Pakistani Terrorist: 20 సార్లు తప్పించుకున్నాడు, చివరకు కుక్క చావు చచ్చాడు..
- 20 సార్లు భద్రతా బలగాల నుంచి తప్పించుకున్నాడు..
- చివరకు హతమైన జైషే మహ్మద్ పాక్ ఉగ్రవాది..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Pakistani Terrorist: ఒకటి కాదు రెండు కాదు దాదాపుగా 20 సార్లు భారత సైన్యానికి చిక్కినట్లే చిక్కి తప్పించుకుంటున్న పాకిస్తాన్ ఉగ్రవాదిని ఎట్టకేలకు భద్రతా బలగాలు హతమార్చాయి. ఇది భారత సెక్యూరిటీ ఫోర్సెస్‌కు ఘన విజయంగా చెప్పొచ్చు.పాకిస్తాన్ జాతీయుడు, సీనియర్ లష్కర్ కమాండర్ సైఫుల్లాకు అత్యంత సన్నిహితుడైన ఉగ్రవాది ఆదిల్ గత 18 నెలలుగా పట్టుబడకుండా తప్పించుకుంటున్నారు. కిష్త్వార్‌లో లోని ప్రమాదకరమైన ఎతైన ప్రాంతాల్లోని గుహల్లో తలదాచుకుంటూ, దాడులు చేయడానికి అవకాశం కోసం ఎదురుచూస్తున్న ఉగ్రవాదిని చంపేశారు.
Read Also: PM Modi: ప్రధాని మోడీపై దాడికి కాంగ్రెస్ భారీ కుట్ర.?
Also Read
- Earthquake : ఉత్తరాఖండ్‌లో భూకంపం.. ఢిల్లీ-ఎన్సీఆర్ వరకు ప్రకంపనలు!
- Smit Machchhar: స్మిత్ మచ్చర్‌కు అరుదైన గౌరవం.. అమెరికా ప్రతినిధుల సభలో తీర్మానం
- SIR Protest: ప్రియాంకకు ‘స్టింగ్’ ఎనర్జీ డ్రింక్ ఇచ్చిన రాహుల్‌గాంధీ.. సోదరి ఏం చేసిందంటే?
- Congress Protest: రాహుల్ గాంధీ సహా ప్రతిపక్ష ఎంపీల అరెస్ట్..
ఆపరేషన్ త్రాషి 1లో ఛత్రూ ప్రాంతంలో భద్రతా బలగాల చేతిలో హతమయ్యాడు. సైన్యం, జమ్మూ కాశ్మీర్ పోలీసులు, సీఆర్‌పీఎఫ్ సంయుక్తంగా చేపట్టిన ఈ ఆపరేషన్ వారం రోజులుగా కొనసాగుతోంది. బుధవారం సాయంత్రం, సమాచారం మేరకు భద్రతా బలగాలు ఛత్రూ ప్రాంతాన్ని చుట్టుముట్టాయి. ఇదే సమయంలో ఆదిల్ భద్రతా బలగాలపైకి కాల్పులు జరిపాడు. చివరకు హతమయ్యాడు.
చాలా సార్లు ఇతను భద్రతా వలయాన్ని ఛేదించి ఎన్‌కౌంటర్ స్థలం నుంచి పారిపోవడంలో విజయం సాధించడానరి, ఈసారి అదృష్టం కలిసిరాలేదని సీనియర్ భద్రతా అధికారి తెలిపారు. ప్రస్తుతం, సైఫుల్లా కోసం వేట కొనసాగుతోంది. ఇతడిని పట్టుకునేందుకు భద్రతా బలగాలు ఆపరేషన్ ముమ్మరం చేశాయి. రెండేళ్ల క్రితం జైష్ కమాండర్ సైఫుల్లా సరిహద్దుల్లోకి చొరబడ్డాడు. అప్పటి నుంచి కిష్త్వార్, దోడా ప్రాంతాల్లో కార్యకలాపాలు నిర్వహిస్తున్నాడు. సైఫుల్లా భద్రతా బలగాలపై అనేక దాడులకు పాల్పడ్డాడు. ఆదిల్ హతమైన తర్వాత సైఫుల్లా ఛత్రో ఉత్తరం వైపుగా పారిపోయినట్లు సమాచారం. ఇతడిని పట్టుకునేందుకు మూడు ఆపరేషన్లు జరుగుతున్నాయి.
తాజావార్తలు
-
Shai Hope: భారత్‌ను ఎదుర్కోవాలంటే ఆ స్కోర్ సరిపోదు.. ఓటమికి ప్రధాన కారణం ఇదే: వెస్టిండీస్ కెప్టెన్
-
Earthquake : ఉత్తరాఖండ్‌లో భూకంపం.. ఢిల్లీ-ఎన్సీఆర్ వరకు ప్రకంపనలు!
-
Shreyas Iyer: సెంచరీతో శ్రేయాస్ అయ్యర్ వీర విహారం.. వెస్టిండీస్ చిత్తు చిత్తు.. భారత్ ఘన విజయం..
-
Wife Kills Husband: ప్రియుడితో కలిసి భర్తను చంపిన భార్య.. ఫోన్ చాట్‌తో వెలుగులోకి దారుణం..
-
Team India New Captain: బీసీసీఐ సంచలన నిర్ణయం.. భారత మహిళా జట్టుకు కొత్త కెప్టెన్ ప్రకటన..
ట్రెండింగ్
-
Hong Kong Sixes 2026: మరోసారి భారత్-పాకిస్థాన్ మ్యాచ్.. కెప్టెన్‌గా భువీ..!
-
Smriti Mandhana: బీసీసీఐ కీలక నిర్ణయం.. భారత మహిళల కొత్త కెప్టెన్‌గా స్మృతి మంధాన..!?
-
Captain Changes: ఆసియా గేమ్స్‌లో ఓటమి.. పాకిస్థాన్ కెప్టెన్ పై వేటు..! కొత్త కెప్టెన్ ఎవరంటే.?
-
WCL 2026 నుంచి పాకిస్థాన్ ఛాంపియన్స్ ఔట్.. NOC ఇవ్వని PCB.!
-
Kakarakaya Vepudu: అన్నంలోకి ‘కాకరకాయ వేపుడు’.. ఇలా చేస్తే ప్లేట్ ఖాళీ అవ్వాల్సిందే.!