Hot Spot 2 : ‘హాట్ స్పాట్ 2 మచ్’.. వినోదానికి రెట్టింపు డోస్ అందించే కొత్త చిత్రం
- Follow Us :
-
-
Add as a preferred
source on google
2024లో విడుదలైన ‘హాట్ స్పాట్’ చిత్రం తన విభిన్నమైన కథాంశంతో, సామాజిక అంశాలపై సంధించిన ప్రశ్నలతో ‘ఆహా’ (Aha) ఓటిటీలో భారీ రెస్పాన్స్ అందుకున్న సంగతి తెలిసిందే. అదే ఊపుతో ఇప్పుడు దర్శకుడు విఘ్నేష్ కార్తిక్ ఈ సిరీస్‌కు సీక్వెల్‌ను సిద్ధం చేశారు. ‘హాట్ స్పాట్ 2 మచ్’ పేరుతో తెరకెక్కిన ఈ చిత్రం ఫిబ్రవరి 27 నేరుగా డిజిటల్ ప్లాట్‌ఫామ్‌లో విడుదలయ్యింది. సమకాలీన సమాజంలోని సున్నితమైన అంశాలను వినోదభరితంగా చూపిస్తూనే, ఆలోచింపజేసే ప్రయత్నం చేశామని చిత్ర యూనిట్ చెబుతోంది.
ఈ సీక్వెల్‌లో ఒక భారీ స్టార్ కాస్ట్ అలరించబోతోంది. ప్రముఖ నటి ప్రియా భవాని శంకర్, సీనియర్ నటులు ఎం.ఎస్. భాస్కర్, తంబి రామయ్యలతో పాటు యువ నటులు అశ్విన్ కుమార్, ఆదిత్య భాస్కర్ కీలక పాత్రల్లో నటించారు. మోజ్విత్-మోవిహాన్ సమర్పణలో అనిల్ రెడ్డి ఎం, ముని చంద్రారెడ్డి ఎన్, ఇందుకుమార్ ఎం సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మించారు. మొదటి భాగంలో నాలుగు భిన్నమైన కథలను ఒకదానితో ఒకటి ముడిపెడుతూ చూపించిన విధానం ప్రేక్షకులను ఆకట్టుకుంది. ఇప్పుడు రెండో భాగంలో అంతకు మించిన డోస్ ఉంటుందని ‘2 మచ్’ అనే టైటిల్‌తోనే హింట్ ఇచ్చారు. వివాదాస్పదంగా అనిపించినా, వాస్తవాలకు దగ్గరగా ఉండే కథలను ఎంచుకోవడంలో విఘ్నేష్ కార్తిక్ సిద్ధహస్తుడు. మరి ఈ సీక్వెల్ కూడా మొదటి భాగం లాగే ‘ఆహా’లో రికార్డ్ వ్యూస్ సాధిస్తుందో లేదో చూడాలి.
Also Read
- Minister Kollu Ravindra: అర్ధరాత్రి మచిలీపట్నం ఫిషింగ్ హార్బర్‌ను సందర్శించిన మంత్రి.. అధికారుల తీరుపై అసహనం
- Amazon Sale Price History: సేల్‌లో భారీ ఆఫర్‌లు చూసి మోసపోకండి.. ఒక్క క్లిక్‌తో ధరల చరిత్ర తెలుసుకోండి..!
- Vastu Tips: దీపం, ఉప్పు, పాలు చేతిలో నుంచి జారి కింద పడితే అశుభమా? వాస్తు శాస్త్రం ఏం చెబుతోంది?
- Nana Patekar: షాకింగ్.. నానా పటేకర్ మృతిపై అనుమానాలు? అసహజ మరణం కింద కేసు నమోదు!!
తాజావార్తలు
-
Prabhas – Fauzi: ‘ఫౌజీ’కి మరో 25 రోజులే.. గెట్ రెడీ!
-
Minister Kollu Ravindra: అర్ధరాత్రి మచిలీపట్నం ఫిషింగ్ హార్బర్‌ను సందర్శించిన మంత్రి.. అధికారుల తీరుపై అసహనం
-
Sukma Blast: ఛత్తీస్‌గఢ్‌లో పేలుడు.. నలుగురు CRPF జవాన్లకు గాయాలు, ఇద్దరి పరిస్థితి విషమం
-
Taliban: బాలికలు, మహిళలు, ట్రాన్స్జెండర్లే టార్గెట్.. తాలిబాన్ వికృతపాలనపై ICC ఫైర్!
-
Rashmika Mandanna: ‘రణబాలి’ ట్రైలర్ లాంచ్‌కు రష్మిక డుమ్మా.. అసలు కారణం ఇదే!
ట్రెండింగ్
-
Bathroom Design Tips: బాత్రూమ్ ఎంత శుభ్రం చేసినా మళ్లీ తడిగానే ఉంటోందా? కారణం మీ క్లీనింగ్ కాదు.. ఈ సమస్య కావచ్చు!
-
AI Dance Video: “ప్రాంప్ట్ ఇదిగో”.. ఇద్దరు డ్యాన్స్.. కారులో నుంచి మూడో వ్యక్తి ఎంట్రీ! ఈ వైరల్ ఏఐ వీడియోను మీరే ఈజీగా చేసుకోండి..!
-
10,000mAh బ్యాటరీ, IP68/IP69-రేటెడ్ ప్రొటెక్షన్ తో రాబోతున్న Redmi Turbo 6 Max..!
-
Gen Z Side Hustles: జీతం ఒక్కటే సరిపోవడం లేదు.. అదనపు సంపాదన కోసం జెన్‌జీ కొత్త దారులు
-
CM Vijay: 600 కోట్లు చూపించి 30 కోట్లు దాచారా? సీఎం విజయ్ పిటిషన్‌పై హైకోర్టు కీలక వ్యాఖ్యలు.!