సీజన్‌తో సంబంధం లేకుండా తలెత్తే వ్యాధుల్లో కొలెస్టిరాల్ ఒకటి. వివిధ రకాల ఆహారపు అలవాట్లే ఇందుకు కారణం.

కొలెస్టిరాల్ చాలా ప్రమాదకరమైంది. ప్రాణాంతకమైన గుండెపోటుకు పెరగడానికి.. ఈ కొలెస్టిరాలే కారణం.

శరీరంలో కొలెస్టిరాల్ పెరిగితే.. అది రక్తనాళికల్లో పేరుకుపోతుంది. ఫలితంగా.. రక్తపోటు పెరగడం, గుండెపోటు రావడం జరుగుతుంది.

మరి.. దీని బారి నుంచి బయటపడాలంటే ఎలా? డైట్‌లో భాగంగా కొన్ని రకాల పండ్లను తీసుకుంటే చాలు.

ద్రాక్ష: ఇందులో ఉండే ఫైబర్, యాంటీ ఆక్సిడెంట్లు.. కొలెస్టిరాల్ తగ్గించడంలో దోహదపడతాయి.

పియర్‌: ఇందులోని పెక్టిన్ అనే ఫైబర్, ప్రొటీన్స్, యాంటీ ఆక్సిడెంట్లు.. కొలెస్టిరాల్‌ని అద్భుతంగా నియంత్రిస్తాయి.

యాపిల్‌: ఇందులోని పోలిఫెనాల్స్, యాంటీ ఆక్సిడెంట్లు, ఫైబర్.. కొలెస్టిరాల్‌ని తగ్గించి, గుండోని ఆరోగ్యంగా ఉంచుతాయి.

బొప్పాయి: ఇందులో ఫైబర్, యాంటీ ఆక్సిడెంట్లు, విటమిన్ సి వంటి పోషకాలు పుష్కలంగా ఉంటాయి. ఇది తింటే.. వేగంగా కొలెస్టిరాల్ తగ్గుతుంది.

ఆరెంజ్ & నిమ్మ: ఈ రెండింటిలో విటమిన్ సీ, యాంటీ ఆక్సిడెంట్లు పెద్ద మొత్తంలో ఉంటాయి. ఇవి కొలెస్టిరాల్‌ని తగ్గించి, గుండె ముప్పుని నివారిస్తాయి.