Chandrababu: అల్లు ఇంటికి ఆంధ్రా సీఎం
- Follow Us :
-
-
Add as a preferred
source on google
లీవుడ్ ప్రముఖ నిర్మాత అల్లు అరవింద్ నివాసంలో సందడి నెలకొంది. ఇటీవల వివాహ బంధంలోకి అడుగుపెట్టిన అల్లు శిరీష్ – నయనికలను ఆశీర్వదించేందుకు ఆంధ్రప్రదేశ్ గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆయన నివాసానికి విచ్చేశారు. ముఖ్యమంత్రి రాకతో అల్లు వారి ఇల్లు రాజకీయ, సినీ ప్రముఖుల కలయికకు వేదికైంది. అల్లు అరవింద్ స్వయంగా ముఖ్యమంత్రికి సాదర స్వాగతం పలికారు. ఈ సందర్భంగా చంద్రబాబు నాయుడుని అల్లు అరవింద్ శాలువాతో సత్కరించి, గౌరవపూర్వక జ్ఞాపికను అందజేశారు. నవ దంపతులు అల్లు శిరీష్, నయనికలకు ముఖ్యమంత్రి తన హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేశారు. వారిద్దరూ నిండు నూరేళ్లూ సుఖసంతోషాలతో వర్ధిల్లాలని ఆయన ఆకాంక్షించారు.
Also Read:గ్లామర్ డోస్ పెంచిన విష్ణుప్రియా… ఫ్యాన్స్ మైండ్ బ్లోన్!
Also Read
సత్కార కార్యక్రమం అనంతరం, చంద్రబాబు నాయుడు గారు అల్లు కుటుంబ సభ్యులతో కలిసి కాసేపు సరదాగా గడిపారు. చాలా కాలం తర్వాత జరిగిన ఈ భేటీలో కుటుంబ విషయాలతో పాటు పలు ఆసక్తికర అంశాలపై వారు ముచ్చటించారు. ఇరు కుటుంబాల మధ్య ఉన్న పాత అనుబంధాన్ని ఈ సమావేశం మరోసారి గుర్తుచేసింది. ప్రస్తుతం ఈ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ముఖ్యమంత్రి స్థాయి వ్యక్తి స్వయంగా ఇంటికి వచ్చి నూతన వధూవరులను ఆశీర్వదించడం పట్ల మెగా మరియు అల్లు అభిమానులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.
తాజావార్తలు
-
Prahaar : సాలిడ్ సక్సెస్ కోసం యంగ్ హీరోపై చాలా నమ్మకం పెట్టుకున్న నిర్మాణ సంస్థ
-
Legendary Director Singeetham Srinivasa Rao : తెలుగు సినిమా ప్రమోగశాల మూతపడింది..
-
Rahul Gandhi: ‘‘రాహుల్ గాంధీ భయపడ్డారు’’.. అఖిలేష్ హామీతో రాయ్‌బరేలీలో పోటీ..
-
Oben Rorr EVO: 180KM రేంజ్.. 8 ఏళ్ల బ్యాటరీ వారంటీ.. దేశంలో అత్యధికంగా అమ్ముడవుతున్న ఎలక్ట్రిక్ బైక్ ఇదే..!
-
Shreyas Iyer: పాకిస్థాన్ బ్యాటర్లు భయపెట్టారు.. గోల్డ్ మెడల్ పోతుందనుకున్నా.. అతడే కాపాడాడు!
ట్రెండింగ్
-
National Boyfriend Day: మీ ప్రేమను మరింత స్పెషల్‌గా మార్చే సింపుల్ టిప్స్.!
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!
-
Rajasthani Dal Baati: నోట్లో వేస్తే కరిగిపోయే నెయ్యి బాటీలు, ఘాటైన దాల్ కాంబినేషన్ ఇలా చేయండి..!