Ayesha Meera: శ్మశాన వాటికలో ఆయేషా మీరా అవశేషాల ఖననం.!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Ayesha Meera: 2007లో సంచలనం సృష్టించిన ఆయేషా మీరా హత్య కేసు ఇంకా స్పష్టతకు రాకపోవడంతో.. తాజాగా ఆమె శరీర అవశేషాలను కుటుంబ సభ్యులకు అప్పగించారు. కోర్టు ఆదేశాల మేరకు సీబీఐ కేసును క్లోజ్ చేసిన అనంతరం అవశేషాలను తల్లిదండ్రులకు అందజేశారు. అనంతరం సొంతూరు తెనాలిలోని ముస్లిం శ్మశాన వాటికలో అవశేషాలను ఖననం చేశారు. విజయవాడ కోర్టు ప్రాంగణంలో తల్లిదండ్రులు షంషాద్ బేగం, ఇక్బాల్‌లకు అవశేషాలు అప్పగించగా.. అక్కడి నుంచి తెనాలి తీసుకువచ్చి ఈద్గా వద్ద ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు. ముస్లిం మత పెద్దల సమక్షంలో ఖననం కార్యక్రమం జరిగింది. ఈ సందర్భంగా ప్రజా సంఘాల కార్యకర్తలు, స్థానికులు భారీగా హాజరై “జోహార్ ఆయేషా మీరా… వి వాంట్ జస్టిస్” అంటూ నినాదాలు చేశారు.
TVS Apache RTR 200 vs Bajaj Pulsar NS200: పవర్, స్టైల్, బడ్జెట్.. ఏది బెస్ట్?
Also Read
- CJP Protest: ఆప్‌లో కీలక నేత, ఇప్పుడు కాక్రోచ్లకు పెద్ద దిక్కు.. ఎవరీ అజింక్యా షిండే.?
- Sudha Murty: చీర కట్టుకుంటే ‘బెహన్జీ’ అంటారు.. జీవిత అనుభవాలు పంచుకున్న సుధా మూర్తి
- AP Cabinet Decisions: బీసీ రిజర్వేషన్లపై ఏపీ కేబినెట్ కీలక నిర్ణయం.. సర్పంచ్, ఎంపీటీసీ, జడ్పీటీసీ సీట్ల వివరాలు..
- Viral Post: ‘ఉద్యోగం బ్రతకడానికే.. జీవితం కాదు’ లేఆఫ్‌పై ఉద్యోగి పోస్ట్ వైరల్!
ఈ కేసు సీబీఐ దర్యాప్తులోకి వెళ్లిన తర్వాత 2019లో రీ-పోస్ట్‌మార్టం కోసం సమాధి నుంచి శరీర భాగాలు సేకరించారు. అయితే తాజాగా సీబీఐ దర్యాప్తు చేయాల్సిన అంశాలు ఇంకేమీ లేవని తేల్చి కేసును మూసివేసింది. దాంతో అవశేషాలను కుటుంబానికి అప్పగించాలని కోర్టు ఆదేశించింది. అవశేషాల ఖననం అనంతరం ఆయేషా మీరా తండ్రి ఇక్బాల్ తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. హత్య జరిగిన రోజు రాత్రి 11 గంటల నుంచి మరుసటి రోజు ఉదయం 4 గంటల వరకు ఏం జరిగిందో వెలుగులోకి రావాలని డిమాండ్ చేశారు. హైకోర్టు రిటైర్డ్ జడ్జి చేత జుడిషియల్ ఎంక్వైరీ జరిపించాలని కోరారు. అప్పటి దర్యాప్తు అధికారులు, సంబంధిత వ్యక్తులపై చర్యలు తీసుకోవాలని కూడా విజ్ఞప్తి చేశారు. అలాగే ప్రతి డిసెంబర్ 27ను ఆయేషా మీరా సంస్మరణ దినంగా ప్రకటించాలని, ఆమె పేరుతో ట్రస్ట్ ఏర్పాటు చేసి పేద బాలికల విద్యకు ఆర్థిక సహాయం అందించాలని ప్రభుత్వాన్ని కోరారు.
ViRosh: పెళ్లి తర్వాత తొలిసారి.. ఎయిర్‌పోర్టులో విజయ్ దేవరకొండ, రష్మిక జంట సందడి.!
18 సంవత్సరాలుగా న్యాయం కోసం పోరాడుతున్నప్పటికీ ఫలితం రాలేదని ముస్లిం మత పెద్దలు మండిపడ్డారు. పోలీస్ యంత్రాంగం ఎందుకు కళ్లుమూసుకుందని ప్రశ్నించారు. ఈ ఘటనలో బాధిత కుటుంబానికి న్యాయం జరగాలని మరోసారి విజ్ఞప్తి చేశారు. శ్మశాన వాటికలో జరిగిన ఖననం కార్యక్రమం భావోద్వేగభరిత వాతావరణంలో ముగిసింది. అయినప్పటికీ, ఆయేషా మీరా కేసులో పూర్తి స్థాయి నిజాలు వెలుగులోకి రావాలనే డిమాండ్ మాత్రం ఇంకా కొనసాగుతూనే ఉంది.
తాజావార్తలు
-
CJP Protest: ఆప్‌లో కీలక నేత, ఇప్పుడు కాక్రోచ్లకు పెద్ద దిక్కు.. ఎవరీ అజింక్యా షిండే.?
-
Sudha Murty: చీర కట్టుకుంటే ‘బెహన్జీ’ అంటారు.. జీవిత అనుభవాలు పంచుకున్న సుధా మూర్తి
-
AP Cabinet Decisions: బీసీ రిజర్వేషన్లపై ఏపీ కేబినెట్ కీలక నిర్ణయం.. సర్పంచ్, ఎంపీటీసీ, జడ్పీటీసీ సీట్ల వివరాలు..
-
Viral Post: ‘ఉద్యోగం బ్రతకడానికే.. జీవితం కాదు’ లేఆఫ్‌పై ఉద్యోగి పోస్ట్ వైరల్!
-
CJP Protest: మహిళా పోలీసుల చేత అభిజిత్ దీప్కే గ్యాంగ్ అరెస్ట్.. ఎందుకు..?
ట్రెండింగ్
-
Shai Hope: నా దగ్గర ఆ బ్యాట్స్ ఉన్నాయి.. అందుకే బంతి బౌండరీలు దాటుతోంది.. విండీస్ కెప్టెన్ ఆసక్తికర వ్యాఖ్యలు!
-
3D ఎఫెక్ట్‌తో మెకానికల్ లుక్.. లిక్విడ్ కూలింగ్ సిస్టమ్‌తో భారత్‌లోకి Infinix GT 50 Pro..!
-
కొత్త అల్లాయ్ వీల్స్, అప్డేటెడ్ లుక్ తో Toyota Fortuner 2026 Leader ఎడిషన్ లాంచ్.. ధర ఎంతంటే.?
-
IND vs WI: 249 పరుగులు చేసినా ఓటమి తప్పలేదు.. భారత్ కొంపముంచిన 5 కారణాలు ఇవే!
-
Hair Combs Cleaning: ₹1 ఖర్చుతో దువ్వెనలను ఇలా క్లీన్ చేయండి.. మీ జుట్టుకు చేరే మురికి, బ్యాక్టీరియా మాయం.!