Nizamabad: కూతుర్ని చంపిన తండ్రికి జీవిత ఖైదు..
- కూతుర్ని చంపిన తండ్రికి జీవిత ఖైదు
- నిజామాబాద్ జిల్లా బుస్సాపూర్ గ్రామంలో 2023లో జరిగిన హత్య ఘటన
- భార్యపై అనుమానమే హత్యకు కారణమని జిల్లా కోర్టు నిర్ధారణ
- Follow Us :
-
-
Add as a preferred
source on google
నిజామాబాద్ జిల్లా బుస్సాపూర్ గ్రామంలో 2023లో జరిగిన హత్య ఘటనలో జిల్లా కోర్టు సంచలన తీర్పు ఇచ్చింది. కూతుర్ని చంపిన తండ్రికి జీవిత ఖైదు విధించింది. మరో నిందితుడికి రూ.2,000 జరిమానా విధించింది. భార్యపై అనుమానమే హత్యకు కారణమని జిల్లా కోర్టు నిర్ధారించి జీవిత ఖైదు శిక్ష విధిస్తూ తీర్పు వెల్లడించింది. వివరాల్లోకి వెళ్తే.. నిర్మల్ జిల్లా సారంగపూర్ మండలం ధని గ్రామానికి చెందిన కడమంచి కాశీరాం, పోసాని దంపతులు చిత్తు కాగితాలు ఏరుకుని జీవనం సాగిస్తుంటారు. వీరికి ఇద్దరు కుమార్తెలు.. సమ్మక్క, సారక్క. కొన్నాళ్లకు భర్త పట్టించుకోక పోవటంతో పోసాని నిజామాబాద్ జిల్లా మెండోరా మండలం బుస్సాపూర్‌కు చేరుకుని స్థానికంగా యాచిస్తూ జీవనం కొనసాగిస్తోంది.
Also Read:Mukesh Ambani: బంగారం, వెండిలో పెట్టుబడి పెట్టడం తెలివితక్కువ పనే.. మీరు డబ్బు సంపాదించాలనుకుంటే..
Also Read
- Supreme Court: మహిళకు ఉద్యోగం నిరాకరించినందుకు పనిష్మెంట్.. రూ.12 లక్షలు పరిహారం చెల్లించాలని తీర్పు
- Third Front: దేశంలో ‘‘థర్డ్ ఫ్రంట్’’.. కనిమొళి వరస భేటీలతో కొత్త చర్చ..
- Marital Rape: వైవాహిక అత్యాచారంపై సుప్రీంకోర్టు కీలక విచారణ.. తెగే పంచాయితీనేనా?
- Pakistan: అరేబియా సముద్రంలో భారత్-పాక్ నేవీ ఢీ.. చైనా వ్యూహాలపై అనుమానం.!
ఈ క్రమంలో అదే గ్రామానికి చెందిన మెట్పల్లి ప్రశాంత్‌తో పరిచయం ఏర్పడింది. ఈ విషయం కాశీరాంకు తెలియడంతో ఆగ్రహంతో ఊగిపోయి అక్కడకు చేరుకుని భార్యపై ఆగ్రహంతో చిన్న కుమార్తె సారక్క(9)ను మంటల్లోకి నెట్టాడు. అది చూసి భయపడిన పెద్దమ్మాయి సమ్మక్క పరారైంది. తీవ్రంగా గాయపడిన సారక్కను స్థానికులు ఆసుపత్రికి తరలించగా అక్కడ చికిత్సపొందుతూ మృతిచెందింది. భార్య ఫిర్యాదుతో కాశీరాంపై మెండోరా పోలీసులు కేసు నమోదు చేసి రిమాండ్‌కు తరలించారు. సాక్ష్యాలను పరిశీలించిన న్యాయమూర్తి నిందితుడికి యావజ్జీవ శిక్ష విధిస్తూ తీర్పునిచ్చారు.
తాజావార్తలు
-
Telangana SIR : ఓటర్లకు ఈసీ గుడ్‌న్యూస్.. నోటీసులకు ఇక ఇలా స్పందించొచ్చు
-
Supreme Court: మహిళకు ఉద్యోగం నిరాకరించినందుకు పనిష్మెంట్.. రూ.12 లక్షలు పరిహారం చెల్లించాలని తీర్పు
-
Third Front: దేశంలో ‘‘థర్డ్ ఫ్రంట్’’.. కనిమొళి వరస భేటీలతో కొత్త చర్చ..
-
Marital Rape: వైవాహిక అత్యాచారంపై సుప్రీంకోర్టు కీలక విచారణ.. తెగే పంచాయితీనేనా?
-
Pakistan: అరేబియా సముద్రంలో భారత్-పాక్ నేవీ ఢీ.. చైనా వ్యూహాలపై అనుమానం.!
ట్రెండింగ్
-
Samsung Phones: పర్సుకి ఫోన్‌కు తేడా తెలియదు.. అతి చిన్న సైజ్‌లో శామ్సంగ్ ఫోల్డబుల్ ఫోన్స్..
-
Rishabh Pant-BCCI: విండీస్‌తో వన్డేలకు రిషభ్ పంత్ దూరం.. అసలు కారణం ఇదే!
-
AMOLED డిస్‌ప్లే, 50MP ట్రిపుల్ కెమెరా, ఆరేళ్ల సెక్యూరిటీ అప్డేట్స్ తో Samsung Galaxy A18 4G లాంచ్..!
-
200MP కెమెరా, 3D వేపర్ ఛాంబర్, 7100mAh బ్యాటరీతో Nubia NaviX Ultra లాంచ్.!
-
Meta One వచ్చేసింది.. ఇంస్టాగ్రామ్, వాట్సాప్, ఫేస్ బుక్ కు కొత్త సబ్స్క్రిప్షన్ ప్లాన్ ధరలు ఇదిగో.!