Anthropic AI: ఒక్క ఏఐ టూల్‌తో టెక్కీల గుండెల్లో గుబులు.. రాత్రికి రాత్రే వందల బిలియన్లు ఆవిరి! అసలు కారణం ఇదే?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Anthropic AI: ఒక్క వార్తతో టెక్ ప్రపంచం ఒక్కసారిగా ఉలిక్కిపడింది. ప్రపంచ వ్యాప్తంగా టెక్ షేర్ మార్కెట్లు కుప్పకూలాయి. అతిపెద్ద సాఫ్ట్‌వేర్ కంపెనీలైన ఇన్ఫోసిస్, టీసీఎస్ షేర్లు ఒక్కసారిగా దిగువకు పడిపోయాయి. భారీగా సంపద ఆవిరైపోయింది. ఇంతకీ ఏంటా వార్త? రాత్రికి రాత్రే ఏం జరిగింది? బుధవారం తెల్లవారుజామున టెక్కీలు నిద్రలో ఉండగానే జరిగిన పరిణామం ఏంటి? అనే విషయాల గురించి స్పష్టంగా తెలుసుకుందాం.. బుధవారం తెల్లవారుజామున, చాలా మంది నిద్రలో ఉండగానే ప్రపంచ టెక్ మార్కెట్‌లో ఒక్కసారిగా పెద్ద కుదుపు వచ్చింది. అతిపెద్ద సాఫ్ట్‌వేర్ కంపెనీల విలువ పడిపోవడంతో వందల బిలియన్ల డాలర్ల మార్కెట్ విలువ ఆవిరైపోయింది. ఈ పరిస్థితిని విశ్లేషకులు భారీ హెచ్చరికగా తీసుకున్నారు. ఈ గడ్డుకాలాన్ని నిపుణులు “సాస్(Software as a Service)-అపోకలిప్స్” అని పిలిచారు. అంటే సాఫ్ట్‌వేర్ ఎస్ ఎ సర్వీస్ రంగానికి అంతమొచ్చిందా? అనే అర్థం. ఈ తరుణంలో మైక్రోసాఫ్ట్ సీఈఓ సత్య నాదెళ్ల నుంచి జోహో అధినేత శ్రీధర్ వెంబు వరకు చాలామంది ఒకటే మాట చెబుతున్నారు. ఈ మార్కెట్ పతనం వాళ్ల మాటలు తేలికగా తీసుకోకూడదని గుర్తు చేశారు.
READ MORE: OLED టెక్నాలజీలో మరో ముందడుగు.. LG నుంచి Hyper Radiant Color TV వచ్చేస్తోంది!
Also Read
- Honor 600S 5G: 8100mAh బ్యాటరీ, 50MP కెమెరాతో Honor 600S 5G.. Snapdragon చిప్, Android 16తో కొత్త ఫోన్
- Acer Swift Neo AI Laptop: Acer Swift Neo AI ల్యాప్‌టాప్ రిలీజ్.. 32GB RAM, 1TB SSDతో అదిరిపోయే ఫీచర్లు.. తక్కువ ధరకే
- 5 స్టార్ డ్రాప్ రెసిస్టన్స్ తో వాటర్, డస్ట్‌కు ఫుల్ ప్రొటెక్షన్.. 7,200mAh బ్యాటరీతో Vivo Y31t 5G లాంచ్.. ధర, ఫీచర్లు ఇవే.!
- 8,340mAh బ్యాటరీ, 300% ఆడియో బూస్ట్, IP69K రేటింగ్ తో REDMI Note 17 Pro 5G లాంచ్.. ధర ఎంతంటే.?
ఈ టెక్కీ ప్రపంచాన్ని ఒక్కసారిగా కదిపేసింది క్లాడ్ కోవర్క్ అనే ఏఐ టూల్. దీన్ని రూపొందించింది ఆంథ్రోపిక్ అనే కంపెనీ. ఇదే కంపెనీ క్లాడ్ అనే ఏఐ చాట్‌బాట్‌ను సైతం తీసుకొచ్చింది. చాలా తక్కువ సమయంలోనే క్లాడ్ కోడర్లకు చాలా ఇష్టమైన సాధనంగా మారింది. తర్వాత డెవలపర్ల కోసం ప్రత్యేకంగా క్లాడ్ కోడ్ అనే వెర్షన్‌ను విడుదల చేశారు. అది కూడా పెద్ద విజయం సాధించింది. అప్పుడు ఆంథ్రోపిక్ ఒక ఆలోచన చేసింది. “ఏఐ ఉపయోగం కేవలం కోడర్లకే ఎందుకు పరిమితం కావాలి? మిగతా వైట్ కాలర్ ఉద్యోగులు సైతం దీన్ని వాడుకోవచ్చు కదా!” అనే ఆలోచన పుట్టుకొచ్చింది. ఈ ఆలోచన లోనుంచి క్లాడ్ కోవర్క్ జన్మించింది. ఇది జనవరి 12న విడుదలైంది. దీని ఆలోచన చాలా సింపుల్. మీరు దీన్ని మీ కంప్యూటర్‌లో ఇన్‌స్టాల్ చేసి, కొన్ని ఫైళ్లు లేదా ఫోల్డర్లకు యాక్సెస్ ఇస్తే చాలు. తర్వాత “ఈ పని చేయి” అని చెప్తె చాలా మొత్తం టకటకా చేస్తుంది. జీతాల లెక్కలు కావచ్చు, డేటా విశ్లేషణ కావచ్చు, స్టాక్ మార్కెట్ రిపోర్ట్ కావచ్చు, న్యాయపరమైన అంశాలతో కూడిన నివేదిక కావచ్చు ఏ పనైనా క్లాడ్ కోవర్క్ ఈజీగా చేయగలదని కంపెనీ చెబుతోంది.
READ MORE: Pakistani Terrorist: 20 సార్లు తప్పించుకున్నాడు, చివరకు కుక్క చావు చచ్చాడు..
జనవరి 12న ఇది వచ్చినప్పుడు మార్కెట్ పెద్దగా స్పందించలేదు. సాస్(Software as a Service) కంపెనీల షేర్లలో మార్పు లేదు. కానీ కొన్ని రోజులు తర్వాత అసలు సమస్య వచ్చింది. జనవరి 30న ఆంథ్రోపిక్ క్లాడ్ కోవర్క్‌కు ప్లగిన్లు తీసుకొచ్చింది. వీటిని సింపుల్‌గా చెప్పాలంటే.. మీరు చేయాలనుకున్న పనికి సంబంధించిన వివరాలను ముందే సిద్ధంగా ఉంచింది. మనం ఎలా పని కావాలో ఒకసారి చెప్పితే.. ఆ పనిని ఆదే తరహాలో ఎవ్వరూ చెప్పకుండానే చేస్తుంది. మొత్తం 11 ప్లగిన్లు విడుదలయ్యాయి. పని సామర్థ్యం పెంచడం, కంపెనీ ఫైళ్లలో వెతకడం, సేల్స్, ఫైనాన్స్, డేటా, లీగల్, మార్కెటింగ్, కస్టమర్ సపోర్ట్, ప్రొడక్ట్ మేనేజ్‌మెంట్, ఇంకా బయాలజీ రీసెర్చ్ వరకూ ఉన్నాయి. ఉదాహరణకి ఫైనాన్స్ ప్లగిన్ ఆర్థిక లెక్కలు చూడటం, మోడల్స్ తయారు చేయడం, ముఖ్యమైన సంఖ్యలను ట్రాక్ చేయడం చేయగలదు. ఇక్కడే సాస్ కంపెనీలకు గుబులు మొదలైంది. ఎందుకంటే ఇవే పనులు ఇప్పటివరకు టీసీఎస్, ఇన్ఫోసిస్ లాంటి కంపెనీలు చేస్తూ వచ్చాయి. వేల మంది జూనియర్ ఉద్యోగులను నియమించుకుని, సాధారణ పనులను ఆటోమేషన్ చేసి, గంటల వారీగా లేదా రోజుల వారీగా క్లయింట్లకు బిల్లులు వేయడం వంటి పనులను ఈ కంపెనీలు చేస్తున్నాయి. ఇప్పుడు అదే పనిని ఒక ఏఐ తక్కువ ఖర్చుతో వేగంగా చేస్తే పరిస్థితి ఏర్పడింది.
READ MORE: UBS-SreeLeela: శ్రుతి హాసన్ మాదిరి.. శ్రీలీల కెరీర్ కూడా టర్న్ అవుతుందా?
ఈ ప్రభావం ఫిబ్రవరి 3న మార్కెట్ ఈ భయాన్ని చూపించింది. పెట్టుబడిదారులు ఒక్కసారిగా షేర్లు అమ్మేయడం మొదలుపెట్టారు. ఒక ఏఐ ఏజెంట్ వేర్వేరు సాఫ్ట్‌వేర్‌లలో పని చేసి, స్వయంగా నిర్ణయాలు తీసుకుంటే ఖరీదైన ఎంటర్‌ప్రైజ్ సాఫ్ట్‌వేర్ అవసరం తగ్గిపోతుందనే ఆందోళన వాళ్లలో ఉంది. ఈ భయానికి మరింత బలం ఇచ్చింది ఆంథ్రోపిక్ సీఈఓ డారియో అమోడేయి చేసిన వ్యాఖ్య. 2030 నాటికి ఏఐ వల్ల 50 శాతం వైట్ కాలర్ ఉద్యోగాలు పోతాయని అన్నారు. అందుకే మార్కెట్ ఒక్కసారిగా కుదేలైంది. ఇది కేవలం షేర్ల పతనం కాదు. మనుషుల మీద ఆధారపడే ఐటీ సేవల భవిష్యత్తుపై భయాన్ని క్రియేట్ చేసింది. అయితే ఒక విషయం మాత్రం స్పష్టంగా తెలుస్తోంది. సాస్ ఇప్పుడే ముగియదు. కానీ.. ఏఐతో కలిసి పనిచేసే కంపెనీలే ఇక ముందుకు సాగుతాయి. మిగతావాళ్లకు ఈ “సాస్-అపోకలిప్స్” ఒక హెచ్చరికగా నిలుస్తుంది.
తాజావార్తలు
-
Karnataka: కర్ణాటక కాంగ్రెస్‌లో షాక్.. అవినీతి ఆరోపణలు.. కీలక మంత్రి రాజీనామా..
-
Ganja Seized: ఒడిశా నుంచి యూపీకి కారులో గంజాయి తరలింపు.. ముగ్గురు అరెస్ట్..
-
MAHARASHTRA: శ్రావణంలో ‘‘మటన్’’ కావాలని గొడవ.. కొడుకును చంపిన తండ్రి..
-
Hero Sanjosh : బ్లైండ్ ఫౌండేషన్ అమ్మాయిలతో రాఖీ వేడుకలు జరుపుకున్న హీరో సంజోష్
-
Liquor Policy: లిక్కర్ పాలసీపై తమిళనాడులో రాజకీయ వేడి.. సెప్టెంబర్ 1 నుంచి కొత్త విధానం..
ట్రెండింగ్
-
Fridge Wall Gap : ఫ్రిజ్‌ను గోడకు ఆనిస్తున్నారా? ఈ తప్పు చేయొద్దు.!
-
Mithali Raj: వైభవ్ సూర్యవంశీ అసాధారణ ప్రతిభావంతుడు.. అతడికి సరైన మెంటర్ కావాలి.!
-
Mithali Raj: వనరుల కొరత నుంచి సమాన మ్యాచ్ ఫీజుల వరకు.. మహిళా క్రికెట్లో విప్లవం.!
-
Mithali Raj: ‘నా తప్పేమీ లేకున్నా తొక్కేయాలని చూశారు’.. 2018 నాటి వివాదంపై సంచలన వ్యాఖ్యలు.!
-
Mithali Raj: ‘సరైన వ్యక్తి దొరికితే ఆలోచిస్తా..’ పెళ్లి, వ్యక్తిగత జీవితంపై మనసు విప్పిన టీమిండియా మాజీ కెప్టెన్.!