Child Hero Austin: మృత్యువుకు ఎదురీదిన చిన్నోడు.. కుటుంబాన్ని కాపాడుకున్న పెద్దోడు!
- అమ్మను, తోబుట్టువులను రక్షించేందుకు 4 గంటలపాటు భీకర అలలకు ఎదురీత
- ఆస్ట్రేలియాలో వెలుగు చూసిన ఘటన
- అందరినీ సురక్షితంగా కాపాడిన అధికారులు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Child Hero Austin: సముద్రం మధ్యలో మృత్యువు ముంచుకొస్తున్న వేళ.. ఒక 13 ఏళ్ల బాలుడు చూపిన అసాధారణ ధైర్యం ఒక కుటుంబాన్ని ప్రాణాపాయం నుంచి రక్షించింది. ఓ బాలుడు తన తల్లిని, తోబుట్టువులను రక్షించుకునేందుకు చాలా పెద్ద సాహసం చేశాడు. సముద్రంలో కొట్టుకుపోయిన తన తల్లి, తోబుట్టువులను కాపాడుకునేందుకు, అల్లకల్లోలంగా మారిన సముద్రంలో దాదాపు 4 గంటలపాటు భీకర అలలకు ఎదురీది తీరానికి చేరుకుని అధికారులకు సమాచారం అందించాడు. ఈ చిన్నోడు తీరానికి చేరే టైంకి చీకటి పడటంతో, వెంటనే అధికారులు హెలికాప్టర్ సాయంతో తన తల్లిని, తోబుట్టువులను రక్షించేందుకు బయలుదేరి, వారిని సురక్షితంగా రక్షించారు. ఈ ఘటన ఆస్ట్రేలియాలో వెలుగు చూసింది. ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా సాహస బాలుడు ఆస్టిన్ గాథ ప్రశంసలు అందుకుంటోంది.
READ ALSO: Ghaziabad Sisters S*uicide: టీనేజ్ పాలిట.. మొబైల్ గేమ్స్ డెత్ గేమ్స్!
Also Read
- Gadikota Srikanth Reddy: కొత్త పెన్షన్ల పేరుతో మళ్లీ మోసం.. గడికోట ఫైర్
- KBR Park Elevated Corridor: 14 వద్దు.. ఒక్క ఎలివేటెడ్ కారిడార్ ముద్దు.! కేబీఆర్ పార్క్ పరిసరాల్లో కొత్త ప్లాన్ ఇదే..
- Minister TG Bharath: కర్నూలులో జాబ్ మేళా ప్రారంభం.. యువతకు ఉద్యోగాలు.. కర్నూలుకు భారీ పెట్టుబడులు..!
- MLA Rakesh Reddy: జోక్ కాదు సీరియస్ అధ్యక్షా.. ఈరోజే రాజీనామా చేస్తా.. అసెంబ్లీలో బీజేపీ ఎమ్మెల్యే ఫైర్.!
పెర్త్‌కు చెందిన జోవాన్ అపెల్బీ తన ముగ్గురు పిల్లలతో కలిసి కయాక్, పెడల్ బోర్డులపై సముద్ర విహారానికి వెళ్లారు. అయితే, అకస్మాత్తుగా వాతావరణం మారిపోవడంతో బలమైన గాలుల ధాటికి వారు తీరానికి కిలోమీటర్ల దూరంలోకి కొట్టుకుపోయారు. చీకటి పడుతుండటం, చలి పెరగడం, అలలు ఉవ్వెత్తున ఎగసిపడుతుండటంతో ప్రాణాల మీద ఆశలు వదులుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. తల్లి సూచనతో పెద్ద కుమారుడు ఆస్టిన్ (13) సహాయం కోసం ఒంటరిగా తీరం వైపు బయల్దేరాడు. ఆస్టిన్ మొదట తీరానికి కయాక్‌పై వెళ్లాలని ప్రయత్నించాడు, కానీ అందులోకి నీరు చేరడంతో అది మునిగిపోయింది. దీంతో తన ప్రాణాలకు తెగించి అల్లకల్లోలంగా మారిన సముద్రంలో భీకర అలలకు ఎదురీదాలని నిర్ణయించుకున్నాడు. ఈతకు అడ్డంకిగా మారుతుందని ఏకంగా తన లైఫ్‌జాకెట్‌ను కూడా వదిలేశాడు. భీకరమైన అలల మధ్య దాదాపు 4 కిలోమీటర్ల మేర నిరంతరాయంగా ఈదుకుంటూ ఎలాగోలా తీరానికి చేరుకున్నాడు.
సురక్షితంగా ఒడ్డుకు చేరుకున్న ఆస్టిన్ వెంటనే స్థానిక అధికారుల వద్దకు వెళ్లి తన తల్లి, తోబుట్టువుల గురించి సమాచారం అందించాడు. వెంటనే అప్రమత్తమైన అధికారులు హెలికాప్టర్ సాయంతో గాలింపు చేపట్టి, తీరానికి 14 కిలోమీటర్ల దూరంలో పెడల్ బోర్డులను పట్టుకుని వేలాడుతున్న తల్లిని, మిగిలిన ఇద్దరు పిల్లలను గుర్తించి సురక్షితంగా రక్షించారు. నలుగురికీ వైద్య పరీక్షలు నిర్వహించగా, అందరూ క్షేమంగానే ఉన్నారని వైద్యులు వెల్లడించారు. అనంతరం ఆస్టిన్ తల్లి జోవాన్ మీడియాతో మాట్లాడుతూ.. “ముగ్గురు పిల్లలను వదిలేసి నేను వెళ్లలేని పరిస్థితి. అందుకే ఆస్టిన్‌ను పంపాల్సి వచ్చింది. అది నా జీవితంలో తీసుకున్న అత్యంత కఠినమైన నిర్ణయం. వాడు తిరిగి వస్తాడో లేదో అని క్షణక్షణం నరకం చూశాను” అంటూ కన్నీటిపర్యంతం అయ్యారు.
READ ALSO: Sunny Madala: “ఓ టార్చర్ ప్రేమ” చిత్రం ఫస్ట్ లుక్ విడుదల
తాజావార్తలు
-
Hatah Teaser: కిరణ్ అబ్బవరం ‘హతః’ టీజర్‌కు ముహూర్తం ఫిక్స్.. ఆ నల్ల పిల్లి వెనుక అసలు కథేంటి?
-
Gadikota Srikanth Reddy: కొత్త పెన్షన్ల పేరుతో మళ్లీ మోసం.. గడికోట ఫైర్
-
KBR Park Elevated Corridor: 14 వద్దు.. ఒక్క ఎలివేటెడ్ కారిడార్ ముద్దు.! కేబీఆర్ పార్క్ పరిసరాల్లో కొత్త ప్లాన్ ఇదే..
-
Minister TG Bharath: కర్నూలులో జాబ్ మేళా ప్రారంభం.. యువతకు ఉద్యోగాలు.. కర్నూలుకు భారీ పెట్టుబడులు..!
-
IPL 2027 Auction: బీసీసీఐ కీలక నిర్ణయం.. భారత్‌లోనే ఐపీఎల్ 2027 వేలం!
ట్రెండింగ్
-
Sanju Samson vs Vaibhav: వైభవ్ సూర్యవంశీతో పోటీ.. సంజు శాంసన్ సంచలన వ్యాఖ్యలు!
-
Nitish Kumar Reddy: నా టార్గెట్ అదే.. అందుకోసమే కష్టపడుతున్నా!
-
Jasprit Bumrah: జస్ప్రీత్ బుమ్రా అరుదైన రికార్డు.. టీ20ల్లో సరికొత్త చరిత్ర.!
-
ENG vs SL: హడలెత్తించిన ‘హ్యారీ బ్రూక్’ సెంచరీ.. శ్రీలంకపై ఇంగ్లండ్ రికార్డు విజయం.!
-
బడ్జెట్ సెగ్మెంట్లో 6,000mAh బ్యాటరీ, 50MP కెమెరాతో Samsung Galaxy A08 లాంచ్..!