WhatsAppలో కీలక అప్‌డేట్.. AI ఎంపిక మరింత సులభం..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
వాట్సాప్ లేని స్మార్ట్‌ఫోన్ లేదంటే అతిశయోక్తి కాదు.. ప్రపంచవ్యాప్తంగా కోట్లాది మంది ఉపయోగిస్తున్న మెసేజింగ్ యాప్ వాట్సాప్ మరో కీలక అప్‌డేట్‌ను విడుదల చేసింది. ఈ తాజా అప్‌డేట్‌తో యాప్‌లో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) వినియోగాన్ని మరింత సులభతరం చేసే కొత్త ఫీచర్‌ను తీసుకొచ్చింది. ఈ అప్‌డేట్‌లో భాగంగా మెసేజింగ్ యాప్‌లో ప్రత్యేకంగా Meta AI ట్యాబ్‌ను ప్రవేశపెట్టారు. దీంతో వినియోగదారులు AI ఫీచర్లను నేరుగా యాప్‌లోనే సులభంగా ఉపయోగించుకోవచ్చు.
కొత్త AI ట్యాబ్ ఏమిటి?
ఈ కొత్త ట్యాబ్ ద్వారా వినియోగదారులు టెక్స్ట్ లేదా వాయిస్ కమాండ్‌లతో AIతో మాట్లాడవచ్చు. అలాగే యానిమేటెడ్ చిత్రాలు సృష్టించడం, ప్రశ్నలకు సమాధానాలు పొందడం వంటి ఫీచర్లు కూడా అందుబాటులో ఉంటాయి.
Also Read
- Vivo T5 5G: వివో T5 5G భారత్ లో రిలీజ్ డేట్ ఫిక్స్.. 7,050mAh బ్యాటరీ, 144Hz కర్వ్డ్ AMOLED డిస్‌ప్లే
- Boltt Ace 5G, Evo: బోల్ట్ ఏస్ 5G, ఇవో రిలీజ్.. 6000mAh బ్యాటరీ, 64MP AI కెమెరా, 8GB ర్యామ్.. ధర, ఫీచర్లు ఇవే
- 144Hz డిస్‌ప్లే, కొత్త కలర్ ఆప్షన్లతో సెప్టెంబర్ 4న రాబోతున్న Infinix Hot 70 Pro 5G.!
- ఆరేళ్ల సెక్యూరిటీ అప్డేట్స్, 2TB వరకు స్టోరేజ్, 50MP కెమెరాతో Sony Xperia 10 VIII లాంచ్..!
ఈ అప్‌డేట్ వివరాలను WABetaInfo వెల్లడించింది.
నివేదికల ప్రకారం, ఈ ఫీచర్ ప్రస్తుతం ఆండ్రాయిడ్ కోసం విడుదల చేసిన బీటా వెర్షన్‌లో కనిపించింది. ప్రత్యేకంగా Android 2.26.6.5 బీటా వెర్షన్లో ఈ కొత్త AI ట్యాబ్‌ను పరీక్షిస్తున్నారు. ప్రస్తుతం పరిమిత సంఖ్యలో ఆండ్రాయిడ్ వినియోగదారులతో ఈ ఫీచర్‌ను పరీక్షిస్తున్నారు. ఇప్పటికే కొంతమంది బీటా టెస్టర్లు దీనిని ఉపయోగిస్తున్నారు.
కమ్యూనిటీస్ ట్యాబ్ స్థానంలో AI
కొత్త అప్‌డేట్‌లో భాగంగా యాప్ దిగువ భాగంలో ఉన్న Communities ట్యాబ్‌ను తొలగించి, దాని స్థానంలో Meta AI ట్యాబ్‌ను తీసుకువచ్చారు. దీని వల్ల AI ఆధారిత చాట్‌లు మరియు ఫీచర్లను ఒకే చోట నుంచి ఉపయోగించుకునే అవకాశం ఉంటుంది. వాట్సాప్ భవిష్యత్తులో AI ఆధారిత సేవలను మరింతగా విస్తరించే దిశగా ఈ అప్‌డేట్ కీలకంగా మారనుందని టెక్ నిపుణులు భావిస్తున్నారు.
తాజావార్తలు
-
Hardik Pandya Trade: హార్దిక్ పాండ్యా ట్రేడ్ ఖరారు.. ఇద్దరు స్టార్ ఆటగాళ్లను వదులుకుంటున్న కేకేఆర్?
-
Vivo T5 5G: వివో T5 5G భారత్ లో రిలీజ్ డేట్ ఫిక్స్.. 7,050mAh బ్యాటరీ, 144Hz కర్వ్డ్ AMOLED డిస్‌ప్లే
-
Suryapet Bus Accident: సూర్యాపేట జిల్లాలో ఘోర ప్రమాదం.. బస్సు-కంటైనర్ ఢీ, ఆరుగురు మృతి
-
Kriti Sanon: సంస్కృతి గుండెల్లో ఉంటుంది, దుస్తుల్లో కాదు.. ట్రోలింగ్ పై కృతి సనన్ స్ట్రాంగ్ కౌంటర్!
-
TVS iQube MillionR Edition: 145KM రేంజ్‌తో TVS iQube కొత్త అవతార్.. 35.5L స్టోరేజ్, USB-C పోర్ట్‌తో MillionR Edition!
ట్రెండింగ్
-
Raksha Bandhan 2026: రక్షాబంధన్ ఎప్పుడు? ఆగస్టు 27నా.. 28నా? శుభముహూర్తం, పూర్తి వివరాలు ఇవే..
-
Medhavi Bidhuri: ‘6-7’ సెలబ్రేషన్‌తో వైరల్.. ఇప్పుడు వికెట్ల వేటలో తోపు.. ఎవరు ఈ ‘మెధావి బిధూరి’.?
-
Viral Love Story: తైవాన్ అబ్బాయి.. భారత్ అమ్మాయి.. రాత్రికి రాత్రే ఇండియాలో సెన్సేషన్.. కట్‌చేస్తే..
-
144Hz డిస్‌ప్లే, కొత్త కలర్ ఆప్షన్లతో సెప్టెంబర్ 4న రాబోతున్న Infinix Hot 70 Pro 5G.!
-
ఆరేళ్ల సెక్యూరిటీ అప్డేట్స్, 2TB వరకు స్టోరేజ్, 50MP కెమెరాతో Sony Xperia 10 VIII లాంచ్..!