T20 World Cup 2026: భారత్ సెమీస్ చేరితే.. ఎదుర్కోబోయే ప్రత్యర్థి ఎవరంటే?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
T20 World Cup 2026: టీ20 వరల్డ్ కప్ 2026 ఇప్పుడు ఉత్కంఠభరితమైన స్థాయికి చేరుకుంది. సూపర్ 8 స్టేజ్‌లో గ్రూప్-1 నుండి దక్షిణాఫ్రికా ఇప్పటికే సెమీ-ఫైనల్ బెర్త్‌ను ఖరారు చేసుకుంది. మెరుగైన నెట్ రన్ రేట్‌తో పాయింట్ల పట్టికలో అగ్రస్థానంలో నిలిచిన దక్షిణాఫ్రికా జట్టు సెమీస్‌కు దూసుకెళ్లింది. ఇక ఈ గ్రూప్ నుండి రెండో సెమీఫైనలిస్ట్ ఎవరనేది మార్చి 1న కోల్‌కతా లోని ఈడెన్ గార్డెన్స్ వేదికగా భారత్, వెస్టిండీస్ మధ్య జరిగే పోరుతో తేలిపోనుంది.
T20 World Cup 2026: పాకిస్తాన్ సెమీస్ ఆశలు సజీవం.. కానీ, ఇలా గెలిస్తేనే..!
Also Read
- AUS W vs PAK W: పెర్రీ సూపర్ షో.. పాకిస్థాన్‌పై 113 పరుగుల భారీ విజయంతో సెమీఫైనల్ లోకి ఆసీస్.!
- Harmanpreet Kaur: వారి వల్లే మ్యాచ్ ఓడిపోయాం.. టీమిండియా కెప్టెన్ ఫైర్.!
- Women’s T20 World Cup 2026: 'మారిజాన్ కాప్' దూకుడు.. టీమిండియాకు ప్రపంచకప్ లో తొలి ఓటమి.!
- Women's T20 World Cup 2026 : పాకిస్తాన్‌ను చిత్తు చేసిన భారత్.. దీప్తి శర్మ ఐదు వికెట్ల సునామీ.!
భారత్, వెస్టిండీస్ జట్లకు సెమీస్ అవకాశాలను నిర్ణయించే ‘డూ ఆర్ డై’ మ్యాచ్ ఇది. ప్రస్తుతం టీమ్ ఇండియా ఆడిన 2 మ్యాచ్‌ల్లో ఒక మ్యాచ్ లో ఒడి, మరో మ్యాచ్ లో గెలిచి 2 పాయింట్లతో ఉంది. అటు వెస్టిండీస్ కూడా సమానమైన పాయింట్లతో సెమిస్ పోటీలో ఉంది. భారత్ ఈ మ్యాచ్‌లో వెస్టిండీస్‌ను ఓడిస్తే.. 4 పాయింట్లతో గ్రూప్‌లో రెండో స్థానంలో నిలిచి సెమీఫైనల్ టికెట్ ఖరారు చేసుకుంటుంది. ఒకవేళ భారత్ ఓడిపోతే.. టోర్నీ నుండి నిష్క్రమించాల్సి ఉంటుంది. అందుకే ఈ మ్యాచ్ ఒక క్వార్టర్ ఫైనల్‌ను తలపిస్తోంది.
ఒకవేళ భారత్ వెస్టిండీస్‌పై గెలిచి సెమీస్‌కు అర్హత సాధిస్తే.. తదుపరి ప్రత్యర్థి ఎవరు అనే ఆసక్తి ఇప్పుడు అందరిలోనూ నెలకొంది. ఐసీసీ నిబంధనల ప్రకారం గ్రూప్-1లో రెండో స్థానంలో నిలిచే జట్టు, గ్రూప్-2లో అగ్రస్థానంలో ఉన్న జట్టుతో తలపడాలి. ప్రస్తుతం గ్రూప్-2లో ఇంగ్లాండ్ వరుసగా 3 విజయాలతో అజేయంగా నిలిచి టేబుల్ టాప్‌లో ఉంది. కాబట్టి, భారత్ గ్రూప్-1 నుండి రెండో జట్టుగా క్వాలిఫై అయితే.. సెమీఫైనల్‌లో ఇంగ్లాండ్‌తో తలపడటం ఖాయం.
IPL 2026: ఐపీఎల్ వాయిదా.. ప్రారంభ మ్యాచ్ అప్పుడే..!
ఈ హై-వోల్టేజ్ సెమీ-ఫైనల్ మ్యాచ్ మార్చి 5న ముంబైలోని వాంఖడే స్టేడియంలో జరగనుంది. ప్రస్తుతం ఫామ్ లో ఉన్న ఇంగ్లాండ్ జట్టును ఎదుర్కోవడం భారత్ కు సవాలుతో కూడుకున్న పని. ఇదివరకు 2022 టీ20 వరల్డ్ కప్ సెమీఫైనల్ లో కూడా భారత్-ఇంగ్లాండ్ జట్లే తలపడ్డాయి. ఆ సమయంలో ఇంగ్లాండ్ ఘనవిజయం సాధించి భారత్‌ను టోర్నీ నుండి బయటకు పంపింది. ఈసారి భారత్ సెమీస్‌లో ఇంగ్లాండ్‌ను ఢీకొని గెలిస్తే.. ఆనాటి పరాజయానికి ప్రతీకారం తీర్చుకునే గొప్ప అవకాశం లభిస్తుంది.
తాజావార్తలు
-
Team India: టీమిండియాకు బిగ్ షాక్.. శుభమన్ గిల్, జస్ప్రీత్ బుమ్రా దూరం.. కారణం ఇదే..
-
SIR: వీవీఐపీలకు SIR షాక్.. జైశంకర్, ఆర్మీ చీఫ్, CBI డైరెక్టర్ పేర్లు..
-
Kayadu Lohar: కయాదు వెనుక ఇంత కన్నీటి కథ ఉందా? ‘ప్యారడైజ్’ బ్యూటీ జర్నీ చూస్తే ఫిదా అవ్వాల్సిందే!
-
Sahil Chauhan: 27 బంతుల్లో సెంచరీ.. టీ20 క్రికెట్లో ప్రపంచ రికార్డు.. అతడికి ఇండియాతో సంబంధం ఏంటి..?
-
Ravi Teja: హిట్టు పడగానే రేటు పెంచేసిన మాస్ రాజా.. నిర్మాత డ్రాప్.. సంక్రాంతి సినిమా క్యాన్సల్ ?
ట్రెండింగ్
-
Asian Games 2026: బంగ్లాదేశ్‌పై భారత్ ఘన విజయం.. బంగారు పతకం కొసం ఫైనల్లో శ్రీలంకతో అమితుమీ.!
-
200MP + 200MP కెమెరాలు, 8,500mAh బ్యాటరీతో వచ్చేస్తున్న Xiaomi 18 Pro సిరీస్..!
-
Shafali Verma: ఆకాశమే హద్దుగా సిక్సర్ల సునామీ.. షఫాలీ వర్మ అద్భుత సెంచరీ..! బంగ్లాకు భారీ టార్గెట్!
-
Karivepaku Kaaram Podi: ముద్దగ కాకుండా.. పొడిపొడిగా, పర్ఫెక్ట్గా “కరివేపాకు కారప్పొడి” కావాలా.? ఇంకెందుకు ఆలస్యం ఇలా ఫాలో అవ్వండంతే..!
-
11,000mAh బ్యాటరీ, IP68+IP69+IP69K రేటింగ్స్, 108MP కెమెరాతో వచ్చేస్తున్న Honor X9e ప్రో..!