Easy Making : పిల్లలు ఇష్టపడే క్రీమీ ఐస్ క్రీమ్ ఇంట్లోనే.. పంచదార లేదు, క్రీమ్ లేదు.. కేవలం ఖర్బుజా పండుతో..!
- పంచదార, క్రీమ్ లేకుండా హెల్తీ ఐస్ క్రీమ్
- ఖర్బుజా ఐస్ క్రీమ్‌కు కావలసిన పదార్థాలు
- స్టెప్ బై స్టెప్ తయారీ విధానం
- పిల్లలు ఇష్టపడే హెల్తీ సమ్మర్ డెజర్ట్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Muskmelon Ice Cream : వేసవి కాలం వచ్చిందంటే చాలు.. భానుడి భగభగలకు శరీరం డీహైడ్రేషన్‌కు గురవుతుంటుంది. అప్పుడు మన మనసు చల్లచల్లగా ఏదైనా తినాలని లేదా తాగాలని కోరుకుంటుంది. సాధారణంగా బయట దొరికే ఐస్ క్రీముల్లో అధిక మోతాదులో పంచదార, అనారోగ్యకరమైన ఫ్యాట్స్ , ప్రిజర్వేటివ్స్ ఉంటాయి. ఇవి రుచిగా అనిపించినా ఆరోగ్యానికి అంత మంచివి కావు. అందుకే, ఈ వేసవిలో మీ దాహాన్ని తీర్చుకుంటూనే, శరీరానికి చలువ చేసే ఖర్బుజా పండు (Muskmelon) తో ఇంట్లోనే క్రీమీగా ఉండే ఐస్ క్రీమ్‌ను సిద్ధం చేసుకోవచ్చు. ఖర్బుజాలో నీటి శాతం ఎక్కువగా ఉండటం వల్ల ఇది శరీరానికి తక్షణ శక్తిని ఇస్తుంది. ఎటువంటి ఆర్టిఫిషియల్ ఫ్లేవర్స్ లేదా బయట దొరికే ఫ్రెష్ క్రీమ్ వాడకుండా, కేవలం ఇంట్లో ఉండే పాలు, డ్రై ఫ్రూట్స్ , బెల్లంతో ఈ ఐస్ క్రీమ్‌ను ఎలా తయారు చేయాలో ఇప్పుడు వివరంగా చూద్దాం.
LPG Crisis: గ్యాస్, పెట్రోల్ కొరతపై పార్లమెంట్లో కేంద్రం కీలక ప్రకటన..
Also Read
- Onion Pesarattu: టిఫిన్స్‌లో రారాజు 'ఆనియన్ పెసరట్టు'.. పర్ఫెక్ట్ కొలతలతో రెస్టారెంట్ స్టైల్లో సులువుగా చేసుకోండి ఇలా..!
- Pappu Chakodilu: స్వీట్ షాప్ స్టైల్ క్రిస్పీ 'పప్పు చకోడీలు'.. ఇంట్లోనే పర్ఫెక్ట్గా సులువుగా ఇలా తయారు చేసుకోండి.!
- Instant Noodle: ఇన్స్టంట్ నూడుల్స్ తినడంలో భారత్ రికార్డు..! చైనా, జపాన్, వియత్నాం స్థానాలివే..
- Bhindi Health Benefits: బెండకాయ జిగురును చూసి దూరం పెడుతున్నారా? ప్రయోజనాలు తెలిస్తే షాకే..!
కావలసిన పదార్థాలు:
- ఖర్బుజా పండు: ఒకటి (బాగా పండినది)
- పాలు: అర లీటర్
- జీడిపప్పు: 15 (గంట పాటు నానబెట్టినవి)
- బెల్లం తురుము: పావు కప్పు నుంచి అర కప్పు వరకు (మీ తీపికి తగినట్లుగా)
- యాలకుల పొడి: అర టీస్పూన్
- డ్రై ఫ్రూట్స్: బాదం, పిస్తా (సన్నగా తరిగినవి)

తయారీ విధానం:
- నేచురల్ క్రీమ్ తయారీ: ముందుగా స్టవ్ మీద అర లీటర్ పాలను పోసి, అవి సగం అయ్యే వరకు చిన్న మంటపై మరిగించాలి. గంట పాటు నానబెట్టిన జీడిపప్పులను కొద్దిగా పాలు పోసి మెత్తని పేస్ట్‌లా గ్రైండ్ చేసుకోవాలి. ఈ పేస్ట్‌ను మరుగుతున్న పాలలో కలిపి మరో 5 నిమిషాలు ఉడికించి పూర్తిగా చల్లారనివ్వాలి. ఈ జీడిపప్పు మిశ్రమం వల్ల ఐస్ క్రీమ్ బయట కొన్న దానికంటే ఎక్కువ క్రీమీగా తయారవుతుంది.
- ఖర్బుజాను సిద్ధం చేయడం: బాగా పండిన ఖర్బుజా పండు పైభాగాన్ని ఒక టోపీ లాగా (మూతలా) కట్ చేసి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు స్పూన్ సహాయంతో లోపల ఉండే గింజలను తీసేసి, ఆ తర్వాత లోపల ఉండే గుజ్జును (Pulp) జాగ్రత్తగా తీయాలి. లోపల గుజ్జు తీశాక ఆ ఖర్బుజా పండు ఒక ఖాళీ గిన్నెలా (Hollow) తయారవ్వాలి.
- బ్లెండింగ్: మిక్సీ జార్లో మీరు తీసిన ఖర్బుజా గుజ్జు, చల్లారిన మిల్క్ క్రీమ్ , మీ తీపికి సరిపడా బెల్లం వేసి స్మూత్‌గా బ్లెండ్ చేయాలి. బెల్లం వాడటం వల్ల ఇది హెల్తీగా ఉండటమే కాకుండా ఒక ప్రత్యేకమైన రుచిని కూడా ఇస్తుంది.
- ఫ్రీజింగ్: ఈ బ్లెండ్ చేసిన మిశ్రమంలో సన్నగా తరిగిన బాదం, పిస్తా ముక్కలు కలిపి, తిరిగి ఆ ఖాళీ ఖర్బుజా పండులోకి పోయాలి. పైన కట్ చేసిన ముక్కతో మూసివేసి సుమారు 8 నుండి 10 గంటల పాటు లేదా రాత్రంతా ఫ్రీజర్‌లో ఉంచాలి.
- సర్వింగ్: ఐస్ క్రీమ్ పూర్తిగా సెట్ అయిన తర్వాత బయటకు తీసి, ఒక 10 నిమిషాల పాటు అలాగే ఉంచి ఆపై స్లైసెస్‌గా కట్ చేయాలి. చల్లచల్లని క్రీమీ ఖర్బుజా ఐస్ క్రీమ్ పిల్లలకి, పెద్దలకి వడ్డించడానికి సిద్ధం.
Ugadi 2026: పరాభవ నామ సంవత్సరంలో మీ ఆదాయం ఎంత.? ఎవరికి లాభం.. ఎవరికి నష్టం.?
తాజావార్తలు
-
Story Board : ఏపీలో మున్సిపల్ ఎన్నికల పోలింగ్ లేనట్లేనా ?
-
Harish Rao : కరువు ముందే తెలుసు కదా.. నీళ్లెందుకు నిల్వ చేయలేదు.?
-
Off The Record: నామినేషన్ల వరకు హడావుడి.. ఆ తర్వాత హ్యాండ్సప్.. సీన్లోకి వస్తారనుకుంటే సైలెంట్ అయ్యారా?
-
OTR: కూటమి కంచుకోటలో అలజడి రేగుతోందా
-
Prabhas Fauzi Glimpse: హిట్లర్‌కే దిమ్మతిరిగే కౌంటర్ ఇచ్చిన నేతాజీ.. ప్రభాస్ ‘ఫౌజీ’ గ్లింప్స్ ఊచకోత!
ట్రెండింగ్
-
LPG Gas Saving Tips: మీ గ్యాస్ సిలిండర్ త్వరగా అయిపోతోందా?.. ఈ చిన్న టిప్స్ పాటిస్తే ఎంతో ఆదా!
-
Used Tea Leaves: వాడేసిన టీ పొడిని పారేస్తున్నారా? ఆ చెత్తతో గాజు వస్తువులు మెరిపించవచ్చని తెలుసా?
-
Virat Kohli vs Pakistan: భారత్ – పాక్ సమరం.. జీవితంలో మరిచిపోలేని విరాట్ కోహ్లీ మాస్ ఇన్నింగ్స్..!
-
స్నాప్‌డ్రాగన్ 8 ఎలైట్ జెన్ 5, యాక్టివ్ కూలింగ్ ఫ్యాన్‌తో OnePlus Ace 7 Pro.. అక్టోబర్ 29న గ్రాండ్ ఎంట్రీ..!
-
Yellow Gas Flame: గ్యాస్ మంట పసుపు లేదా నారింజ రంగులో వస్తోందా? ప్రమాదం పొంచి ఉండొచ్చు జాగ్రత్త సుమీ..!