Group-1: గ్రూప్-1 నియామకాలపై హైకోర్టు బెంచ్ కీలక తీర్పు..
- ప్రభుత్వం, TGPSCకి తెలంగాణ హైకోర్టులో ఊరట
- సింగిల్ బెంచ్ తీర్పును కొట్టివేసిన డివిజన్ బెంచ్
- గ్రూప్-1 నియామకాలు సక్రమమేనని హైకోర్టు డివిజన్ బెంచ్ తీర్పు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
గ్రూప్ 1 ఉద్యోగాలకు ఎంపికైన అభ్యర్థులకు ఊరట లభించింది. గ్రూప్-1 నియామకాలపై హైకోర్టు బెంచ్ కీలక తీర్పు వెల్లడించింది. సింగిల్ జడ్జి తీర్పును రద్దు చేసింది సీజే ధర్మాసనం. గ్రూప్ 1 జనరల్ ర్యాంకింగ్ లిస్టును రద్దు చేస్తూ గతంలో సింగిల్ జడ్జి తీర్పు ఇచ్చిన విషయం తెలిసిందే. మెయిన్స్ జవాబు పత్రాలు మళ్ళీ మూల్యాంకనం చేయాలని సింగిల్ జడ్జి ఆదేశాలు ఇచ్చారు. అయితే సింగిల్ జడ్జి ఆదేశాలపై టీజీపీఎస్సీ, ఎంపికైన అభ్యర్థులు అప్పీల్ చేశారు. దీనిపై విచారణ చేపట్టిన ధర్మాసనం ఈమేరకు తీర్పు వెలువరించింది. తుది తీర్పునకు లోబడి నియామకాలు చేపట్టవచ్చని గతంలో ఉత్తర్వులు ఇచ్చింది సీజే బెంచ్.. ఇప్పటికే 562 మందికి తెలంగాణ ప్రభుత్వం నియామక పత్రాలు అందజేసింది.
Also Read:Srisailam Temple Ghee Controversy: శ్రీశైలానికి కూడా కల్తీ నెయ్యి సరఫరా..? కొత్త అనుమానాలు
Also Read
- Arshdeep Singh: టీ20ల్లో ఇదే నాకు అసలైన ఛాలెంజ్.. అర్ష్‌దీప్ కామెంట్స్ వైరల్..!
- IAS Officers: ఏపీలో 11 మంది ఐఏఎస్ అధికారులకు పోస్టింగ్‌లు..
- CJI Suryakant: సుప్రీంకోర్టు తలుపులు తెరిచే ఉంటాయి.. విపక్ష నేతలకు అపాయింట్మెంట్ నిరాకరణపై సీజేఐ క్లారిటీ
- RTC-Metro Pass: ప్రయాణికులకు అలర్ట్.. ఆర్టీసీ -మెట్రో కామన్ పాస్ ధరలు తగ్గింపు..!
ప్రభుత్వం, TGPSCకి, ఉద్యోగాలు పొందిన అభ్యర్థులకు తెలంగాణ హైకోర్టులో ఊరట లభించింది. అప్పీల్ పిటిషన్లను అనుమతించిన హైకోర్టు.. సింగిల్ బెంచ్ తీర్పును కొట్టివేసిన డివిజన్ బెంచ్.. గ్రూప్-1 నియామకాలు సక్రమమేనని హైకోర్టు డివిజన్ బెంచ్ తీర్పు ఇచ్చింది. గ్రూప్-1 పరీక్ష పారదర్శకంగానే జరిగింది.. పరీక్షలో అవకతవకలు జరిగినట్లు ఆధారాలు లేవు అని హైకోర్టు డివిజన్ బెంచ్ స్పష్టం చేసింది.
టీజీపీఎస్సీ 2024 లో గ్రూప్ 1 పరీక్ష నిర్వహించిన విషయం తెలిసిందే. పరీక్షలో అవకతవకలు జరిగాయని హైకోర్టును ఆశ్రయించారు సెలెక్ట్ కాని అభ్యర్థులు. విచారణ అనంతరం సెలెక్షన్ లిస్టును రద్దు చేసి మళ్లీ పరీక్ష నిర్వహించాలని హైకోర్టు సింగిల్ బెంచ్ తీర్పు ఇచ్చింది. సింగిల్ బెంచ్ తీర్పుపై స్టే విధించింది హైకోర్టు డివిజన్ బెంచ్. మూల్యాంకనంలో అక్రమాలు జరిగాయని పరీక్షలు రద్దు చేయాలని కొందరు అభ్యర్థులు హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. 2023 అక్టోబర్ 21 నుంచి 27 వరకు జరిగిన గ్రూప్-1 మెయిన్స్ పరీక్షలకు 21 వేల మంది విద్యార్థులు హాజరయ్యారు. ఆ పరీక్షల ఫలితాలను టీజీపీఎస్సీ గతేడాది మార్చి 10న విడుదల చేసింది. ఈ ఫలితాల్లో అభ్యర్థులకు వచ్చిన మార్కులపై అనేక అనుమానాలు తలెత్తాయి.
Also Read:Chandrahas : హీరో చంద్రహాస్ పై డైరెక్టర్ ఫైర్.. ఆ బూతు పాటతో మాకేం సంబంధం?
పరీక్షల్లో జెల్ పెన్నులు వాడటం, కోఠి మహిళా కాలేజీలో పరీక్ష రాసిన అభ్యర్థుల్లో ఎక్కువ మంది సెలెక్ట్ కావడం, తెలుగు మీడియం అభ్యర్థులు తక్కువగా ఎంపిక కావడం, కేవలం 2 సెంటర్ల నుంచే టాపర్లు ఉండటం తదితర అంశాలపై పలువురు అభ్యర్థులు కోర్టును ఆశ్రయించారు. పరీక్షలు రద్దు చేయొద్దని కోర్టులో పిటిషన్ వేసిన ఉద్యోగాలకు ఎంపికైన అభ్యర్థులు. ఇప్పటికే ఇరువురి పిటిషన్లపై వాదనలు విన్న న్యాయస్థానం ఈ రోజు తీర్పు వెల్లడించింది
తాజావార్తలు
-
Jai Jasti-Medha Meka: టాలీవుడ్ ఎంట్రీ ఇస్తున్న ‘ఆమె’ కూతురు.. రొమాంటిక్ పోస్టర్ వచ్చేసింది!
-
Arshdeep Singh: టీ20ల్లో ఇదే నాకు అసలైన ఛాలెంజ్.. అర్ష్‌దీప్ కామెంట్స్ వైరల్..!
-
IAS Officers: ఏపీలో 11 మంది ఐఏఎస్ అధికారులకు పోస్టింగ్‌లు..
-
CJI Suryakant: సుప్రీంకోర్టు తలుపులు తెరిచే ఉంటాయి.. విపక్ష నేతలకు అపాయింట్మెంట్ నిరాకరణపై సీజేఐ క్లారిటీ
-
RTC-Metro Pass: ప్రయాణికులకు అలర్ట్.. ఆర్టీసీ -మెట్రో కామన్ పాస్ ధరలు తగ్గింపు..!
ట్రెండింగ్
-
Naman Dhir: నువ్వు సిక్స్ కొడతావా.? నేను వికెట్ తీస్తా.. టీమిండియా సంచలనం తీరు మాములుగా లేదుగా.!
-
T20 World Record: 3 వికెట్లు.. ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్.. టీ20ల్లో సరికొత్త ప్రపంచ రికార్డు.! అర్ష్‌దీప్‌కు డబుల్ ధమాకా..
-
Youtuber Nandu: చీకటి ఎంత శక్తివంతంగా కనిపించినా.. చివరికి సత్యం, ధర్మం, మంచితనమే గెలుస్తాయి..! పోస్ట్ వైరల్..
-
Nitish Reddy: మా కెప్టెన్ వికెట్ తియ్యొద్దన్నాడు.. నితీష్ రెడ్డి ఆసక్తికర వ్యాఖ్యలు!
-
T20I World Record: వెస్టిండీస్ సరికొత్త వరల్డ్ రికార్డు.. చరిత్రకు మూడు సిక్సర్ల దూరంలో భారత్.!