MVSP Collections: అల్ టైం రీజనల్ ఇండస్ట్రీ హిట్.. ‘మన శంకర వరప్రసాద్ గారు’ జోరు మాములుగా లేదుగా!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
MVSP Collections: మెగాస్టార్ చిరంజీవి బాక్సాఫీస్ వద్ద వసూళ్ల గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఆయన వెండితెరపై కనిపిస్తే చాలు రికార్డులు వాటంతట అవే క్రియేట్ అవుతుంటాయి. తాజాగా అనిల్ రావిపూడి దర్శకత్వంలో వచ్చిన ‘మన శంకర వరప్రసాద్ గారు’ సినిమాతో చిరు మరోసారి తన సత్తా చాటారు. కేవలం రీజనల్ సినిమాగా విడుదలై, పాన్ ఇండియా చిత్రాల రేంజ్ కలెక్షన్లతో ఆల్ టైమ్ ఇండస్ట్రీ రికార్డ్‌ను సెట్ చేశారు.
Also Read
- Srinidhi Shetty: "కెజియఫ్ వచ్చినా ఇంట్లో తిట్లు తప్పట్లేదు.." శ్రీనిధి శెట్టి షాకింగ్ కామెంట్స్
- Sardar 2 OTT: ఓటీటీలో 'సర్దార్ 2' ఊచకోత.. ప్రైమ్ వీడియోలో నంబర్ 1 ట్రెండింగ్!
- Vijay - Rashmika: "బీచ్‌లో నిక్కరేసుకుని తాళి కడదామనుకున్నా" .. రౌడీ హీరో విజయ్ వెడ్డింగ్ ప్లాన్‌పై ఇంట్లో సీన్ సితార!
- Manchu Manoj: మంచు మనోజ్ ఎమోషనల్ పోస్ట్.. భార్య మౌనిక కోసమే ఆ అడుగు!
2026 సంక్రాంతి కానుకగా విడుదలైన ఈ చిత్రం థియేటర్ల వద్ద కలెక్షన్ల వర్షం కురిపించింది. తాజాగా 25 రోజులు పూర్తి చేసుకున్న ఈ సినిమా.. ఇప్పటివరకు ఏకంగా రూ. 375 కోట్ల గ్రాస్ వసూలు చేసినట్లు చిత్ర యూనిట్ అధికారికంగా ప్రకటించింది. గతంలో తెలుగులో మాత్రమే విడుదలై అత్యధిక వసూళ్లు సాధించిన చిత్రంగా వెంకటేష్ నటించిన ‘సంక్రాంతికి వస్తున్నాం’ (రూ. 303 కోట్లు) పేరిట ఉన్న రికార్డును చిరంజీవి బద్దలు కొట్టారు.
అయితే బాహుబలి, పుష్ప వంటి చిత్రాలు ఇతర భాషల్లోనూ విడుదలై రికార్డులు సృష్టించగా.. ‘మన శంకర వరప్రసాద్ గారు’ కేవలం తెలుగు వెర్షన్‌తోనే ఈ భారీ ఘనత సాధించడం విశేషం. మొదటి రోజే రూ. 84 కోట్ల గ్రాస్‌తో చిరు కెరీర్‌లోనే బిగ్గెస్ట్ ఓపెనింగ్‌గా నిలిచింది. ఇక 7 రోజుల్లోనే రూ. 300 కోట్ల క్లబ్‌లో చేరిన తొలి ప్రాంతీయ చిత్రంగా చరిత్ర సృష్టించింది. అంతేకాదు యూఎస్ బాక్సాఫీస్ వద్ద కూడా ఈ చిత్రం సుమారు 5 మిలియన్ డాలర్ల మార్కును అందుకుంది అంటే నమ్మండి.
భారీగా పెరిగిన TVS Jupiter ధరలు.. వేరియంట్ లైనప్‌లో తాజా ధరలు ఇక్కడ చెక్ చేయండి..
థియేటర్లలో రికార్డులు సృష్టించిన ఈ బ్లాక్ బస్టర్ హిట్, ఇప్పుడు డిజిటల్ ప్లాట్‌ఫామ్‌పై అలరించడానికి సిద్ధమైంది. ఫిబ్రవరి 11 నుంచి ప్రముఖ ఓటిటి సంస్థ నెట్‌ఫ్లిక్స్ (Netflix) లో తెలుగుతో పాటు ఇతర భాషల్లోనూ స్ట్రీమింగ్ కానుంది. థియేటర్లో మిస్ అయిన వారు లేదా మళ్ళీ చూడాలనుకునే వారు ఫ్యామిలీతో కలిసి ఇంట్లోనే ఎంజాయ్ చేయవచ్చు.
తాజావార్తలు
-
Fire Accident : ప్లాస్టిక్ గోదాంలో భగ్గుమన్న మంటలు.. వరుసగా పేలిన కెమికల్ డ్రమ్ములు
-
Petrol Diesel Price: 100 డాలర్లు దాటిన క్రూడ్ ఆయిల్ ధరలు! OPEC+ కీలక నిర్ణయం.. పెట్రోల్, డీజిల్ ధరలు మళ్లీ పెరుగుతాయా?
-
World Teachers Day 2026 : చాట్‌జీపీటీ అన్నీ చెప్పేస్తుందా.. మరి టీచర్ ఎందుకు కావాలి.?
-
Telangana MLC : తెలంగాణ ఎమ్మెల్సీ రేసులో బిగ్ ట్విస్ట్.. ఆ మూడు సీట్లు ఎవరికి?
-
Luxury Sneakers: జెన్ జీ, మిలీనియల్స్‌ను తెగ ఆకర్షిస్తున్న స్నీకర్స్.. అంత స్పెషల్ ఏంటో తెలుసా..?
ట్రెండింగ్
-
Shreyas Iyer: పాకిస్థాన్ బ్యాటర్లు భయపెట్టారు.. గోల్డ్ మెడల్ పోతుందనుకున్నా.. అతడే కాపాడాడు!
-
National Boyfriend Day: మీ ప్రేమను మరింత స్పెషల్‌గా మార్చే సింపుల్ టిప్స్.!
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!