Sircilla Crime News : వీడు మామూలోడు కాదు.. మహా మాయగాడు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
“నేను సీఎంఓ (ముఖ్యమంత్రి కార్యాలయం) నుంచి మాట్లాడుతున్నాను.. వెంటనే నా ఫోన్ పే నంబర్‌కు డబ్బులు పంపండి.. లేదంటే మీ ఉద్యోగాలు ఊడతాయి!” – ఇదీ ఒక ఘరానా మోసగాడు అధికారులను బెదిరించే తీరు. తెలంగాణలో పలువురు ప్రభుత్వ అధికారులను బురిడీ కొట్టించి, వారి నుంచి లక్షలాది రూపాయలు వసూలు చేసిన రాయబండి సూర్యప్రకాష్ అనే కేటుగాడిని రాజన్న సిరిసిల్ల జిల్లా పోలీసులు ఎట్టకేలకు అరెస్ట్ చేశారు.
రంగారెడ్డి జిల్లా హయత్ నగర్ మండలం కుంట్లూర్ గ్రామానికి చెందిన సూర్యప్రకాష్, గతంలో ఆఫీస్ బాయ్‌గా పనిచేసేవాడు. అయితే, గుర్రపు పందేలు, బెట్టింగ్‌లకు బానిసైన అతడికి వచ్చిన జీతం సరిపోలేదు. ఈజీ మనీ కోసం దొంగతనాలకు అలవాటు పడి జైలుకు కూడా వెళ్ళాడు. జైలు నుంచి బయటకు వచ్చాక తన రూటు మార్చి, ఏకంగా సీఎంఓ కార్యాలయ అధికారిగా అవతారమెత్తాడు. వార్తాపత్రికల ద్వారా అధికారుల ఫోన్ నంబర్లు సేకరించి, వారికి ఫోన్ చేసి బెదిరింపులకు పాల్పడేవాడు. అయితే ఇటీవల బోయినపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలోని మిడ్ మానేరు ప్రాజెక్టు డీఈఈ రఘుపతికి ఫోన్ చేసిన సూర్యప్రకాష్, తాను సీఎంఓ నుంచి మాట్లాడుతున్నానని చెప్పి డబ్బు డిమాండ్ చేశాడు. అనుమానం వచ్చిన రఘుపతి పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు పన్నిన వ్యూహంలో భాగంగా, రఘుపతి నుంచి నేరుగా డబ్బులు తీసుకోవడానికి కొదురుపాకకు రాగానే పోలీసులు అతడిని రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకున్నారు.
Also Read
- Off The Record: తెలంగాణ మహిళా శిశు సంక్షేమ శాఖలో కాంట్రాక్టర్స్ రాజ్యం..!
- Honda CB500 Launched in India: రాయల్ ఎన్ఫీల్డ్కు పోటీ..! హోండా CB500 విడుదల.. ధర, ఫీచర్లు ఇవే..
- iQOO Z11 Lite 5G: 6500mAh బ్యాటరీ, 44W ఫాస్ట్ ఛార్జింగ్, IP65 రేటింగ్.. iQOO నుంచి కొత్త ఫోన్ లాంచ్..
- AP Local Body Elections: స్థానిక ఎన్నికలకు మరో ముందడుగు..
కాగా పోలీసుల విచారణలో సూర్యప్రకాష్ ఒక గజదొంగ అని తేలింది. ఇతనిపై ఇప్పటికే సీసీఎస్ (CCS)లో రెండు కేసులు, సనత్ నగర్, సిద్దిపేట, జగిత్యాల పోలీస్ స్టేషన్లలో పలు కేసులు నమోదయ్యాయి. హయత్‌నగర్ పోలీస్ స్టేషన్‌లో ఇతనిపై రౌడీషీట్ కూడా ఉందని పోలీసులు గుర్తించారు. అధికారుల భయాన్ని ఆసరాగా చేసుకుని ఇలాంటి మోసాలకు పాల్పడుతున్న నేరగాళ్ల పట్ల అప్రమత్తంగా ఉండాలని పోలీసులు సూచిస్తున్నారు.
తాజావార్తలు
-
Off The Record: తెలంగాణ మహిళా శిశు సంక్షేమ శాఖలో కాంట్రాక్టర్స్ రాజ్యం..!
-
Honda CB500 Launched in India: రాయల్ ఎన్ఫీల్డ్కు పోటీ..! హోండా CB500 విడుదల.. ధర, ఫీచర్లు ఇవే..
-
iQOO Z11 Lite 5G: 6500mAh బ్యాటరీ, 44W ఫాస్ట్ ఛార్జింగ్, IP65 రేటింగ్.. iQOO నుంచి కొత్త ఫోన్ లాంచ్..
-
Off The Record : రేపల్లెలో వైసీపీ కోవర్ట్ పాలిటిక్స్? మోపిదేవి సస్పెన్షన్ వెనుక కథేంటి?
-
AP Local Body Elections: స్థానిక ఎన్నికలకు మరో ముందడుగు..
ట్రెండింగ్
-
మిలిటరీ గ్రేడ్ బాడీ, 120Hz డిస్‌ప్లే, 7,000mAh బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో OnePlus N6 Lite.. ధర ఎంతంటే?
-
Team India History: భారత్ @ 200.. టీ20ల్లో తొలి జట్టుగా భారత్ వరల్డ్ రికార్డ్!
-
1.5K 144Hz OLED డిస్‌ప్లే, 7200mAh బ్యాటరీతో అక్టోబర్ 6న రాబోతున్న VIVO V80..!
-
India Win Gold Medal: ఆసియా క్రీడలు 2026 మహిళా క్రికెట్ విజేతగా టీమిండియా..! స్వర్ణ పతకం కైవసం..
-
Asian Games 2026 Final: శ్రీలంక బౌలర్లపై స్మృతి మంధాన శివతాండవం.. లంక ముందు భారీ టార్గెట్.!