Google Pixel 10a Launch: 48MP కెమెరా, 5100mAh బ్యాటరీ.. అతి తక్కువ ధరలో ‘పిక్సెల్ 10ఏ’ ఫ్లాగ్‌షిప్ ఫోన్!
- 'పిక్సెల్ 10ఏ'ను అధికారికంగా ప్రకటించిన గూగుల్
- 48MP కెమెరా, 5100mAh బ్యాటరీ
- అతి తక్కువ ధరలో పిక్సెల్ 10ఏ ఫోన్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Google Pixel 10a Launch and Price in India: ‘గూగుల్’ తన పాపులర్ ‘A’ సిరీస్‌లో తాజా స్మార్ట్‌ఫోన్ ‘గూగుల్ పిక్సెల్ 10ఏ’ (Google Pixel 10a)ను అధికారికంగా ప్రకటించింది. బుధవారం విడుదల చేసిన ఒక చిన్న టీజర్ వీడియోలో.. కంపెనీ అధికారికంగా ఫోన్ డిజైన్‌ను ధృవీకరించింది. ఫ్లాగ్‌షిప్ ఫీచర్లను మధ్యతరగతి ధరలో అందించడమే లక్ష్యంగా ఈ ఫోన్‌ను తీసుకొచ్చినట్టు గూగుల్ స్పష్టం చేసింది. డిజైన్ నుంచి కెమెరా, సాఫ్ట్‌వేర్ వరకు పిక్సెల్ బ్రాండ్‌కు ప్రత్యేకమైన అనుభవాన్ని పిక్సెల్ 10ఏ అందించనుంది. త్వరలోనే లాంచ్ ఉంటుందని కంపెనీ స్పష్టం చేసింది. గూగుల్ పిక్సెల్ 10ఏ ఫీచర్స్ ఎలా ఉన్నాయో ఓసారి చూద్దాం.
గూగుల్ పిక్సెల్ 10ఏలో 6.3 ఇంచెస్ ఫుల్‌హెచ్‌డీ ప్లస్ అమోలెడ్ డిస్‌ప్లే ఉంది. ఇది 120Hz రిఫ్రెష్ రేట్‌కు సపోర్ట్ చేస్తుండటంతో.. స్క్రోలింగ్, గేమింగ్ అనుభవం మరింత స్మూత్‌గా ఉంటుంది. డిస్‌ప్లే క్వాలిటీ విషయంలో గూగుల్ ఎప్పటిలాగే ప్రీమియం టచ్ ఇచ్చినట్టు కనిపిస్తోంది. పర్ఫార్మెన్స్ విషయానికి వస్తే.. ఇందులో గూగుల్ సొంతంగా డెవలప్ చేసిన Tensor G4 ప్రాసెసర్‌ను ఉపయోగించారు. AI ఫీచర్లు, కెమెరా ప్రాసెసింగ్, స్మూత్ యూజర్ ఎక్స్‌పీరియన్స్‌లో ఈ చిప్ కీలక పాత్ర పోషించనుంది. పిక్సెల్ ఫోన్లకు ప్రత్యేకమైన సాఫ్ట్‌వేర్ ఆప్టిమైజేషన్ ఇక్కడ కూడా హైలైట్‌గా ఉండనుంది.
Also Read
- Oppo Find X10: ఒప్పో Find X10 సిరీస్‌లో మూడు మోడల్స్.. గ్లోబల్ లాంచ్‌కు సిద్ధం.. 200MP కెమెరా, 8,000mAh బ్యాటరీ
- iPhone 17 Pro Discount: ఐఫోన్ 17 ప్రోపై ఊహించని డిస్కౌంట్.. రూ.69,990కే సొంతం చేసుకునే ఛాన్స్!
- India Sovereign Cloud: ఆధార్.. యూపీఐ.. డిజిలాకర్.. కీలక డేటా కోసం కేంద్రం భారీ సెక్యూరిటీ ప్లాన్.. ఇదే ‘సావరెన్ క్లౌడ్’!
- Redmi Note 15 SE 5G: రెడ్ మీ Note 15 SE 5G.. 120Hz Curved AMOLED డిస్‌ప్లే, 5800mAh బ్యాటరీ, 50MP కెమెరా
కెమెరా సెక్షన్‌లో పిక్సెల్ 10ఏ మరోసారి తన క్లాస్‌ను చూపించనుంది. వెనుక భాగంలో 48MP మెయిన్ కెమెరా (OISతో), 13MP సెకండరీ కెమెరా ఉన్నాయి. ముందు భాగంలో 12MP సెల్ఫీ కెమెరా ఇవ్వడం జరిగింది. ఫోటోగ్రఫీ, వీడియో రికార్డింగ్‌లో గూగుల్ ఇమేజ్ ప్రాసెసింగ్ మళ్లీ గేమ్ చేంజర్ అవుతుందనే అంచనాలు ఉన్నాయి. ఈ ఫోన్‌లో 5,100mAh బ్యాటరీని అందించారు. ఇది రోజంతా ఉపయోగానికి సరిపోతుందని కంపెనీ చెబుతోంది. అలాగే 20W వైర్డ్ ఛార్జింగ్, 7.5W వైర్‌లెస్ ఛార్జింగ్ సపోర్ట్ కూడా ఉంది. ఈ ధర సెగ్మెంట్‌లో వైర్‌లెస్ ఛార్జింగ్ ఉండటం Pixel 10aకు ప్లస్ పాయింట్.
సాఫ్ట్‌వేర్ పరంగా పిక్సెల్ 10ఏ లేటెస్ట్ ఆండ్రాయిడ్ 16తోనే వస్తోంది. ప్యూర్ ఆండ్రాయిడ్ అనుభవం, రెగ్యులర్ సెక్యూరిటీ అప్డేట్స్, లాంగ్‌టర్మ్ ఓఎస్ సపోర్ట్ పిక్సెల్ ఫోన్లకు ఉన్న పెద్ద అడ్వాంటేజ్. స్పెసిఫికేషన్స్, బ్రాండ్ విలువను చూస్తే.. భారత మార్కెట్లో దీని ప్రారంభ ధర రూ.42,999 నుంచి రూ.45,999 మధ్య ఉంటుందని టెక్ వర్గాలు అంచనా వేస్తున్నాయి. ఈ రేంజ్‌లో లాంచ్ అయితే Samsung, OnePlus, iQOO వంటి బ్రాండ్లకు Pixel 10a గట్టి పోటీ ఇవ్వగలదు. ప్రీమియం ఫీచర్లతో వచ్చే మిడ్-రేంజ్ స్మార్ట్‌ఫోన్‌గా భారత మార్కెట్లో మంచి క్రేజ్ తెచ్చుకునే అవకాశం కనిపిస్తోంది.
తాజావార్తలు
-
India’s Artificial Sun: భారత్ ‘ఆర్టిఫిషియల్ సన్’ ప్రయోగం సక్సెస్.. సూర్యుడి కేంద్రం కంటే 20 రెట్లు వేడి!
-
Trump: తెలివైన అధ్యక్షుడు ఉండగా ఏఐకి కళ్లెం వేయక్కర్లేదు.. ట్రంప్ కీలక వ్యాఖ్యలు
-
Cupid Limited Share Price: కండోమ్‌లు అమ్మే కంపెనీ.. స్టాక్ మార్కెట్లో కోటీశ్వరులను చేసేసింది.. ఎలా అంటే..
-
Varun Chakaravarthy: చెడ్డ బంతికి వికెట్ వస్తే ఆనందించను.. కారణమేంటో చెప్పిన వరణ్ చక్రవర్తి..
-
Samantha Seemantham: శ్రీవిద్య పద్ధతిలో సమంత సీమంతం.. “నా బిడ్డకు దక్కిన వరం” అంటూ ఎమోషనల్ పోస్ట్!
ట్రెండింగ్
-
Ganga Aarti in London: లండన్‌లో తొలిసారి గంగా హారతి.. థేమ్స్ నది తీరంలో ఆధ్యాత్మిక సందడి.!
-
Ragi Drumstick Leaves Roti: డయాబెటిస్, బీపీ ఉన్నవారికి సంపూర్ణ ఆహారం.. సంపూర్ణ పోషణనిచ్చే ‘రాగి మునగాకు రొట్టె’ చేసేయండి ఇలా.!
-
Beetroot Pachadi: బీట్రూట్ అంటే నచ్చదా? ఇలా పచ్చడి చేసి పెట్టండి.. ప్లేట్ మొత్తం ఖాళీ చేసేస్తారు.!
-
India Women: నాలుగింటిలో నాలుగు.. ఆరింటిలో నాలుగు.. ఆసియా కప్‌లో భారత్ హవా!
-
Rajyogam: 200 ఏళ్ల తర్వాత అరుదైన యోగం.. ఈ 5 రాశుల వారికి పట్టిందల్లా బంగారమే..!