IPL 2026: ఐపీఎల్ వాయిదా.. ప్రారంభ మ్యాచ్ అప్పుడే..!
- ఐపీఎల్ 2026 వాయిదా..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
IPL 2026: ఐపీఎల్ 2026 సీజన్ ప్రారంభంపై అనిశ్చితి నెలకొంది. T20 వరల్డ్ కప్ 2026 ముగింపు దశకు చేరుకున్న నేపథ్యంలో.. మార్చి 8న ఫైనల్ అనంతరం క్రికెట్ అభిమానుల దృష్టి ఐపీఎల్ పై నిలవనుంది. అయితే ముందుగా ప్రకటించినట్లుగా మార్చి 26న కాకుండా, టోర్నమెంట్‌ను మార్చి 28న ప్రారంభించాలని బీసీసీఐ (BCCI) అకస్మాత్తుగా నిర్ణయించడం ఇప్పుడు చర్చనీయాంశమైంది.
T20 World Cup 2026: పాకిస్తాన్ సెమీస్ ఆశలు సజీవం.. కానీ, ఇలా గెలిస్తేనే..!
Also Read
- 10,000mAh బ్యాటరీ, IP68/IP69-రేటెడ్ ప్రొటెక్షన్ తో రాబోతున్న Redmi Turbo 6 Max..!
- Gen Z Side Hustles: జీతం ఒక్కటే సరిపోవడం లేదు.. అదనపు సంపాదన కోసం జెన్జీ కొత్త దారులు
- CM Vijay: 600 కోట్లు చూపించి 30 కోట్లు దాచారా? సీఎం విజయ్ పిటిషన్పై హైకోర్టు కీలక వ్యాఖ్యలు.!
- Amazon Layoffs in India: పండుగకు ముందు అమెజాన్ షాక్.. భారత్‌లో భారీగా ఉద్యోగాల కోత
మే 31న ఫైనల్ తేదీ యథాతథంగా ఉండగా.. మొత్తం షెడ్యూల్‌ను అధికారికంగా ఆమోదించేందుకు ఐపీఎల్ గవర్నింగ్ కౌన్సిల్ వచ్చే వారం సమావేశమయ్యే అవకాశం ఉంది. పూర్తి షెడ్యూల్ విడుదల ఆలస్యానికి ప్రధాన కారణం నాలుగు రాష్ట్రాల్లో జరగనున్న అసెంబ్లీ ఎన్నికలే అన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. ముఖ్యంగా తమిళనాడు, పశ్చిమ బెంగాల్, అస్సాం, కేరళలో ఎన్నికల తేదీలు ఇంకా ప్రకటించకపోవడంతో భద్రతా ఏర్పాట్లు, వేదికల లభ్యత వంటి అంశాలను దృష్టిలో ఉంచుకుని బోర్డు జాగ్రత్తగా ముందుకు సాగుతోంది.
చెన్నై, కోల్‌కతా, గువహతి వంటి వేదికల్లో మ్యాచ్‌లు నిర్వహించాల్సి ఉండటంతో ఎన్నికల కమిషన్ ప్రకటన కోసం వేచి చూస్తున్నట్లు సమాచారం. ఇదిలా ఉండగా, ఫ్రాంచైజీలు తమ ప్రిపరేషన్ ప్లాన్ల కోసం కనీసం ప్రారంభ దశ మ్యాచ్‌ల షెడ్యూల్ విడుదల చేయాలని బోర్డుపై ఒత్తిడి తెస్తున్నాయని తెలుస్తోంది. దీనితో మొదటి విడత షెడ్యూల్ త్వరలో ప్రకటించి, మిగిలిన భాగాన్ని ఎన్నికల షెడ్యూల్ తర్వాత విడుదల చేసే అవకాశముంది.
T20 World Cup 2026: సెమీస్ బెర్త్ కన్ఫర్మ్ చేసుకున్న ఇంగ్లాండ్.. కివీస్ పై భారీ విజయం..!
అయితే ప్రారంభ మ్యాచ్ వేదికపై కూడా సందిగ్ధత నెలకొంది. సాంప్రదాయంగా డిఫెండింగ్ ఛాంపియన్ జట్టు తమ సొంత మైదానంలో తొలి మ్యాచ్ ఆడుతుండగా, గత సీజన్ విజేత రాయల్ ఛాలెంజెర్స్ బెంగళూరు హోమ్ గ్రౌండ్ అయిన చిన్నస్వామి స్టేడియంలో ఇటీవల జరిగిన దుర్ఘటనల నేపథ్యంలో క్రికెట్ కార్యకలాపాలు నిలిపివేయబడిన పరిస్థితి ఏర్పడింది. దీంతో ఐపీఎల్ 2026 ప్రారంభ మ్యాచ్ ఎక్కడ జరుగుతుందన్న ప్రశ్నకు సమాధానం గవర్నింగ్ కౌన్సిల్ నిర్ణయంపై ఆధారపడి ఉంది. మొత్తంగా ఎన్నికల సమీకరణాలు, భద్రతా అంశాల ప్రభావంతో ఈ సీజన్ షెడ్యూల్ పై ఉత్కంఠ కొనసాగుతోంది.
తాజావార్తలు
-
10,000mAh బ్యాటరీ, IP68/IP69-రేటెడ్ ప్రొటెక్షన్ తో రాబోతున్న Redmi Turbo 6 Max..!
-
Gen Z Side Hustles: జీతం ఒక్కటే సరిపోవడం లేదు.. అదనపు సంపాదన కోసం జెన్జీ కొత్త దారులు
-
Indian 3 : ఇండియన్ 3.. సేనాపతి తిరిగివస్తున్నాడు..
-
CM Vijay: 600 కోట్లు చూపించి 30 కోట్లు దాచారా? సీఎం విజయ్ పిటిషన్పై హైకోర్టు కీలక వ్యాఖ్యలు.!
-
Ramayana : ‘రామాయణ’ ప్రొడ్యూసర్ నమిత్ మల్హోత్రా ఆఫీసులపై ఐటీ శాఖ సోదాలు
ట్రెండింగ్
-
Instagramలో కొత్త MUSE ఆప్షన్.. అసలేంటి ఇది.? ఎలా వాడాలంటే.!
-
Veg Omelette: గుడ్డు లేకుండానే గుమగుమలాడే “వెజ్ ఆమ్లెట్”.. ఒక్కసారి తింటే మళ్లీ మళ్లీ చేసుకుంటారు.!
-
Eggshell: గుడ్డు పెంకులను పడేస్తున్నారా? అయితే మీరు ఎగ్ కర్రీలో కాలేసినట్లే..! వీటిని ఇలా కూడా ఉపయోగించవచ్చని తెలుసా.?
-
350cc ఇంజిన్, 14.5 లీటర్ల ట్యాంక్, TFT డిస్ప్లేతో Triumph Bonneville T40 లాంచ్.. ధర ఎంతంటే?
-
Royal Enfield Classic 350 ధర పెంపు.. కొత్త ధరలు ఇవే!