Kuldeep Yadav Marriage: పెళ్లికొడుకు అయిన టీమిండియా స్టార్ క్రికెటర్.. భార్య ఆస్తి ఎంతో తెలుసా?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Kuldeep Yadav Marriage: భారత క్రికెట్ జట్టు స్టార్ చైనామన్ స్పిన్నర్ కుల్దీప్ యాదవ్ తన జీవితంలో కొత్త ఇన్నింగ్స్‌ను ప్రారంభిస్తున్నారు. తన చిన్ననాటి స్నేహితురాలు వంశిక చద్దాను ఆయన నేడు (మార్చి 14, 2026) వివాహం చేసుకోబోతున్నారు. ముస్సోరీలో అత్యంత సన్నిహితుల మధ్య ఈ వివాహ వేడుక వైభవంగా జరుగుతోంది. కుల్దీప్, వంశికలది కాన్పూర్‌లో మొదలైన అందమైన ప్రేమకథ అని వారి సన్నిహితులు చెబుతున్నారు. పొరుగు ఇళ్లలో పెరిగిన వీరిద్దరి మధ్య ఉన్న చిన్ననాటి స్నేహం కాలక్రమేణా ప్రేమగా మారింది. 2025లో ఈ జంట తమ నిశ్చితార్థాన్ని ప్రకటించి అందరినీ ఆశ్చర్యపరిచారు. నిజానికి గతేడాదే పెళ్లి జరగాల్సి ఉన్నా, కొన్ని కారణాల వల్ల వాయిదా పడి ఈరోజు శుభముహూర్తం ఖరారైంది.
Also Read
- CM Chandrababu: బటన్ నొక్కడం నా విధానం కాదు.. కామన్ మ్యాన్‌లా ప్రజల్లో ఉంటా.. ప్రజలే మాకు ప్రతిపక్షం..
- CM Chandrababu: బీసీ రిజర్వేషన్లను వైసీపీ అడ్డుకుంది..! సుప్రీంకోర్టుకు వెళ్తాం.. చంద్రబాబు కీలక వ్యాఖ్యలు
- Electric Two-Wheeler Sales: మార్కెట్‌ను శాసిస్తున్న 4 ఈవీ స్కూటర్లు ఇవే.. 9 నెలల్లో 15.61 లక్షల అమ్మకాలు..!
- Rajasthani Dal Baati: నోట్లో వేస్తే కరిగిపోయే నెయ్యి బాటీలు, ఘాటైన దాల్ కాంబినేషన్ ఇలా చేయండి..!
వంశిక చద్దా నేపథ్యం ఇదే..
లైమ్‌లైట్‌కు దూరంగా ఉండటానికి ఇష్టపడే వంశిక చద్దా వృత్తిరీత్యా కార్పొరేట్ ఉద్యోగి. ఆస్ట్రేలియాలో మాస్టర్స్ డిగ్రీ పూర్తి చేసిన ఈమె ప్రస్తుతం ఎల్‌ఐసీ (LIC) సంస్థలో పని చేస్తున్నారు. ఆమె తండ్రి యోగేష్ చద్దా కూడా అదే సంస్థలో పని చేయడం విశేషం. నిరాడంబరమైన మధ్యతరగతి కుటుంబం నుంచి వచ్చిన వంశిక, తనకంటూ ఒక ప్రత్యేక గుర్తింపును సంపాదించుకున్నారు. ప్రస్తుతం సోషల్ మీడియాలో కుల్దీప్ యాదవ్ – వంశికల ఆస్తుల గురించి ఆసక్తికరమైన చర్చ నడుస్తోంది. పలు నివేదికల ప్రకారం వారి ఆస్తుల వివరాలు ఇలా ఉన్నాయి.. టీమిండియా మ్యాచ్ ఫీజులు, ఐపీఎల్ (ఢిల్లీ క్యాపిటల్స్) కాంట్రాక్టులు, బ్రాండ్ ఎండార్స్‌మెంట్‌ల ద్వారా కుల్దీప్ దాదాపు రూ.34 కోట్ల నికర విలువను కలిగి ఉన్నారు. ఇకపోతే వంశిక చద్దా ఆస్తుల విషయానికి వస్తే.. తన కార్పొరేట్ ఉద్యోగం ద్వారా వంశిక సుమారు రూ.40 – 50 లక్షల వరకు ఆస్తిని కలిగి ఉన్నట్లు సమాచారం. ఆర్ధికంగా కుల్దీప్ చాలా ముందంజలో ఉన్నప్పటికీ, వీరిద్దరి మధ్య ఉన్న బంధం ఆస్తులకు అతీతమని వారి సన్నిహితులు చెబుతుంటారు.
రాయల్ వెడ్డింగ్ కార్డ్.. లక్నోలో రిసెప్షన్
ఈ వివాహ వేడుకకు సంబంధించిన ఆహ్వాన పత్రిక ఇప్పటికే నెట్టింట వైరల్ అయ్యింది. ‘KV’ (కుల్దీప్-వంశిక) అనే ఇనీషియల్స్‌తో కూడిన 3D మెటాలిక్ బాక్స్ వెడ్డింగ్ కార్డ్ అందరినీ ఆకట్టుకుంటోంది. ముస్సోరీలో ప్రైవేట్ వేడుకగా వివాహం ముగిసిన తర్వాత, లక్నోలో ఘనంగా వెడ్డింగ్ రిసెప్షన్ నిర్వహించనున్నారు. ఈ కార్యక్రమానికి క్రికెట్ దిగ్గజాలతో పాటు పలువురు సెలబ్రిటీలు హాజరయ్యే అవకాశం ఉందని సమాచారం.
READ ALSO: Pakistan: పాకిస్థాన్ సైనిక స్థావరంపై ఆఫ్ఘన్ మెరుపు దాడి!
తాజావార్తలు
-
CM Chandrababu: బటన్ నొక్కడం నా విధానం కాదు.. కామన్ మ్యాన్‌లా ప్రజల్లో ఉంటా.. ప్రజలే మాకు ప్రతిపక్షం..
-
Ilaiyaraaja : ఇళయరాజాకు సుప్రీంకోర్టులో ఎదురుదెబ్బ
-
CM Chandrababu: బీసీ రిజర్వేషన్లను వైసీపీ అడ్డుకుంది..! సుప్రీంకోర్టుకు వెళ్తాం.. చంద్రబాబు కీలక వ్యాఖ్యలు
-
Electric Two-Wheeler Sales: మార్కెట్‌ను శాసిస్తున్న 4 ఈవీ స్కూటర్లు ఇవే.. 9 నెలల్లో 15.61 లక్షల అమ్మకాలు..!
-
PM Modi: ‘ప్రభుత్వమే మై-బాప్’ నుంచి ‘పౌరుడి సేవకు ప్రాధాన్యత’ వైపు.. UPSC శతాబ్ది వేడుకల్లో ప్రధాని మోడీ కీలక సందేశం
ట్రెండింగ్
-
Rajasthani Dal Baati: నోట్లో వేస్తే కరిగిపోయే నెయ్యి బాటీలు, ఘాటైన దాల్ కాంబినేషన్ ఇలా చేయండి..!
-
Breakfast Quesadillas: రోజూ టిఫిన్ గురించి టెన్షన్ వద్దు.. జస్ట్ 20 నిమిషాల్లో రెడీ అయ్యే ఈ బ్రేక్‌ఫాస్ట్‌ను ట్రై చేయండి..
-
50MP కెమెరా, 6,000mAh బ్యాటరీ, డైమెన్సిటీ 6300 చిప్‌తో రూ.20,999కే Redmi 17C 5G లాంచ్..!
-
Asian Games 2026: శ్రీలంకపై భారత్ భారీ విజయం.. బంగారు పతకం కోసం భారత్, పాక్ పోరు.!
-
Asian Games 2026: వైభవ్ మెరుపులు.. ఇషాన్ ఊచకోత..! శ్రీలంక టార్గెట్ ఎంతంటే.?