Loan App Blackmail Case: ప్రాణం తీసిన ఇన్‌స్టంట్ లోన్.. బ్లాక్ మెయిల్ తట్టుకోలేక సూసైడ్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Loan App Blackmail Case: నిజానికి చాలా మంది ఆర్థిక పరిస్థితులు సరిగా లేకనో, అత్యవసరం కావడంతోనో రుణాల వైపు వెళుతూ ఉంటారు. బ్యాంకులు నుంచి లోన్ తీసుకోవాలంటే సవాలక్ష షరతులు ఉండటంతో.. ఈజీగా పొందేందుకు లోన్ యాప్‌ల వైపు చూస్తుంటారు. అలాంటి వారిని టార్గెట్‌గా పెట్టుకొని పలు లోన్ యాప్‌లు నిర్వాహకులు దారుణాలకు పాల్పడుతున్నారు. రుణాలు ఇస్తామంటూ వాట్సాప్‌కు మెసేజ్ చేస్తుంటారు. అలా మెసేజ్ రాగానే రిప్లై ఇవ్వడంతోనే అసలు సమస్య మొదలవుతుంది. లోన్ పొందాలంటే ముందుగా ఆధార్ కార్డు, పాన్ కార్డులు పంపమని అడుగుతారు. వారికి ఆ కార్డులు ఇచ్చిన మరుక్షణమే.. అందులోంచి ఫోటోలను క్రాప్ చేస్తారు. ఆ ఫోటోలను మార్ఫింగ్ చేసి లోన్ అడిగిన వారికి పంపిస్తారు. అడిగినంత పంపించకపోతే వాటిని సర్క్యూలేట్ చేస్తామని బెదిరిస్తారు. ఇలా వీరి బారిన పడి ఆత్మహత్యలకు పాల్పడుతున్నారు బాధితులు.
READ ALSO: AP News: రేపు చంద్రబాబు, పవన్, మాధవ్ కీలక సమావేశం!
Also Read
- DELHI: సిగరేట్కు అగ్గిపుల్ల ఇవ్వలేదని యువకుడి దారుణహత్య..
- Refrigerator Blast: ఇంట్లో ఫ్రిజ్ పేలి భారీ అగ్ని ప్రమాదం.. ఒకే కుటుంబానికి చెందిన నలుగురు సజీవ దహనం
- Nayeem Mu*rder: నాగోల్‌లో రౌడీషీటర్ నయీమ్ హత్య.. అదుపులో ఆరుగురు నిందితులు.!
- Korukonda Tragedy: వినాయక చవితి వేళ విషాదం.. కలువ పువ్వుల కోసం వెళ్లి ఇద్దరు మృతి
ఈ ఫోటోలో మీరు చూస్తున్న వ్యక్తి పేరు ప్రేమ్ కుమార్. నారాయణఖేడ్ ప్రాంతానికి చెందిన ప్రేమ్.. ముషీరాబాద్‌లోని అంబేద్కర్ నగర్‌లో నివాసం ఉంటున్నాడు. క్యాంటీన్ బిజినెస్ చేసి ఆర్థికంగా నష్టపోయాడు. వాటి నుంచి బయటపడేందుకు తన వాట్సాప్‌కి వచ్చిన ఒక లోన్ యాప్‌కు రిప్లై ఇచ్చాడు. ఆధార్, పాన్ కార్డులను పంపమని చెప్పడంతో.. వాట్సాప్‌లో వాటిని పంపించాడు. మరుక్షణమే ప్రేమ్ ఫోటోతో ఉన్న ఒక న్యూడ్ ఫోటోని మార్ఫింగ్ చేసి, ప్రేమ్‌కి వాట్సప్ చేశారు కేటుగాళ్లు. తాము అడిగినంత డబ్బు ఇవ్వకపోతే వాటిని సోషల్ మీడియాలో అప్‌లోడ్ చేస్తామని బెదిరించారు. ముందుగా 3 వేల రూపాయలు పంపించాలంటూ బెదిరించారు. దీంతో ఈ విషయాన్ని తన భార్యకు చెప్పాడు. ఆ తర్వాత డబ్బులు పంపించకపోవడంతో బూతులతో మరో మెసేజ్ ను పంపించారు. దీంతో డబ్బులు పంపించకపోతే మార్పింగ్ ఫోటోని కుటుంబ సభ్యులకు, బంధువులకు పంపిస్తామంటూ బెదిరించారు. దీంతో ఆ బ్లాక్ మెయిల్ తట్టుకోలేక ఆత్మహత్యకు పాల్పడ్డాడు ప్రేమ్ కుమార్.
ప్రేమ్ కుమార్ వాట్సాప్‌కు వచ్చిన న్యూడ్ ఫోటో అతనిది కాదని చెప్పి ధైర్యం చెప్పే ప్రయత్నం చేశామని వారి కుటుంబ సభ్యులు చెప్తున్నారు. అయినా కానీ పరువు పోతుందన్న భయంతో ప్రేమ్ కుమార్ ఆత్మహత్య చేసుకున్నాడని కుటుంబ సభ్యులు చెప్తున్నారు. పోలీసులు కేసు నమోదు చేసి ఆత్మహత్యకు పాల్పడ్డ ప్రేమ్ కుమార్ డెడ్ బాడీ పోస్ట్ మార్టం నిర్వహించి కుటుంబ సభ్యులకు అప్పగించారు. లోన్ యాప్‌ల నుంచి అప్రమత్తంగా ఉండకపోతే ఇలాంటి దారుణాలే జరిగే అవకాశం ఉంది… జాగ్రత్తగా ఉండాలని హెచ్చరిస్తున్నారు పోలీసులు.
READ ALSO: Child Hero Austin: మృత్యువుకు ఎదురీదిన చిన్నోడు.. కుటుంబాన్ని కాపాడుకున్న పెద్దోడు!
తాజావార్తలు
-
UAPA: షహజాద్ భట్టి నెట్‌వర్క్‌పై భారత్ ఉక్కుపాదం.. ఉగ్రసంస్థగా ప్రకటన..
-
CM Revanth Reddy : భూ సమస్యలకు చెక్.. రేవంత్ సర్కార్ కీలక నిర్ణయాలు
-
Cigarette Price Hike: సిగరెట్ ప్రియులకు బిగ్ షాక్.. భారీగా పెరిగిన ధరలు.. కొత్త రేట్లు ఇవే..
-
Sharanya: ‘లైఫ్ ఆగమాగం చేశారు.. బాబును జాగ్రత్తగా చూసుకోండి’ ఈశ్వర్ సాయి భార్య ఆత్మహత్యాయత్నం..
-
Saudi Arabia: సౌదీ F-15ను కూల్చేశాం, మక్కాపై దాడి చేయలేదు.. హౌతీల సంచలన ప్రకటన..
ట్రెండింగ్
-
Meta One వచ్చేసింది.. ఇంస్టాగ్రామ్, వాట్సాప్, ఫేస్ బుక్ కు కొత్త సబ్స్క్రిప్షన్ ప్లాన్ ధరలు ఇదిగో.!
-
రూ.15,999కే 7,000mAh బ్యాటరీ, 2TB వరకు స్టోరేజ్ సపోర్ట్, 120Hz డిస్ప్లేతో OPPO K14 Lite లాంచ్.!
-
IPL 2027 Auction: బీసీసీఐ కీలక నిర్ణయం.. భారత్‌లోనే ఐపీఎల్ 2027 వేలం!
-
Sanju Samson vs Vaibhav: వైభవ్ సూర్యవంశీతో పోటీ.. సంజు శాంసన్ సంచలన వ్యాఖ్యలు!
-
Nitish Kumar Reddy: నా టార్గెట్ అదే.. అందుకోసమే కష్టపడుతున్నా!