గకుండా, రుచి మారకుండా నిమ్మకాయలు నెల రోజులు తాజాగా ఉండాలంటే ఈ సింపుల్ ట్రిక్స్ ఫాలో అయితే చాలు.!
- Masala Gutti Vankaya Recipe: బగారా రైస్, పులావ్‌లోకి అదిరిపోయే "మసాలా గుత్తివంకాయ" చేసేయండి ఇలా..! లొట్టలేసుకుంటూ తినేస్తారంతే.!
స్నానం ఎప్పుడు చేయించాలి?
అయితే, కొత్తగా పుట్టిన వెంటనే పసిపిల్లకు స్నానం చేయించొద్దు.. సాధారణంగా డాక్టర్లు 24 గంటల నుంచి 48 గంటల తర్వాత లేదా ఇంటికి తీసుకెళ్లిన అనంతరం స్నానం చేయించమని సూచిస్తారు. కాగా, పుట్టిన బిడ్డ చర్మంపై ఉండే వెర్నిక్స్ అనే సహజ పొర చర్మాన్ని చలి, ఇన్ఫెక్షన్ల నుంచి రక్షణ కల్పిస్తుంది. అందుకే ఆ పొర సహజంగా తగ్గే వరకు స్నానం చేయించకపోవడం మంచిదని వైద్యులు సూచిస్తున్నారు. అలాగే, నాభి తాడు పూర్తిగా ఎండిపోయి ఊడిపోయే వరకు పూర్తిస్థాయిలో స్నానం చేయించకుండా స్పాంజ్ బాత్ మాత్రమే చేయించాలి అని పేర్కొంటున్నారు.
ఎలా స్నానం చేయించాలి?:
* పిల్లలకు స్నానం చేసే ముందు గదిని వెచ్చగా ఉంచాలి.. గాలి ఎక్కువగా ఉండకూడదు.
* నీరు గోరువెచ్చగా ఉండాలి.. మీ మణికట్టు లేదా మోచేతితో నీటి వేడి పరీక్షించాలి..
* మృదువైన గుడ్డను నీటిలో ముంచి, ముందు ముఖం, కళ్ళు, చెవులు శుభ్రం చేయాలి.. అనంతరం చేతులు, కాళ్లు, శరీరం మెల్లగా తుడవాలి..
* బేబీకి ప్రత్యేకంగా తయారు చేసిన మైల్డ్ సబ్బు లేదా క్లీన్సర్ మాత్రమే ఉపయోగించాలి. రోజూ సబ్బు అవసరం లేదు..
* స్నానం చేసిన వెంటనే మృదువైన టవల్‌తో తుడిచి, బేబీ ఆయిల్ లేదా మాయిశ్చరైజర్ రాయాల్సి ఉంటుంది.
* పసి పిల్లలకు వారానికి 2 నుంచి 3 సార్లు స్నానం చేయిస్తే బెటర్. పిల్లలకు రోజూ స్నానం చేయించాల్సిన అవసరం లేదు.
ముఖ్యమైన జాగ్రత్తలు ఇవే:
* స్నానం సమయంలో బిడ్డను ఎప్పుడూ ఒంటరిగా విడిచి పెట్టొద్దు..
* స్నానం సమయం 5 నుంచి 10 నిమిషాల లోపే ఉండేలా చూసుకోవాలి..
* ఎక్కువ సబ్బును పెట్టడం లేదా వేడి నీటిని ఉపయోగించకూడదు.. ఎందుకంటే, పసిపిల్లల చర్మం చాలా సున్నితంగా ఉంటుంది. కాబట్టి స్నానం సమయంలో జాగ్రత్తతో పాటు ఓపిక చాలా అవసరం.. ఏవైనా అనుమానాలు ఉంటే తప్పకుండా పసిపిల్లల వైద్యుడిని సంప్రదించడం ఉత్తమం..
Note: <p style=”font-size: 10px;”><span style=”color: red;”>నోట్ :</span> ఇంటర్నెట్లో సేకరించిన సమాచారం ఆధారంగా ఈ వార్తను పబ్లిష్ చేస్తున్నాం.. ప్రయత్నించే ముందు సంబంధిత నిపుణుల సలహాలను పాటించవలసిందిగా మనవి. తదుపరి జరిగే ఎలాంటి పరిణామాలకు ఎన్టీవీ తెలుగు.కామ్ బాధ్యత వహించదు.</p>
తాజావార్తలు
-
Lava Virat Curve: 3D కర్వ్డ్ AMOLED స్క్రీన్, 6000mAh బ్యాటరీ.. 7100 ప్రాసెసర్, 50MP కెమెరా.. సెప్టెంబర్ 21న లాంచ్..
-
Rajasthan: మున్సిపల్ ఎన్నికల్లో బీజేపీ ప్రభంజనం.. గిరిజన ప్రాంతాల్లో భారీ విజయం
-
Marriage Rumours: ఆ హీరోతో పెళ్లి రూమర్లపై ఓపెన్ అయిన హీరోయిన్!
-
Trump: ఉక్రెయిన్-రష్యా ఇంధన వసతులపై దాడి చేయమని చెప్పాయి.. ట్రంప్ కీలక ప్రకటన
-
Saudi Arabia: సౌదీ అరేబియాకు జాక్‌పాట్.. మదీనాలో భారీగా యురేనియం నిల్వలు..
ట్రెండింగ్
-
Ganga Aarti in London: లండన్‌లో తొలిసారి గంగా హారతి.. థేమ్స్ నది తీరంలో ఆధ్యాత్మిక సందడి.!
-
Ragi Drumstick Leaves Roti: డయాబెటిస్, బీపీ ఉన్నవారికి సంపూర్ణ ఆహారం.. సంపూర్ణ పోషణనిచ్చే ‘రాగి మునగాకు రొట్టె’ చేసేయండి ఇలా.!
-
Beetroot Pachadi: బీట్రూట్ అంటే నచ్చదా? ఇలా పచ్చడి చేసి పెట్టండి.. ప్లేట్ మొత్తం ఖాళీ చేసేస్తారు.!
-
India Women: నాలుగింటిలో నాలుగు.. ఆరింటిలో నాలుగు.. ఆసియా కప్‌లో భారత్ హవా!
-
Rajyogam: 200 ఏళ్ల తర్వాత అరుదైన యోగం.. ఈ 5 రాశుల వారికి పట్టిందల్లా బంగారమే..!