Meenakshi Chaudhary : బాలీవుడ్ బిగ్ ప్రాజెక్ట్‌లో మీనాక్షి చౌదరి.!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
టాలీవుడ్‌లో అనతి కాలంలోనే స్టార్ హీరోయిన్ గా ఎదిగిన వారిలో మీనాక్షి చౌదరి ఒకరు. ఈ ఏడాది సంక్రాంతికి ‘అనగనగా ఒక రాజు’ చిత్రంతో మంచి విజయాన్ని అందుకున్న ఈ బ్యూటీ, ఇప్పుడు నేరుగా బాలీవుడ్ కిలాడీ అక్షయ్ కుమార్ ప్రాజెక్ట్‌లో చోటు సంపాదించుకుంది. 2006లో సంచలన విజయం సాధించిన కామెడీ థ్రిల్లర్ ‘భాగమ్ భాగ్’ (Bhagam Bhag) సీక్వెల్‌లో మీనాక్షి కథానాయికగా నటించబోతుండటం ఇప్పుడు సినీ వర్గాల్లో హాట్ టాపిక్‌గా మారింది.
Also Read : Hot Spot 2 : ‘హాట్ స్పాట్ 2 మచ్’.. వినోదానికి రెట్టింపు డోస్ అందించే కొత్త చిత్రం
Also Read
ప్రియదర్శన్ దర్శకత్వంలో వచ్చిన ‘భాగమ్ భాగ్’ అప్పట్లో ఒక ట్రెండ్ సెట్టర్. ఇప్పుడు ఈ చిత్రానికి సీక్వెల్‌ను ప్లాన్ చేస్తున్నారు. అయితే ఈసారి దర్శకత్వ బాధ్యతలను రాజ్ శాండిల్యకు అప్పగించినట్లు తెలుస్తోంది. అక్షయ్ కుమార్ హీరోగా నటిస్తున్న ఈ కామెడీ ఎంటర్‌టైనర్‌లో మీనాక్షి చౌదరితో పాటు, ‘ధురంధర్’ సినిమాలో స్పెషల్ సాంగ్‌తో ఆకట్టుకున్న ఆయేషా ఖాన్ కూడా మరో హీరోయిన్‌గా నటించనుందట. కాగా మీనాక్షి ప్రస్తుతం తెలుగులో నాగచైతన్య సరసన ‘వృషకర్మ’ చిత్రంలో నటిస్తూ బిజీగా ఉంది. అటు సౌత్‌లో టాప్ హీరోలతో నటిస్తూనే, ఇటు బాలీవుడ్‌లో అక్షయ్ కుమార్ వంటి స్టార్ హీరో సినిమాతో ఎంట్రీ ఇవ్వడం మీనాక్షికి పెద్ద ప్లస్ కానుంది. ఈ సినిమా షూటింగ్ త్వరలోనే ప్రారంభం కానుందని సమాచారం. కామెడీ టైమింగ్‌కు కేరాఫ్ అడ్రస్‌గా నిలిచే ఈ సీక్వెల్‌లో మీనాక్షి ఎలాంటి పాత్రలో కనిపిస్తుందోనని అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.
తాజావార్తలు
-
AP Cabinet: రేపు ఏపీ కేబినెట్ అత్యవసర సమావేశం.. వాటిపైనే కీలక చర్చ..
-
Supreme Court: ‘‘రవాణాను పూర్తిగా నిలిపివేయలేరు’’.. ఢిల్లీ ఆంక్షలపై సుప్రీంకోర్టు
-
Amit Shah: రాహుల్ గాంధీ అబద్ధాల మధ్య బీజేపీ వరస విజయాలు..
-
Delhi Traffic: ఢిల్లీ ట్రాఫిక్‌పై ఆంక్షలు.. 30 ప్రాంతాల్లో వాహనాల రాకపోకలకు అంతరాయం..
-
Netanyahu: ఆమె యూదు వ్యతిరేకి.. నవీ పిళ్లైకు నోబెల్ బహుమతి ఇవ్వడంపై నెతన్యాహు తీవ్ర వ్యాఖ్యలు
ట్రెండింగ్
-
Pitod Ki Sabzi: ఇంట్లో కూరగాయలు లేవా? శనగపిండితో సింపుల్‌గా రాజస్థానీ స్టైల్లో ఈ రుచికరమైన పితోడ్ కూర చేసేయండి!
-
Bathroom Design Tips: బాత్రూమ్ ఎంత శుభ్రం చేసినా మళ్లీ తడిగానే ఉంటోందా? కారణం మీ క్లీనింగ్ కాదు.. ఈ సమస్య కావచ్చు!
-
AI Dance Video: “ప్రాంప్ట్ ఇదిగో”.. ఇద్దరు డ్యాన్స్.. కారులో నుంచి మూడో వ్యక్తి ఎంట్రీ! ఈ వైరల్ ఏఐ వీడియోను మీరే ఈజీగా చేసుకోండి..!
-
10,000mAh బ్యాటరీ, IP68/IP69-రేటెడ్ ప్రొటెక్షన్ తో రాబోతున్న Redmi Turbo 6 Max..!
-
Gen Z Side Hustles: జీతం ఒక్కటే సరిపోవడం లేదు.. అదనపు సంపాదన కోసం జెన్‌జీ కొత్త దారులు