Vijayawada GGH Doctor Death: బెజవాడ జీజీహెచ్‌లో కలకలం..! డ్యూటీలో ఉన్న యువ డాక్టర్ దీపిక మృతి.. ఏం జరిగింది..?
- విజయవాడ GGHలో కలకలం..
- డ్యూటీలో ఉన్న సమయంలో యువ డాక్టర్ దీపిక మృతి..
- MBBS పూర్తి చేసి మెడిసిన్ పీజీ చేస్తున్న అనంతపురానికి చెందిన దీపిక ..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Vijayawada GGH Doctor Death: బెజవాడ ప్రభుత్వ జనరల్ హాస్పిటల్ (GGH)లో డ్యూటీలో ఉన్న ఓ యువ వైద్యురాలి మృతి కలకలం రేపింది. తెల్లవారుజామున ఆసుపత్రి వార్డులోనే డాక్టర్ దీపిక మృతి చెందిన ఘటన తీవ్ర విషాదాన్ని నింపింది. అనంతపురం జిల్లా చెందిన దీపిక, ఎంబీబీఎస్ పూర్తి చేసి ప్రస్తుతం విజయవాడ జీజీహెచ్‌లో మెడిసిన్ విభాగంలో పీజీ (పోస్ట్ గ్రాడ్యుయేషన్) చదువుతోంది. నిత్యం లాగే నిన్న రాత్రి కూడా ఆమె డ్యూటీకి హాజరైందని ఆసుపత్రి వర్గాలు తెలిపాయి.
Read Also: Nithiin : సొంత నిర్మాణ సంస్థలో నితిన్ సినిమా.. దర్శకుడు ఎవరంటే
Also Read
- TDP Office Attack Case: టీడీపీ ఆఫీసు దాడి కేసు.. రౌడీ షీట్ల వ్యవహారంలో కీలక మలుపు
- AP Drought: ఏపీలో 544 మండలాలను కరువు ప్రాంతాలుగా గుర్తించాలి.. జాతీయ విపత్తుగా ప్రకటించాలి..
- Nara Lokesh: ఏపీలో 50 శాతం మంది ఎమ్మెల్యేలు యువత.. పరిశ్రమలకు కొత్త అర్థం చెప్పడమే మా లక్ష్యం..
- Vijayawada Crime: విజయవాడలో కలకలం.. పెళ్లికి ఒప్పుకోలేదని ప్రియురాలిపై దాడి.. ప్రియుడు మృతి
అయితే, ఆసుపత్రి వార్డులో డ్యూటీలో ఉన్న సమయంలోనే, తెల్లవారుజామున దీపిక అపస్మారక స్థితిలో పడిపోయినట్టు సమాచారం. విధుల్లో ఉన్న ఇతర వైద్యులు వెంటనే ఆమెను పరిశీలించగా అప్పటికే మృతి చెందినట్టు నిర్ధారించారు. దీంతో ఆసుపత్రిలో ఒక్కసారిగా విషాద వాతావరణం నెలకొంది. పోలీసుల ప్రాథమిక సమాచారం ప్రకారం, దీపిక నిన్న రాత్రి తీవ్ర కడుపు నొప్పితో బాధపడినట్టు తెలిసింది. ఈ నేపథ్యంలోనే ఆమె స్వయంగా చికిత్స కోసం ఇంజెక్షన్ తీసుకున్నట్టు అనుమానిస్తున్నారు. మృతదేహాన్ని పరిశీలించిన పోలీసులు, దీపిక చేతిపై ఇంజెక్షన్ తీసుకున్న గుర్తులు ఉన్నట్టు గుర్తించారు. అయితే, ఆ ఇంజెక్షన్ ఏ మందుకు సంబంధించినది, అది వైద్యపరంగా అనుమతించబడినదేనా..? అనే అంశాలపై ఇంకా స్పష్టత రావాల్సి ఉంది.
మరోవైపు.. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేయలేదు. అనంతపురం నుంచి దీపిక తల్లిదండ్రులు విజయవాడకు చేరుకున్న తర్వాత, వారి ఫిర్యాదు ఆధారంగా పూర్తి స్థాయి విచారణ చేపడతామని పోలీసులు తెలిపారు. అవసరమైతే పోస్టుమార్టం నివేదిక ఆధారంగా మరిన్ని అంశాలు వెలుగులోకి తీసుకువస్తామని పేర్కొన్నారు. అయితే, డ్యూటీలో ఉన్న సమయంలోనే ఓ యువ వైద్యురాలు మృతి చెందడం జీజీహెచ్ వైద్యులు, పీజీ విద్యార్థుల్లో తీవ్ర దిగ్భ్రాంతిని కలిగించింది. సహచరులు దీపిక మృతి పట్ల సంతాపం తెలియజేస్తూ, ఘటనపై సమగ్ర విచారణ జరపాలని డిమాండ్ చేస్తున్నారు. డ్యూటీలో ఉన్న వైద్యురాలి అకస్మిక మృతి వెనుక అసలు కారణం ఏమిటన్నది ఇప్పటికీ మిస్టరీగానే ఉంది. తల్లిదండ్రుల ఫిర్యాదు, పోస్టుమార్టం నివేదిక, పోలీసుల విచారణ అనంతరం పూర్తి వివరాలు వెలుగులోకి వచ్చే అవకాశం ఉంది.
తాజావార్తలు
-
Chandrababu–Pawan Kalyan Meeting: చంద్రబాబు–పవన్ కల్యాణ్ భేటీలో కీలక నిర్ణయాలు.. స్థానిక ఎన్నికలపై ఫోకస్
-
WCL 2026 నుంచి పాకిస్థాన్ ఛాంపియన్స్ ఔట్.. NOC ఇవ్వని PCB.!
-
Kakarakaya Vepudu: అన్నంలోకి ‘కాకరకాయ వేపుడు’.. ఇలా చేస్తే ప్లేట్ ఖాళీ అవ్వాల్సిందే.!
-
EPIC : ఓటీటీ స్ట్రీమింగ్ కు రెడీ అవుతున్న ‘ఎపిక్’.. ఎప్పుడు ఎక్కడ చూడాలంటే?
-
Harmanpreet Kaur: హర్మన్‌ప్రీత్ కౌర్ సంచలన నిర్ణయం!
ట్రెండింగ్
-
Suryakumar Yadav: సూర్యకుమార్ యాదవ్‌కు బిగ్ షాక్.. టీమ్‌లో నో ప్లేస్.. టీనేజర్‌కు వైస్ కెప్టెన్సీ!
-
Big Billion Days Offers: రూ.20,000 లోపు లభించే టాప్ స్మార్ట్‌ఫోన్ డీల్స్ ఇదిగో.. అస్సలు మిస్ కావద్దు.!
-
IND vs WI: ఇషాన్ కిషన్ జోరు.. అర్ష్‌దీప్ పేస్.. నేడే తొలి టీ20 మ్యాచ్..!
-
పెద్ద బటన్లు.. వాయిస్ గైడెన్స్.. ఎమర్జెన్సీ ఎస్ఓఎస్.. రూ.1,499కే itel Care..!
-
How to Make Murmura at Home: ప్రెజర్ కుక్కర్ ఉంటే చాలు.. ఇంట్లోనే కరకరలాడే బొరుగులు తయారు చేసుకోండి!