Off The Record : ఏపీ క్యాబినెట్ లో భారీ మార్పులు..? 10 మంది మంత్రులకు చంద్రబాబు షాక్
- ఏపీ మంత్రుల ప్రోగ్రెస్ కార్డ్‌లు సిద్ధమవుతున్నాయా?
- మంత్రుల పనితీరును మినిట్ టు మినిట్ మానిటర్ చేస్తున్నారా?
- శాఖల మీద పట్టు నుంచి సెంట్రల్ ఫండ్స్‌దాకా అన్నిటి పరిశీలన
- మార్పులు ఉగాదికా? మరో రెండు మూడు నెలల్లోనా?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఏపీ కేబినెట్‌లో త్వరలోనే భారీ మార్పులు, చేర్పులు ఉండబోతున్నాయా? దానికి సంబంధించిన కసరత్తు జోరుగా జరుగుతోందా? సీఎం చంద్రబాబు ప్రాధమికంగా ఒక అవగాహనకు వచ్చారా? ఎంత మంది మంత్రుల శాఖలు మారే అవకాశం ఉంది? మినిస్టర్స్ గ్రాఫ్‌ను బట్టి ఉద్వాసనలు కూడా ఉంటాయా? నివేదికల్ని బట్టే సీఎం చంద్రబాబు కీలక నిర్ణయాలు తీసుకోబోతున్నారా? ఈసారి లోకేష్ టీమ్ స్పెషల్‌గా ఉండబోతోందా? లెట్స్ వాచ్. ఆంధ్రప్రదేశ్ మంత్రివర్గంలో మార్పులు చేర్పులు తప్పవన్న ప్రచారం జోరుగా జరుగుతోంది. అదీకూడా… త్వరలోనే ఉంటుందని అంటున్నారు. అదే సమయంలో ఇప్పుడున్న మంత్రులకు సంబంధించిన ప్రోగ్రెస్ రిపోర్ట్స్ కూడా రెడీ అవుతున్నాయట. ఆ నివేదకల ప్రకారమే మార్పులు ఉండవచ్చని అంటున్నారు. నివేదికల్ని కూడా… అదేదో ఆషామాషీగా కాకుండా…. మినిట్ టూ మినిట్ మంత్రుల పనితీరును మానిటర్ చేస్తున్నట్టు తెలుస్తోంది.
ఆ పరిశీలన సారాంశాన్ని బట్టి గ్రాఫ్ సిద్ధమవుతుందని చెబుతున్నాయి ప్రభుత్వ వర్గాలు. సీఎం చంద్రబాబు ప్రస్తుం ఈ సబ్జెక్ట్ మీదే ఎక్కువగా ఫోకస్ చేశారట. తాము నిర్వహిస్తున్న శాఖల మీద మంత్రులకు ఉన్న పట్టు, అధికారులతో ఎలా ఉంటున్నారు? ఎన్ని సమీక్షలు చేశారు? కేంద్రం నుంచి ఎన్ని నిధులు రాబట్టగలిగారు? ఎన్ని ప్రెస్‌మీట్స్ పెట్టారు లాంటి అన్ని అంశాలను పరిగణనలోకి తీసుకుని మార్కులేస్తున్నట్టు తెలిసింది. అలాగే…. ప్రభుత్వ కార్యక్రమాల్లో ఎంత చురుగ్గా ఉన్నారు లాంటి క్షేత్ర స్థాయి వివరాలకు సైతం ప్రాధాన్యం ఉంటుందని చెబుతున్నారు. మంత్రులకు ప్రోగ్రెస్ కార్డులు ఇవ్వడం వరకు ఒకేగానీ…. కేబినెట్‌లో మార్పులు చేర్పులకు అవే ప్రామాణికం, వాటినే కొలమానంగా తీసుకుంటారన్న ప్రచారం మాత్రం చాలామంది మినిస్టర్స్‌కు నిద్ర పట్టకుండా చేస్తోందట. దీనికి సంబంధించి చర్చలు ఇప్పటికే పీక్స్‌లో ఉన్నాయి.
Also Read
- Off The Record: ఆశించినన్ని సీట్లు వచ్చే పరిస్థితి లేక పోవడంతో జనసైనికులు డీలా..!
- OTR : బాల్కొండ టికెట్ నాదే.. ఇంచార్జ్ ముందే ఓపెన్‌గా ప్రకటించిన మానాల మోహన్ రెడ్డి
- OTR: ఆ జిల్లాలో స్థానిక సంస్థల ఎన్నికల రిజర్వేషన్ లో కూటమిలో విభేదాలకు కారణం అవుతున్నాయా?
- OTR: పటాన్చెరు కాంగ్రెస్‌లో అసంతృప్తి జ్వాలలు.. అధికారంలో ఉన్నా ప్రతిపక్షంలోనే ఉన్నామా?
ఆ ఛేంజెస్ ఉగాదికే ఉంటాయా లేక మరో రెండు మూడు నెలల్లోనా అన్న చర్చలు జోరుగా నడుస్తున్నాయి. దీంతో ప్రస్తుతం ప్రభుత్వ పెద్దలు గీస్తున్న మినిస్టర్స్ గ్రాఫ్‌కు ప్రాధాన్యం ఏర్పడింది. ఇప్పటికే కొంతమంది మంత్రులకు సంబంధించిన వ్యవహారాల చిట్టా సీఎం దగ్గరకు చేరిందట. ఎవరి పెర్ఫార్మెన్స్ ఎలా ఉంది? ఎవరిని మార్చాలన్న విషయంలో కూడా ప్రాధమిక అవగాహనకు వచ్చినట్టు చెప్పుకుంటున్నాయి ప్రభుత్వ వర్గాలు. అన్నిటికీ మించి ఈసారి జరిగే మార్పులతోనే వచ్చే ఎన్నికలకు వెళ్ళే అవకాశం ఉన్నందున ఎక్స్‌ట్రా కేర్ తీసుకుంటున్నట్టు సమాచారం. అలాగే ఈసారి కేబినెట్‌లో ప్రత్యేకంగా లోకేష్ టీం ఉండేలా జాగ్రత్తలు తీసుకుంటున్నారట. అసలు అదే ఫస్ట్ ప్రయార్టీ అన్న మాటలు కూడా గట్టిగా వినిపిస్తున్నాయి. మంత్రుల పెర్ఫార్మెన్స్‌పై పూర్తి స్థాయి రిపోర్ట్ తర్వాత కొత్తగా ఎవరికి అవకాశాలు ఇవ్వాలి, ఉన్న వాళ్ళలో ఎవరికి బైబై చెప్పేయాలన్న విషయంలో క్లారిటీ వస్తుందని అంటున్నారు. మొత్తానికి ఇప్పుడు సిద్ధమవుతున్న ప్రోగ్రెస్ కార్డ్స్‌తోనే మంత్రుల భవిష్యత్ ముడిపడి ఉందనే చర్చ బలంగా ఉంది కూటమి వర్గాల్లో. కనీసం పది మంది మంత్రుల శాఖలు మారచ్చనే ప్రచారం సైతం ఉంది. ఎలాంటి ఉరుములు మెరుపులు ఉంటాయో చూడాలి మరి.
Best Income: నాడు ఎకరం రూ.15 వేలు.. నేడు నెలకు రూ.14.50 లక్షల ఆదాయం.. ఎలా అంటే..
- Tags
- chandrababu
- NTV Telugu
- OTR
తాజావార్తలు
-
TDP, Jana Sena, BJP Candidates List: కూటమి సీట్ల పంపకం ఖరారు..! 17 కార్పొరేషన్లు.. 106 మున్సిపాలిటీలు.. ఏ పార్టీకి ఎక్కడంటే?
-
TG Safe Raids : ఈగలు, ఎలుకల మధ్య స్వీట్ల తయారీ.. 2,480 కిలోలు ధ్వంసం..
-
Off The Record: ఆశించినన్ని సీట్లు వచ్చే పరిస్థితి లేక పోవడంతో జనసైనికులు డీలా..!
-
OTR : బాల్కొండ టికెట్ నాదే.. ఇంచార్జ్ ముందే ఓపెన్‌గా ప్రకటించిన మానాల మోహన్ రెడ్డి
-
OTR: ఆ జిల్లాలో స్థానిక సంస్థల ఎన్నికల రిజర్వేషన్ లో కూటమిలో విభేదాలకు కారణం అవుతున్నాయా?
ట్రెండింగ్
-
Water Can Cleaning: 20 లీటర్ల నీళ్ల క్యాన్‌ను ఇలా కడుగుతున్నారా? ఈ తప్పులు వద్దు.!
-
Upma Rava vs Idli Rava : ఉప్మా రవ్వ, ఇడ్లీ రవ్వ ఒకటి కాదు.. అసలు తేడా ఇదే!
-
Small Kitchen Ideas: వంటగది కౌంటర్ ఎప్పుడూ తడిగా, చిందరవందరగా ఉంటుందా? ఈ చిన్న ప్లానింగ్ చేసుకోండి!
-
How To Grow Moringa: పోషకాల నిధి మునగ.. కుండీలో మురింగ చెట్టును ఈజీగా పెంచే టిప్స్ మీ కోసం..
-
IND vs WI 4th T20: అందరూ కాటేరమ్మకొడుకులే.. కానీ ఉప్పల్‌లో తుస్సుమన్నారు.. భారత్ ఓటమికి ఐదు కారణాలు ఇవే!