KTR : మూసీ మీద 15 బ్రిడ్జిలు.. బీఆర్ఎస్ ప్లానింగ్ చెప్పిన కేటీఆర్
- మూసీ ప్రాజెక్టుపై కాంగ్రెస్ ప్రభుత్వాన్ని టార్గెట్ చేసిన కేటీఆర్
- ఇళ్ల కూల్చివేతలపై తీవ్ర విమర్శలు
- మూసీపై 15 బ్రిడ్జిల నిర్మాణం బీఆర్ఎస్ ప్లాన్
- పేదల ఇళ్లను కూల్చొద్దని ప్రభుత్వానికి హెచ్చరిక
- Follow Us :
-
-
Add as a preferred
source on google
మూసీ పునరుజ్జీవం పేరుతో కాంగ్రెస్ ప్రభుత్వం చేపట్టిన ఇళ్ల కూల్చివేతలపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తీరు ‘మింగడానికి మెతుకు లేదు కానీ మీసాలకు సంపెంగ నూనె’ అన్న చందంగా ఉందని ఎద్దేవా చేసిన ఆయన, రాష్ట్ర ఖజానాలో ప్రజా హామీలకే నిధులు లేనప్పుడు మూసీ ప్రాజెక్టు కోసం వేల కోట్లు ఎక్కడి నుంచి తెస్తారని నిలదీశారు. గతంలో కేసీఆర్ అసెంబ్లీ వేదికగా తెలంగాణ నిర్మాణం గురించి ప్రెజెంటేషన్ ఇస్తే, నేటి ముఖ్యమంత్రి ఫైవ్ స్టార్ హోటళ్లలో కూర్చుని పేదల ఇళ్లను ఎలా విద్వంసం చేయాలో ప్రెజెంటేషన్లు ఇస్తున్నారని మండిపడ్డారు. బీఆర్ఎస్ ఎప్పుడూ మూసీ సుందరీకరణకు వ్యతిరేకం కాదని, అయితే సుందరీకరణ పేరుతో పేదల ఇళ్లను కూల్చడాన్ని మాత్రం సహించబోమని ఆయన స్పష్టం చేశారు.
Uttam Kumar Reddy: గ్యాస్‌పై తెలంగాణ ప్రజలకు ఊరట.. మంత్రి కీలక ప్రకటన..
Also Read
బీఆర్ఎస్ హయాంలో తాము అనుసరించిన అభివృద్ధి నమూనాను వివరిస్తూ, ఒక్క ఇల్లు కూడా కూల్చకుండా ముషీరాబాద్ , నాగోల్ వంటి ప్రాంతాల్లో ఆరు కిలోమీటర్ల మేర మూసీని అద్భుతంగా సుందరీకరించి చూపించామని కేటీఆర్ గుర్తు చేశారు. తాము గూగుల్ నుంచి డౌన్‌లోడ్ చేసిన ఫోటోలు కాకుండా, క్షేత్రస్థాయిలో చేసిన అభివృద్ధిని ప్రజలకు చూపిస్తున్నామని చెప్పారు. మంచిరేవుల నుంచి ఘట్కేసర్ వరకు 57 కిలోమీటర్ల పరిధిలో మూసీ రూపురేఖలు మార్చాలని, అందులో భాగంగా 15 బ్రిడ్జిలు నిర్మించాలనే పక్కా ప్రణాళికతో తాము ఉన్నామని వెల్లడించారు. ఇప్పటికే మూసీ నీటిని శుద్ధి చేసేందుకు రూ. 3,866 కోట్లతో ఎస్టీపీ (STP) ప్లాంట్లు నిర్మించామని, కేసీఆర్ చేసింది మూసీ పునర్జీవమైతే, రేవంత్ రెడ్డి చేస్తోంది కేవలం ఇళ్ల విద్వంసమేనని ఆరోపించారు.
Durandhar 2: ధురంధర్ ది రివెంజ్ అడ్వాన్స్ బుకింగ్‌లు ప్రారంభం
ఇదే క్రమంలో ప్రభుత్వం అనుసరిస్తున్న ద్వంద్వ నీతిని కేటీఆర్ ఎండగట్టారు. పేదల ఇళ్లను కూల్చడమే లక్ష్యంగా పెట్టుకున్న ప్రభుత్వం, మంత్రులు , అధికార పార్టీ నేతల ఇళ్ల విషయంలో ఎందుకు మౌనంగా ఉందని ప్రశ్నించారు. కొడంగల్‌లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇల్లు, మాదాపూర్‌లో ఆయన సోదరుడి ఇల్లు, అలాగే మంత్రులు పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, పట్నం మహేందర్ రెడ్డి , సీనియర్ నేతలు వివేక్ వెంకటస్వామి, కేవీపీ రామచందర్ రావుల ఇళ్లు ఎఫ్‌టీఎల్ లేదా బఫర్ జోన్లలో ఉన్నాయని, వారిపై చర్యలు ఎందుకు తీసుకోవడం లేదని నిలదీశారు. ఒక్క ఇల్లు కట్టే తెలివి లేని ముఖ్యమంత్రికి వందల ఇళ్లు కూల్చే తెలివి ఉందని విమర్శించిన కేటీఆర్, బాధితులకు భరోసా ఇస్తూ మరో రెండేళ్లు తమ ఆస్తులను కాపాడుకోవాలని, త్వరలోనే బీఆర్ఎస్ అధికారంలోకి వస్తుందని ధీమా వ్యక్తం చేశారు. తాము అధికారంలోకి వచ్చాక మూసీ ప్రాంత నివాసుల ఇళ్లకు చిన్న సున్నం కూడా చెదరకుండా సుందరీకరణ చేసి చూపిస్తామని హామీ ఇచ్చారు.
తాజావార్తలు
-
Dhruv Vikram: మైత్రీ అడ్డాలోకి చియాన్ తనయుడు.. ధ్రువ్ విక్రమ్ ‘జాకీ’ అనౌన్స్మెంట్ చూశారా!
-
UCC: 21 ఎన్డీయే పాలిత రాష్ట్రాల్లో ‘‘సివిల్ కోడ్’’.. అమిత్ షా కీలక ప్రకటన..
-
TET Results Out: ఏపీ టెట్ ఫలితాలు విడుదల.. చెక్ చేసుకోండిలా..
-
YS Jagan: డీఎస్సీ అక్రమాలపై సీఎం చంద్రబాబుకు జగన్ ప్రశ్నలు.. 1-6 ట్విస్ట్‌లతో ఎక్స్‌లో పోస్టులు!
-
Upasana Konidela: ‘‘చరణ్ పక్కన నువ్వేం సెట్ అవుతావ్ అన్నారు..’’ బాడీ షేమింగ్, ట్రోల్స్‌పై ఉపాసన రియాక్షన్!
ట్రెండింగ్
-
Head Coach: హెడ్ కోచ్‌గా సౌరవ్ గంగూలీ.. అసిస్టెంట్ కోచ్‌గా యువరాజ్ సింగ్!
-
International Chocolate Day : చాక్లెట్ ప్రియులకు స్పెషల్ డే.. ఈ రోజు ఎందుకంత స్పెషల్?
-
Ganesh Chaturthi AI Prompts: మీ స్వంత ఫొటోలతో AI ఉపయోగించి గణపతి శుభాకాంక్షలు చెప్పండి.. ప్రాంప్ట్స్ ఇదిగో మీకోసం..!
-
Moto Buds 2 Fusion: 55dB ANC, 13 గంటల ప్లేబ్యాక్‌తో సెప్టెంబర్ 15న భారత్‌లో లాంచ్ కానున్న Moto Buds 2 Fusion.!
-
1 Crore Investment Plan: రూ. కోటి సంపాదించడానికి ఎంత సమయం పడుతుంది.? SIPలో ఎంత పెట్టుబడి పెట్టాలి?