Kavitha : కేటీఆర్ పై కవిత ఫైర్.. పార్టీ ఓటమిని నా మెడకు చుడతారా..?
- క్లీన్ షీట్ తర్వాత కవిత కీలక వ్యాఖ్యలు
- పార్టీ ఓటమిని తనపై మోపొద్దన్న హెచ్చరిక
- టికెట్లు, నిరుద్యోగ సమస్యలే అసలు కారణాలన్న వ్యాఖ్య
- క్లిష్ట సమయంలో మద్దతు లభించలేదని ఆవేదన
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో కోర్టు నుంచి క్లీన్ షీట్ లభించిన తర్వాత బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత తన సోదరుడు కేటీఆర్‌పై సంచలన వ్యాఖ్యలు చేశారు. ఒకవైపు తనకు శుభాకాంక్షలు చెబుతూనే, మరోవైపు రాష్ట్రంలో బీఆర్ఎస్ ప్రభుత్వం పడిపోవడానికి ఈ కేసే కారణమని కేటీఆర్ ట్వీట్ చేయడంపై ఆమె తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. పార్టీ ఓటమిని తన మెడకు చుట్టాలని చూడటం సరికాదని హితవు పలికిన కవిత, అసలు తనపై ఈ కేసు పెట్టింది పార్టీ కోసం కాదా అని నిలదీశారు. నాటి క్లిష్ట పరిస్థితుల్లో తాను ఒంటరిగా పోరాటం చేస్తున్నప్పుడు పార్టీ సోషల్ మీడియా గానీ, కేటీఆర్ లేదా కేసీఆర్ గానీ కనీసం ఒక్క ప్రెస్ మీట్ కూడా పెట్టి తనకు మద్దతుగా ఎందుకు మాట్లాడలేదని ఆమె సూటిగా ప్రశ్నించారు.
Pakistan Afghanistan War: “సూసైడ్ స్వ్కాడ్” సిద్ధం చేసిన తాలిబాన్లు.. పాకిస్తాన్‌కు మూడినట్లే..
Also Read
- AP Local Body Elections: స్థానిక ఎన్నికలకు మరో ముందడుగు..
- Pawan Kalyan: స్థానిక సంస్థల ఎన్నికలు.. జనసేన నేతలకు పవన్ పిలుపు..
- Cyclone Impact: ఏపీపై వాయుగుండం ఎఫెక్ట్.. పలు రైళ్లు రద్దు, స్కూళ్లకు సెలవు..
- Heavy Rain Alert: ఏపీ వైపు దూసుకొస్తున్న వాయుగుండం.. టోల్‌ఫ్రీ నంబర్లు ఏర్పాటు.. అధికారులకు కీలక ఆదేశాలు..
బీఆర్ఎస్ ఓటమికి లిక్కర్ కేసు కారణమనే వాదనను తోసిపుచ్చిన కవిత, అసలు కారణాలను ఎండగట్టారు. నియోజకవర్గాల్లో ప్రజలు వ్యతిరేకిస్తున్నా సరే దోపిడీదారులైన అభ్యర్థులకే మళ్ళీ టికెట్లు ఇవ్వడం, నిరుద్యోగులకు ఉద్యోగాలు కల్పించలేకపోవడం , పార్టీ నేతల్లో పెరిగిపోయిన అహంకారమే ఓటమికి దారితీశాయని ఆమె కుండబద్దలు కొట్టారు. ఇప్పుడు వచ్చిన కోర్టు తీర్పును తమకు అనుకూలంగా మలుచుకుని తనను బలిపశువును చేయొద్దని కేటీఆర్‌కు స్పష్టం చేశారు. మొదటి నుండి తాను చెబుతున్నట్లే ఈ కుట్రపూరిత కేసులో తనకు ఎలాంటి సంబంధం లేదని కోర్టు తీర్పు ద్వారా నిరూపితమైందని, తాను కడిగిన ముత్యంలా బయటకు వచ్చానని ఆమె ధీమా వ్యక్తం చేశారు.
Botsa Satyanarayana: ఎమ్మెల్సీ బొత్స సత్యనారాయణకు బ్రెయిన్ స్ట్రోక్..
తాజావార్తలు
-
Off The Record: తెలంగాణ మహిళా శిశు సంక్షేమ శాఖలో కాంట్రాక్టర్స్ రాజ్యం..!
-
Honda CB500 Launched in India: రాయల్ ఎన్ఫీల్డ్కు పోటీ..! హోండా CB500 విడుదల.. ధర, ఫీచర్లు ఇవే..
-
iQOO Z11 Lite 5G: 6500mAh బ్యాటరీ, 44W ఫాస్ట్ ఛార్జింగ్, IP65 రేటింగ్.. iQOO నుంచి కొత్త ఫోన్ లాంచ్..
-
Off The Record : రేపల్లెలో వైసీపీ కోవర్ట్ పాలిటిక్స్? మోపిదేవి సస్పెన్షన్ వెనుక కథేంటి?
-
AP Local Body Elections: స్థానిక ఎన్నికలకు మరో ముందడుగు..
ట్రెండింగ్
-
మిలిటరీ గ్రేడ్ బాడీ, 120Hz డిస్‌ప్లే, 7,000mAh బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో OnePlus N6 Lite.. ధర ఎంతంటే?
-
Team India History: భారత్ @ 200.. టీ20ల్లో తొలి జట్టుగా భారత్ వరల్డ్ రికార్డ్!
-
1.5K 144Hz OLED డిస్‌ప్లే, 7200mAh బ్యాటరీతో అక్టోబర్ 6న రాబోతున్న VIVO V80..!
-
India Win Gold Medal: ఆసియా క్రీడలు 2026 మహిళా క్రికెట్ విజేతగా టీమిండియా..! స్వర్ణ పతకం కైవసం..
-
Asian Games 2026 Final: శ్రీలంక బౌలర్లపై స్మృతి మంధాన శివతాండవం.. లంక ముందు భారీ టార్గెట్.!