కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ తన 53వ పుట్టినరోజును జరుపుకుంటున్నారు. రాహుల్ గాంధీ తన ప్రకటనల వల్ల ఎప్పుడూ హెడ్‌లైన్స్‌లో ఉంటారు.

రాహుల్ గాంధీ 20 జనవరి, 2013న కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు అయ్యారు. మొదటి ప్రసంగంలో.. నిన్న రాత్రి అమ్మ సోనియాగాంధీ నా వద్దకు వచ్చి అధికారం విషం లాంటిదని, అది బలంతో పాటు ప్రమాదాన్ని తెచ్చిపెడుతుందని రాహుల్ గాంధీ అన్నారు.

రాహుల్ గాంధీ తన కుటుంబంలో అత్యంత విద్యావంతుడు. రాహుల్ కేంబ్రిడ్జ్ యూనివర్సిటీలోని ట్రినిటీ కాలేజీలో డెవలప్‌మెంట్ ఎకనామిక్స్‌లో ఎంఫిల్ పూర్తి చేశారు. కొన్ని రోజులు ఓ కంపెనీలో కూడా పనిచేశారు. ఆ తర్వాత ఇండియాకు వచ్చారు.

భద్రతా కారణాల దృష్ట్యా రాహుల్ గాంధీ తన గుర్తింపును దాచిపెట్టి కేంబ్రిడ్జ్ యూనివర్సిటీలో చదివారు. ఆయనను రౌల్ విన్సీ అని పిలిచేవారు. దీని వెనుక భద్రతా కారణాలను ప్రస్తావించారు. ఆయన గుర్తింపు వర్సిటీకి మాత్రమే తెలుసు.

రాహుల్ గాంధీ 2004 జనవరిలో తొలిసారిగా అమేథీని సందర్శించారు. మార్చి 2004లో, తాను అమేథీ స్థానం నుంచి లోక్‌సభ ఎన్నికలలో పోటీ చేస్తానని ప్రకటించారు. జనవరిలో అమేథీ పర్యటనలో తాను ఇంకా రాజకీయాల్లోకి రానని చెప్పారు.

రాహుల్ గాంధీ తన తొలి ఎన్నికల్లో రికార్డు స్థాయిలో ఓట్లతో విజయం సాధించారు. ఆయన అమేథీ లోక్‌సభ స్థానం నుంచి దాదాపు మూడు లక్షల ఓట్ల తేడాతో గెలుపొందారు. మాజీ ప్రధాని రాజీవ్ గాంధీ, సోనియా గాంధీ కూడా అమేథీ లోక్‌సభ స్థానం నుంచి ఎంపీలుగా ఎన్నికయ్యారు.

2004లో యూపీఏ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత 2006 జనవరిలో హైదరాబాద్‌లో కాంగ్రెస్ మహాసభలు జరిగాయి. అప్పుడు వేలాది మంది కాంగ్రెస్ కార్యకర్తలు, నాయకులు రాహుల్ గాంధీని పార్టీలో ఏదైనా పదవిలో చూడాలని కోరుకున్నారు, కాని రాహుల్ గాంధీ నిరాకరించారు.

 ప్రకటనల కారణంగా చాలాసార్లు వివాదాల్లో చిక్కుకున్నారు. 2007లో యూపీ అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో మాట్లాడుతూ, బాబ్రీ మసీదు కూల్చివేత సమయంలో గాంధీ కుటుంబానికి చెందిన ఎవరైనా క్రియాశీలకంగా ఉండి ఉంటే ఇలా జరిగేది కాదని అన్నారు.

2011లో తొలిసారిగా రాహుల్ గాంధీని అరెస్టు చేశారు. యూపీ రైతులను కలిసేందుకు వెళ్తున్న ఆయనను అరెస్ట్ చేశారు. అప్పట్లో యూపీలో మాయావతి నేతృత్వంలో బీఎస్పీ ప్రభుత్వం ఉంది.

రాహుల్ గాంధీకి రాజకీయాలతో పాటు క్రీడలంటే కూడా ఇష్టం. రాహుల్ గాంధీకి స్విమ్మింగ్, సైక్లింగ్, బాక్సింగ్, షూటింగ్ కూడా తెలుసు. మార్షల్ ఆర్ట్స్‌లో శిక్షణ కూడా తీసుకున్నాడు. ఆయనకు విమానం నడపడం కూడా తెలుసు.

రాహుల్ గాంధీ జీవితంలో రెండు పెద్ద విషాదాలు చోటు చేసుకున్నాయి. రాహుల్‌కు 14 ఏళ్ల వయసున్నప్పుడే ఆయన నాయనమ్మ మాజీ ప్రధాని ఇందిరా గాంధీ హత్యకు గురయ్యారు.  21 సంవత్సరాల వయస్సులో ఉన్నప్పుడు తండ్రి హత్యకు గురయ్యారు.