T20 International Records: ఎన్ని సిక్సర్లు బాదినా.. ఈ క్రికెటర్ రికార్డు మాత్రం ఎవరూ బద్దలు కొట్టలేరు.. !
- Follow Us :
-
-
Add as a preferred
source on google
T20 International Records: ప్రపంచ క్రికెట్‌లో ప్రతిరోజూ కొత్త రికార్డులు నమోదవుతున్నాయి. అయితే కొన్ని రికార్డులు మాత్రం కాలం ఎంత గడిచినా చెరగవు. అలాంటి అరుదైన, అద్భుతమైన రికార్డు ఒకటి నేపాల్ స్టార్ ఆల్‌రౌండర్ దీపేంద్ర సింగ్ ఐరీ పేరిట ఉంది. ఎన్ని సిక్సర్లు బాదినా, ఎంత గొప్ప బ్యాటర్లు వచ్చినా.. ఈ రికార్డును బద్దలు కొట్టడం ఇప్పటివరకు ఎవరికీ సాధ్యపడలేదు.
టీ20 వరల్డ్ కప్ 2026: నేపాల్‌పై ప్రపంచ క్రికెట్ దృష్టి
ఐసీసీ పురుషుల టీ20 వరల్డ్ కప్ 2026 ఫిబ్రవరి 7 నుంచి మార్చి 8 వరకు భారత్–శ్రీలంక సంయుక్త ఆతిథ్యంతో జరగనుంది. ఈ టోర్నీలో మొత్తం 20 జట్లు పోటీపడనున్నాయి. వాటిలో నేపాల్ జట్టు కూడా అర్హత సాధించడం విశేషం. రోహిత్ పౌడెల్ నాయకత్వంలో, దీపేంద్ర సింగ్ ఐరీ, సందీప్ లామిచానే వంటి అనుభవజ్ఞులైన ఆటగాళ్లతో నేపాల్ ఈసారి పెద్ద జట్లకు సవాల్ విసిరే స్థితిలో ఉంది.
Also Read
- AUS W vs PAK W: పెర్రీ సూపర్ షో.. పాకిస్థాన్‌పై 113 పరుగుల భారీ విజయంతో సెమీఫైనల్ లోకి ఆసీస్.!
- Harmanpreet Kaur: వారి వల్లే మ్యాచ్ ఓడిపోయాం.. టీమిండియా కెప్టెన్ ఫైర్.!
- Women’s T20 World Cup 2026: 'మారిజాన్ కాప్' దూకుడు.. టీమిండియాకు ప్రపంచకప్ లో తొలి ఓటమి.!
- Women's T20 World Cup 2026 : పాకిస్తాన్‌ను చిత్తు చేసిన భారత్.. దీప్తి శర్మ ఐదు వికెట్ల సునామీ.!
గ్రూప్–Cలో నేపాల్..
టీ20 వరల్డ్ కప్‌లో నేపాల్‌ను గ్రూప్–Cలో ఉంచారు. ఈ గ్రూప్‌లో ఇంగ్లండ్, వెస్టిండీస్, స్కాట్‌ల్యాండ్, ఇటలీ జట్లు ఉన్నాయి. నేపాల్ తమ లీగ్ మ్యాచ్‌లన్నింటినీ ముంబై వాంఖడే స్టేడియంలో ఆడనుంది. ఫిబ్రవరి 8న ఇంగ్లండ్‌తో జరిగే మ్యాచ్‌తో వారి ప్రచారం ప్రారంభమవుతుంది.
టీ20 ఇంటర్నేషనల్స్‌లో దీపేంద్ర సింగ్ ఐరీ ప్రభావం
నేపాల్ తరఫున టీ20 ఇంటర్నేషనల్స్‌లో అత్యధిక పరుగులు సాధించిన ఆటగాడిగా దీపేంద్ర సింగ్ ఐరీ నిలిచాడు. 90 మ్యాచ్‌ల్లో 1956 పరుగులు చేశాడు.. సగటు 32.06తో 1 సెంచరీ, 10 అర్ధశతకాలు చేశాడు.. ఆ తర్వాత స్థానాల్లో కుశల్ భురతేల్ – 1807 పరుగులు (70 మ్యాచ్‌లు).. ఆసిఫ్ షేక్ – 1639 పరుగులు (68 మ్యాచ్‌లు) ఉన్నారు.
క్రికెట్ చరిత్రలోనే ఇది వేగవంతమైన అర్ధశతకం
దీపేంద్ర సింగ్ ఐరీ సాధించిన ఈ రికార్డు క్రికెట్ ప్రపంచంలో ప్రత్యేక అధ్యాయం. 2023 ఆసియా గేమ్స్‌లో మంగోలియాతో జరిగిన టీ20 మ్యాచ్‌లో దీపేంద్ర కేవలం 9 బంతుల్లో అర్ధశతకం (50 పరుగులు) సాధించాడు. ఇది ఇప్పటివరకు టీ20 ఇంటర్నేషనల్ చరిత్రలోనే వేగవంతమైన అర్ధశతకం.. ఎవరూ బద్దలు కొట్టలేని ప్రపంచ రికార్డు అవడం విశేషం. గమనించాల్సిన విషయం ఏమిటంటే.. ఏ ఆటగాడు వరుసగా 9 బంతుల్లో 9 సిక్సర్లు కొట్టినా, దీపేంద్ర రికార్డుకు సమం మాత్రమే అవుతాడు. కానీ, దాన్ని అధిగమించడం మాత్రం సాధ్యం కాదు.
అదే మ్యాచ్‌లో దీపేంద్ర ఒకే ఓవర్‌లో ఆరు సిక్సర్లు బాదిన ఘనత కూడా సాధించాడు. నేపాల్ భారీ స్కోర్.. అప్పట్లో ప్రపంచ రికార్డు.. మంగోలియాతో జరిగిన ఆ మ్యాచ్‌లో నేపాల్.. 3 వికెట్ల నష్టానికి 314 పరుగులు చేసింది. ఇది అప్పటివరకు టీ20 ఇంటర్నేషనల్ చరిత్రలోనే అత్యధిక స్కోర్. తర్వాత అక్టోబర్ 2024లో జింబాబ్వే, గాంబియాపై 344/4 స్కోర్ చేసి ఈ రికార్డును అధిగమించింది. అదే మ్యాచ్‌లో కుశల్ మల్ల 34 బంతుల్లో శతకం.. అప్పట్లో టీ20 ఇంటర్నేషనల్‌లో వేగవంతమైన శతకం సాధించాడు. ప్రస్తుతం ఈ రికార్డు ఎస్టోనియా ఆటగాడు సాహిల్ చౌహాన్ (27 బంతులు) పేరిట ఉంది. బౌలింగ్ విభాగంలో సందీప్ లామిచానే కీలక పాత్ర పోషించాడు.. నేపాల్ బౌలింగ్ విభాగంలో సందీప్ లామిచానే ప్రధాన ఆయుధంగా నిలుస్తున్నాడు. 67 మ్యాచ్‌ల్లో 129 వికెట్లు తీసుకున్నాడు.. ఇది 12.05 సగటుగా ఉంది.. ఇక, కరణ్ కేసి – 85 మ్యాచ్‌లు, 106 వికెట్లు.. సోమపాల్ కామి – 86 మ్యాచ్‌లు, 81 వికెట్లు ఉన్నాయి.
టీ20 ఇంటర్నేషనల్స్‌లో నేపాల్ గణాంకాలు
నేపాల్ ఇప్పటివరకు 112 మ్యాచ్‌లు ఆడగా.. 65 విజయాలు నమోదు చేసింది.. 41 పరాజయాలు చవిచూసింది.. ఫలితం లేని మ్యాచ్‌లు: 3.. టై మ్యాచ్‌లు: 3 ఆడింది. టీ20ల్లో నేపాల్ ఇప్పటికే వెస్టిండీస్, ఐర్లాండ్, నెదర్లాండ్స్ వంటి జట్లను ఓడించడం విశేషం.
టీ20 వరల్డ్ కప్ 2026 – నేపాల్ పూర్తి జట్టు
రోహిత్ పౌడెల్ (కెప్టెన్),
దీపేంద్ర సింగ్ ఐరీ (ఉప కెప్టెన్),
సందీప్ లామిచానే,
కుశల్ భురతేల్,
ఆసిఫ్ షేక్ (వికెట్ కీపర్),
బసీర్ అహ్మద్,
సోమపాల్ కామి,
కరణ్ కేసి,
లలిత రాజబంషీ,
గులాషన్ ఝా,
లోకేశ్ బామ్,
నందన్ యాదవ్,
షేర్ మల్లా.
నేపాల్ గ్రూప్ మ్యాచ్‌ల షెడ్యూల్
ఫిబ్రవరి 8 – ఇంగ్లండ్ vs నేపాల్ (ముంబయి)
ఫిబ్రవరి 12 – ఇటలీ vs నేపాల్ (ముంబయి)
ఫిబ్రవరి 15 – వెస్టిండీస్ vs నేపాల్ (ముంబయి)
ఫిబ్రవరి 17 – స్కాట్‌ల్యాండ్ vs నేపాల్ (ముంబయి)
తాజావార్తలు
-
Motorola Signature 27: మోటరోలా Signature 27 లాంచ్ డేట్ కన్ఫర్మ్.. 200MP కెమెరా, Dolby Vision సపోర్ట్, ప్రీమియం డిజైన్
-
PM Modi: పర్యావరణ పరిరక్షణతోనే ఆర్థిక ప్రగతి.. ప్రపంచానికి భారత్ ఆదర్శం
-
Indian Cinema: పాన్ ఇండియా నుంచి పాన్ వరల్డ్ మార్కెట్ వైపు అడుగులు వేస్తున్న ఇండియన్ సినిమాలు
-
Kishan Reddy: కాంగ్రెస్, బీఆర్ఎస్కు హైకోర్టు తీర్పు చెంపపెట్టు.. కేంద్ర మంత్రి కీలక వ్యాఖ్యలు..
-
Petrol Pump UPI Payments: పెట్రోల్ పంపుల్లో UPI చెల్లింపులకు బ్రేక్..? డీలర్ల కీలక ప్రకటన
ట్రెండింగ్
-
Gautam Gambhir: నా కోచింగ్ కెరీర్లోనే అదే కఠిన నిర్ణయం.. అతడు చాలా ఏడ్చాడు.. గంభీర్ షాకింగ్ కామెంట్స్!
-
iPhone 18 India Sales: ఐఫోన్ 18 కోసం 12 గంటల పాటు స్టోర్ల వద్ద క్యూ.. తొలి రోజే రికార్డ్ స్థాయి అమ్మకాలు..!
-
బడ్జెట్లో Kia Carens Clavis ఆటోమేటిక్.. కొత్త వేరియంట్స్ వచ్చేశాయి.!
-
649cc ఇంజిన్, 14 లీటర్ల ఫ్యూయల్ ట్యాంక్‌తో Kawasaki Vulcan S కొత్త క్రూయిజర్ బైక్ లాంచ్..!
-
48MP కెమెరా, 7000mAh బ్యాటరీతో Ai+ Nova 2 Power లాంచ్ డేట్ ఫిక్స్.. స్పెసిఫికేషన్స్ ఇవే.!