Vijay’s Wife Sangeetha: విజయ్ భార్య సంగీత గురించి ఇంట్రెస్టింగ్ విషయాలు..
- విజయ్‌కు భార్య సంగీత విడాకులు..
- చెంగల్పట్టు కోర్టులో డైవర్స్ పిటిషన్..
- తమిళనాడులో సంచలనంగా స్టార్ హీరో వ్యవహారం..
- సంగీత స్వర్ణలింగం ఎవరు..? విజయ్‌తో ఎలా పరిచయం..?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Vijay’s Wife Sangeetha: తమిళ స్టార్ దళపతి విజయ్ భార్య సంగీత స్వర్ణలింగం విడాకుల కోసం పిటిషన్ దాఖలు చేశారు. విజయ్‌తో విడిపోవాలని భావిస్తున్నట్లు, విజయ్‌కి వేరే సినీ నటితో ఎఫైర్ ఉందని డైవర్స్ పిటిషన్లో పేర్కొనడం సంచలనంగా మారింది. చెంగల్పట్టు కోర్టులో ఈ మేరకు ఆమె డైవర్స్ కోసం అఫ్లై చేశారు. ఏప్రిల్ 20న విజయ్ తమ ముందు హాజరుకావాలని కోర్టు ఆదేశించింది. ఈ అంశం తమిళనాడుతో పాటు దేశవ్యాప్తంగా సంచలనంగా మారింది. తమిళనాడు అసెంబ్లీ ఎన్నికలు దగ్గర పడుతున్న సమయంలో ఈ విషయం చర్చనీయాంశంగా మారింది. ఓ వైపు టీవీకే పార్టీని పెట్టి, రాష్ట్రంలో అధికారంలోకి రావాలని విజయ్ భావిస్తు్న్న తరుణంలో భార్య నుంచి షాక్ తగిలింది.
సంగీత ఎవరు.?
Also Read
- Keerthy Suresh: విమానంలో కీర్తి సురేశ్‌తో తాగుబోతు రచ్చ!
- Om Movie: ఎర్రచందనం స్మగ్లింగ్ సినిమా కాదు.. ధనుష్ ‘ఓం’ స్టోరీ పాయింట్ చెప్పిన డైరెక్టర్!
- Ramayana: సరిహద్దులు దాటిన రాముడి క్రేజ్.. కరాచీ టెంపుల్లో ‘రామాయణ’ సంబరాలు!
- Radhika Apte: బోల్డ్ సీన్ల వివాదం.. సినీ ఇండస్ట్రీ చీకటి కోణాన్ని బయటపెట్టిన హీరోయిన్!
సంగీత, విజయ్‌లకు 1999లో వివాహం జరిగింది. వీరిద్దరికి ఒక కుమారుడు జాసన్ సంజయ్, కుమార్తె దివ్య షాషా ఉన్నారు. 26 ఏళ్ల వైవాహిక జీవితానికి సంగీత ముగింపు పలకాలని భావించారు. తన భర్త విజయ్ స్టార్ హీరో అయినప్పటికీ, సంగీత మాత్రం లో ప్రొఫైల్ కొనసాగించారు. ఎక్కువగా బహిరంగం కార్యక్రమాల్లు, మీడియాలో కనిపించలేదు. సంగీత యూకేలో పుట్టి పెరిగారు. ప్రస్తుతం ఆమె అక్కడే ఉన్నారు. ఆమె కుటుంబం శ్రీలంక తమిళ మూలాలని చెందినది. సంగీత తండ్రి యూకేలో తమిళ పారిశ్రామికవేత్త.
విజయ్‌తో తొలి పరిచయం:
పూవే ఉనక్కగా(1996) సినిమా సూపర్ హిట్ తర్వాత విజయ్‌కు తమిళనాడులో స్టార్ స్టేటస్ పెరిగింది. ఆ సమయంలో లండన్‌లో ఉన్న సంగీత, తన అభిమాన నటుడు విజయ్ను కలవడానికి చెన్నై వచ్చారు. ఈ సినిమా సక్సెస్‌పై సంగీత విజయ్ను అభినందించడానికి వెళ్లారు. ఆమె అభిమానం, ముక్కసూటి ప్రవర్తన నచ్చిన విజయ్ ఆమెను తన ఇంటికి ఆహ్వానించి తన తల్లిదండ్రులకు పరిచయం చేశారని పలు నివేదికలు చెబుతున్నాయి.
ఆ తర్వాత రెండు కుటుంబాల మధ్య సన్నిహిత సంబంధాలు పెరిగాయి. క్రమం తప్పకుండా విజయ్, సంగీతలు కలుసుకోవడం ప్రారంభించారు. ఇద్దరి మధ్య ప్రేమ చిగురించడంతో, ఇరు కుటుంబాల సమ్మతితో వివాహం చేసుకున్నారు. సంగీత హిందూ కుటుంబానికి, విజయ్ క్రైస్తవ కుటుంబానికి చెందిన వారైనప్పటికీ, వీరిద్దరి పెళ్లి హిందూ సంప్రదాయంలోనే జరిగింది. పెళ్లి తర్వాత చెన్నైలో గ్రాండ్‌గా రిసెప్షన్ నిర్వహించారు.
కుటుంబానికే ప్రాధాన్యత:
తమిళనాడుతో విపరీతమైన క్రేజ్, ఫ్యాన్ ఫాలోయింగ్ ఉన్నప్పటికీ సంగీత తక్కువగా బహిరంగ కార్యక్రమాల్లో కనిపించేవారు. పెద్దగా మీడియా ముందుకు వచ్చేవారు కాదు. ఎక్కువగా కుటుంబానికి, పిల్లలకే ప్రాధాన్యత ఇచ్చారు. జాసన్, దివ్యలను ఈ వెండితెర వెలుగులకు దూరంగా పెంచారు. అప్పడప్పుడు మాత్రమే సంగీత బహిరంగంగా కనిపించేవారు. ఇప్పుడు విజయ్, సంగీతలు విడిపోవాలని నిర్ణయించుకోవడం ఆయన ఫ్యాన్స్ జీర్ణించుకోలేకపోతున్నారు.
తాజావార్తలు
-
Operation Firewall 2026: పాక్ ఏజెంట్లకు సహకారం.. బీహార్‌లో ఇద్దరిని అరెస్ట్ చేసిన ఏపీ కౌంటర్ ఇంటెలిజెన్స్ విభాగం
-
School Holidays: అర్నబ్ తుఫాన్ ప్రభావం.. సెలవులు పొడిగించిన విద్యాశాఖ!
-
Bharat Mobility Expo 2027: కార్ల ప్రియులకు పండుగే.. భారత్ మొబిలిటీ ఎక్స్పో 2027 తేదీలు ఖరారు..!
-
AFG vs ZIM: 5 పరుగులకే 4 వికెట్లు.. ఆ తర్వాత ఒమర్జాయ్ సిక్సర్ల సునామీ.. కట్ చేస్తే ప్రపంచ రికార్డ్ సొంతం.!
-
Cyclone Arnab: నేడు పశ్చిమగోదావరి జిల్లాలో సీఎం చంద్రబాబు పర్యటన.. రైతులు, తుఫాన్ బాధితులతో ముఖాముఖి!
ట్రెండింగ్
-
మరో లగ్జరీ ప్రీమియం ఫోల్డబుల్.. 200MP కెమెరా, శాటిలైట్ కాలింగ్‌తో Samsung W27 లాంచ్..!
-
IP66, IP68, IP69, IP69K రేటింగ్స్, 185Hz డిస్ప్లే, 9000mAh బ్యాటరీతో OnePlus Ace 7 లాంచ్..!
-
200MP కెమెరా, 9000mAh బ్యాటరీ, 1.5K LTPO AMOLED ఫ్లాట్ డిస్ప్లేతో OnePlus Ace 7 Pro లాంచ్..!
-
IND vs NZ: క్లీన్‌స్వీప్‌పై భారత్ కన్ను.. నేడే నాలుగో టీ20.. ప్లేయింగ్ XIలోకి ఇషాన్ కిషన్..!
-
World Savings Day : నెలాఖరుకు చేతిలో డబ్బు ఉండాలంటే ఇలా చేయండి!