Subsidy: టీ కొట్టు, హోటల్ యజమానులకు శుభవార్త.. దానిపై రూ.2 తగ్గింపు..
- కీలక నిర్ణయం తీసుకున్న తమిళనాడు ప్రభుత్వం..
- విద్యుత్ యూనిట్‌పై రూ.2 రాయితీ ప్రకటన..
- మహిళలకు రూ.10 లక్షల రుణాలపై రూ.2 లక్షల రాయితీ..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఇరాన్, ఇజ్రాయెల్ మధ్య నెలకొన్న యుద్ధ వాతావరణం అంతర్జాతీయంగా ఇంధన సరఫరాపై ప్రభావం చూపుతోంది. ఈ పరిణామాల వల్ల గల్ఫ్ దేశాల నుంచి రావాల్సిన వంట గ్యాస్ (LPG) సరఫరాలో అంతరాయం ఏర్పడింది. దీనివల్ల తమిళనాడులో గ్యాస్ కొరత తీవ్రమై, హోటళ్లు, చిన్న వ్యాపారాల ఉనికి ప్రశ్నార్థకంగా మారింది. ఈ పరిస్థితుల్లో చిన్న వ్యాపారులను ఆదుకోవడానికి, ప్రజలకు ఇబ్బందులు కలగకుండా చూడటానికి ముఖ్యమంత్రి ఎం.కె.స్టాలిన్ ప్రభుత్వం పలు కీలక నిర్ణయాలు తీసుకుంది. గ్యాస్ సిలిండర్ల కొరత తీరే వరకు, విద్యుత్ స్టవ్‌లను ఉపయోగిస్తున్న హోటళ్లు, రెస్టారెంట్లు, టీ షాపులకు విద్యుత్ యూనిట్‌కు రూ. 2 చొప్పున ప్రభుత్వం సబ్సిడీ ఇవ్వనుంది. గ్యాస్ నుంచి ఎలక్ట్రిక్ స్టవ్‌లకు మారాలనుకునే చిన్న తరహా పరిశ్రమలు (MSME), చిన్న వ్యాపారులకు ప్రభుత్వం రుణ సౌకర్యం కల్పిస్తోంది. అంతేకాదు.. ఈ రుణాలపై 25 శాతం రాయితీని కూడా ప్రకటించింది.
Also Read:SSY Account: ‘సుకన్య సమృద్ధి యోజన’ ఖాతాదారులకు బిగ్ అలర్ట్.. మార్చి 31 చివరి తేదీ..
Also Read
- FIR Registered: బీజేపీ సీనియర్ మహిళా జాతీయ నాయకురాలిపై లైంగిక వేధింపులు.. అల్వాల్‌లో కేసు నమోదు..
- Andhra Pradesh: కొత్తగా 4 పోలీస్ కమిషనరేట్లు.. విలీన గ్రామాలపై రీనోటిఫికేషన్
- GST Council: అక్టోబర్ 7న జరగాల్సిన జీఎస్టీ సమావేశం వాయిదా.. మళ్లీ ఎప్పుడంటే..!
- Off The Record: ఇప్పుడు ఎమ్మెల్సీ.. తర్వాత అసెంబ్లీ? బీఆర్ఎస్-లెఫ్ట్ కెమిస్ట్రీ కుదిరేనా..?
మహిళా వ్యాపారవేత్తలను ప్రోత్సహించే ఉద్దేశంతో.. వారు తీసుకునే రూ. 10 లక్షల లోపు రుణాలపై రూ. 2 లక్షల వరకు సబ్సిడీని ప్రభుత్వం అందిస్తుంది. ప్రస్తుత గ్యాస్ కొరత దృష్ట్యా, కేంద్ర ప్రభుత్వం ఆసుపత్రులు , విద్యా సంస్థలకు మాత్రమే ప్రాధాన్యత ఇస్తూ సరఫరా చేస్తోంది. ఫలితంగా వాణిజ్య అవసరాలకు గ్యాస్ సిలిండర్లు దొరకడం కష్టంగా మారింది. హోటళ్లు మూతపడితే.. వాటిపై ఆధారపడిన రైతులు, కూరగాయల సరఫరాదారులు నష్టపోయే అవకాశం ఉంది. ఈ పరిస్థితిని నివారించడానికి.. హోటళ్లు నిరంతరాయంగా నడవాలని ప్రభుత్వం ఈ ప్రోత్సాహకాలను తీసుకువచ్చింది. హోటళ్లు మూతపడకుండా ఉండేలా చూడటంతో పాటు.. రైతులు తమ పంటలను ఎలాంటి ఆంక్షలు లేకుండా నేరుగా రైతు బజార్లలో అమ్ముకోవడానికి అనుమతినిచ్చారు. సామాన్యుల అవసరాలను తీర్చడానికి రేషన్ కార్డుదారులకు ఈ నెలలో అదనంగా కిరోసిన్‌ను సరఫరా చేయనున్నారు. గ్యాస్ సరఫరాలో అక్రమాలను అరికట్టడానికి, పంపిణీని సజావుగా నిర్వహించడానికి జిల్లా కలెక్టర్ల పర్యవేక్షణలో ప్రత్యేక కమిటీలను ప్రభుత్వం ఏర్పాటు చేసింది.
తాజావార్తలు
-
FIR Registered: బీజేపీ సీనియర్ మహిళా జాతీయ నాయకురాలిపై లైంగిక వేధింపులు.. అల్వాల్‌లో కేసు నమోదు..
-
Andhra Pradesh: కొత్తగా 4 పోలీస్ కమిషనరేట్లు.. విలీన గ్రామాలపై రీనోటిఫికేషన్
-
GST Council: అక్టోబర్ 7న జరగాల్సిన జీఎస్టీ సమావేశం వాయిదా.. మళ్లీ ఎప్పుడంటే..!
-
Off The Record : ఏలూరు నియోజకవర్గంలో జంపింగ్ జపాంగ్ కు కష్టాలు
-
Off The Record: కేతిరెడ్డికి ప్రాణహాని ఉందా? ట్రాప్ వెనుక ఎవరు?
ట్రెండింగ్
-
How to Make Murmura at Home: ప్రెజర్ కుక్కర్ ఉంటే చాలు.. ఇంట్లోనే కరకరలాడే బొరుగులు తయారు చేసుకోండి!
-
High-Protein Black Chana Soup: రాత్రిపూట తేలికైన, పౌష్టికమైన డిన్నర్.. నల్ల శనగల హై-ప్రోటీన్ సూప్ ట్రై చేయండి
-
Homemade Natural Lip Balm: ఖరీదైన లిప్ బామ్‌లకు చెక్.. ఇంట్లో ఉండే పదార్థాలతోనే సహజమైన లిప్ బామ్ రెడీ..!
-
How To Grow Mint Plant: ఒక్క పుదీనా కాడతో మొక్క పెంచేయొచ్చు.. ఈ సింపుల్ టిప్స్ పాటించండి
-
Chitti Punugulu: బయట కరకరలాడుతూ, లోపల దూదిలా ఉండే హోటల్ స్టైల్ “చిట్టి పునుగులు”.. ఇంట్లోనే పర్ఫెక్ట్ గా చేయండి ఇలా.!