Andhra Pradesh: గుడ్‌న్యూస్ చెప్పిన సర్కార్.. గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగులకు ప్రమోషన్లు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Andhra Pradesh: ఆంధ్రప్రదేశ్‌లోని గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగులకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త తెలిపింది. స్వర్ణ గ్రామం – స్వర్ణ వార్డు లక్ష్యంగా పనిచేస్తున్న సచివాలయ వ్యవస్థను మరింత బలోపేతం చేయడానికి ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. అన్ని గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగులకు ప్రమోషన్లు కల్పించే దిశగా చర్యలు చేపట్టాలని నిర్ణయించింది. సచివాలయ ఉద్యోగుల సేవలను సమర్థవంతంగా వినియోగించుకునేందుకు ప్రభుత్వం ఉద్యోగుల క్రమబద్ధీకరణ ప్రక్రియను అమలు చేయనుంది. ఇందులో భాగంగా, ప్రస్తుతం గ్రామ, వార్డు సచివాలయాల్లో పనిచేస్తున్న ఉద్యోగులకు స్పష్టమైన కెరీర్ మార్గం కల్పించేందుకు మూడంచెల వ్యవస్థను అమలు చేయాలని నిర్ణయించింది.
Read Also: Nagavamsi : ధురంధర్ 2 కు పోటీగా వస్తున్న నాగవంశీ.. ఆ సినిమా రిలీజ్ కు ఏర్పాట్లు
Also Read
- APPSC Group 1 మూల్యాంకనంపై హైకోర్టులో తుది విచారణ.. కీలక వాదనలు..
- AP and Telangana Weather: ఏపీ, తెలంగాణపై ఉపరితల ద్రోణుల ప్రభావం.. పలు ప్రాంతాలకు వర్ష సూచన
- AP Government: కేఆర్ఎంబీకి ఏపీ కీలక లేఖ.. శ్రీశైలం నీటి వినియోగంపై అభ్యంతరం
- Amaravati - Krishna River: అమరావతికి గుడ్‌న్యూస్.. కృష్ణా నది కరకట్ట పనులకు గ్రీన్ సిగ్నల్
ఈ మూడంచెల విధానంతో ఉద్యోగులకు సీనియారిటీ ఆధారంగా పదోన్నతులు కల్పించనున్నారు.. బాధ్యతల విభజన, పనితీరు ఆధారంగా అవకాశాలు కల్పించేలా ప్రభుత్వం ప్రణాళిక రూపొందిస్తోంది. దీని వల్ల ఉద్యోగుల్లో ఉత్సాహం పెరగడంతో పాటు, ప్రజలకు అందే సేవల నాణ్యత మరింత మెరుగుపడనుంది. ఇక, ఉద్యోగుల క్రమబద్ధీకరణలో భాగంగా, ఇతర ప్రభుత్వ శాఖల్లో ఉన్న ఖాళీలను గ్రామ, వార్డు సచివాలయాల్లో పనిచేస్తున్న అర్హత కలిగిన ఉద్యోగులతో భర్తీ చేయాలన్న ఆలోచనలో ప్రభుత్వం ఉన్నట్లు సమాచారం. ఇది ఉద్యోగులకు మరిన్ని అవకాశాలు కల్పించడమే కాకుండా, ప్రభుత్వ శాఖల్లో మానవ వనరుల లోటును కూడా తగ్గించనుంది. అయితే, ప్రభుత్వ నిర్ణయంతో గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగుల్లో ఆనందం వెల్లివిరుస్తోంది. ఎన్నో ఏళ్లుగా ప్రమోషన్ల కోసం ఎదురుచూస్తున్న ఉద్యోగులకు ఈ నిర్ణయం ఉత్సాహాన్నిచ్చే పరిణామంగా మారింది. అయితే, ఈ ప్రమోషన్లు, క్రమబద్ధీకరణకు సంబంధించిన వివరమైన మార్గదర్శకాలు త్వరలో విడుదలయ్యే అవకాశం ఉందని అధికార వర్గాలు తెలిపాయి. అర్హతలు, సీనియారిటీ, సేవా కాలాన్ని పరిగణనలోకి తీసుకుని తుది నిర్ణయం తీసుకునే అవకాశముంది.
తాజావార్తలు
-
Employees Bonus: కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు పండుగ గిఫ్ట్.. ఖాతాల్లోకి ఆ రోజే బోనస్ డబ్బులు!
-
flydubai Incident: ఫ్లై దుబాయ్ విమానాన్ని కాపాడిన భారత పైలట్.. 9/11 తరహా ప్రమాదం తప్పించిన హీరో!
-
Mamata Banerjee: ‘‘ఇంట్లో నుంచి బయటకు రాలేకపోతున్నా’’.. బీజేపీపై మమత ఆగ్రహం..
-
Koffee With Karan: రెండు దశాబ్దాల సంచలనాలకు ఎండ్ కార్డ్.. ‘కాఫీ విత్ కరణ్’కు గుడ్‌బై చెప్పిన కరణ్!
-
El Nino Effect: ఎల్ నినో ఎఫెక్ట్.. ఎడారిలో విరగబూసిన పూలు!
ట్రెండింగ్
-
John Campbell Record: భారత్‌పై శివాలెత్తిన జాన్ క్యాంప్‌బెల్.. మొదటి బ్యాటర్‌గా అరుదైన రికార్డు!
-
రూ.1,100కే కొత్త ఫీచర్ ఫోన్.. 1,000mAh బ్యాటరీ, USB-C ఛార్జింగ్ తో HMD 106 Pure లాంచ్.!
-
Diwali Crackers: దీపావళి టపాసులపై సుప్రీం కీలక వ్యాఖ్యలు.. నిర్దిష్ట సమయంపై నిర్ణయం.!
-
Japanese Cleaning Tips: ఇల్లు ఎప్పుడూ నీట్‌గా ఉండాలంటే.. జపాన్ వాళ్ల ఈ 6 అలవాట్లు ఫాలో అవ్వండి..!
-
Gold Medal For India: పతకాల జోరు.. కాంపౌండ్ మిక్స్డ్ టీమ్‌లో చరిత్ర.. ఆసియా గేమ్స్‌లో భారత్‌కు మరో స్వర్ణం..!