DIY Keratin Treatment at Home: పొడవైన, దృఢమైన, మెరిసే జుట్టు మీ సొంతం.. సింపుల్‌గా ఇంట్లోనే కెరాటిన్ ట్రీట్మెంట్..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
DIY Keratin Treatment at Home: పొడవైన, దృఢమై, మెరిసే జుట్టు ఉండాలని ఎవరైనా అనుకుంటారు.. దీని కోసం ఎన్నో డబ్బులు ఖర్చు చేసేవారు కూడా లేకపోలేదు.. హెయిర్ ఫాల్ తగ్గాలని కొందరు.. తమకు ఒత్తైన జుట్టు కావాలని మరికొందరు.. ఇలా.. చాలా రకాల కోరికలే ఉంటాయి.. ఎందుకంటే, మన అందాన్ని పెంచడంలో జుట్టు ముఖ్యమైన పాత్ర పోషిస్తుంది. పొడవైన, మృదువైన మరియు మెరిసే జుట్టు కోసం చాలామంది బ్యూటీ పార్లర్లలో కెరాటిన్ ట్రీట్మెంట్ చేయించుకుంటారు. అయితే ఈ చికిత్సకు వేల రూపాయలు ఖర్చవుతాయి. కానీ అదే ఫలితాన్ని కొంతవరకు ఇంట్లోనే సహజ పదార్థాలతో పొందవచ్చని మీకు తెలుసా?
సాధారణంగా కెరాటిన్ ట్రీట్మెంట్ జుట్టును నునుపుగా, మెరిసేలా మరియు బలంగా మార్చడంలో సహాయపడుతుంది. ఇంట్లో లభించే కొన్ని సహజ పదార్థాలతో తయారుచేసిన హెయిర్ మాస్క్‌లను ఉపయోగించడం ద్వారా మీరు మీ జుట్టుకు సహజ కెరాటిన్ ట్రీట్మెంట్ ఇవ్వవచ్చు. ఈ విధంగా పార్లర్ ఖర్చు లేకుండా జుట్టును ఆరోగ్యంగా ఉంచుకోవచ్చు.
Also Read
- Cinnamon Plant: మార్కెట్ దాల్చిన చెక్కకు గుడ్ బై.. ఇంట్లోని కుండీలోనే సులువుగా పెంచేయండిలా..
- Ayudha Pooja : ఆయుధ, సరస్వతీ పూజలకు ఇల్లు సిద్ధమవుతోందా?.. ఈ సింపుల్ టిప్స్‌తో మెరిపించేయండి!
- Japanese Kitchen Cleaning Tips: గిన్నెలు తోమడం ఇక చాలా తేలిక.. జపాన్ ప్రజలు పాటించే సింపుల్ ఆర్డర్ ఇదే!
- Jelly Bangles Designs: ఇప్పుడు ఈ గాజులే ట్రెండ్.. కుర్తీ, జీన్స్, చీర.. ప్రతి డ్రెస్‌కు సరిపోయే డిజైన్లు.. ఇలా ట్రై చేయండి..
రెండు సహజ హెయిర్ మాస్క్‌లు జుట్టును మృదువుగా, బలంగా మరియు మెరిసేలా చేయడంలో సహాయపడతాయి.
1. గుడ్డు హెయిర్ మాస్క్
ఈ హెయిర్ మాస్క్ జుట్టుకు అవసరమైన ప్రోటీన్లను అందించి జుట్టును బలంగా మరియు మెరిసేలా చేయడంలో సహాయపడుతుంది.
* కావలసిన పదార్థాలు
– 2 గుడ్ల తెల్లసొన
– 2 చెంచాల తేనె
– అర కప్పు కొబ్బరి నూనె
* తయారీ విధానం
ముందుగా ఒక గిన్నె తీసుకుని అందులో గుడ్లను పగలగొట్టి తెల్లసొనను వేరు చేయాలి. ఆ తెల్లసొనలో తేనె మరియు కొబ్బరి నూనె వేసి బాగా కలపాలి. అన్ని పదార్థాలు బాగా కలిసిన తర్వాత ఆ మిశ్రమాన్ని జుట్టుకు సమానంగా అప్లై చేయాలి. మాస్క్ పూర్తిగా ఆరిన తర్వాత మృదువైన షాంపూ మరియు కండిషనర్‌తో జుట్టును కడగాలి. ఈ ప్రక్రియను వారానికి ఒకసారి చేస్తే కొద్ది రోజుల్లోనే జుట్టు మృదువుగా మరియు మెరిసేలా మారడం గమనించవచ్చు.
2. పెరుగు – కలబంద జెల్ హెయిర్ మాస్క్
పెరుగు మరియు కలబంద జుట్టుకు పోషణ అందించి జుట్టును ఆరోగ్యంగా ఉంచడంలో సహాయపడతాయి. ఈ మాస్క్ జుట్టును మృదువుగా మరియు మెరిసేలా చేస్తుంది.
* కావలసిన పదార్థాలు
– అర కప్పు పెరుగు
– 2 టేబుల్ స్పూన్లు కలబంద జెల్
– 1 టేబుల్ స్పూన్ కొబ్బరి నూనె
* తయారీ విధానం
ముందుగా ఒక గిన్నెలో కలబంద జెల్ తీసుకుని అందులో పెరుగు వేసి బాగా కలపాలి. తర్వాత కొబ్బరి నూనె వేసి మిశ్రమాన్ని సమానంగా కలపాలి. ఈ మిశ్రమాన్ని జుట్టుకు పూర్తిగా అప్లై చేసి కొంతసేపు ఆరనివ్వాలి. తర్వాత మృదువైన షాంపూ మరియు కండిషనర్‌తో జుట్టును కడగాలి. ఈ హెయిర్ మాస్క్‌ను వారానికి ఒకసారి ఉపయోగిస్తే జుట్టు మృదువుగా, మెరిసేలా మరియు ఆరోగ్యంగా మారుతుంది. అయితే, ఈ సహజ హెయిర్ మాస్క్‌లు జుట్టుకు పోషణ అందించడంలో సహాయపడతాయి. అయితే జుట్టు రకం మరియు తల చర్మం పరిస్థితిని బట్టి ఫలితాలు మారవచ్చు. క్రమం తప్పకుండా ఉపయోగిస్తే మంచి ఫలితాలు కనిపించే అవకాశం ఉందంటున్నారు నిపుణులు..
తాజావార్తలు
-
Tuesday Astrology: విజయదశమి నాటి దినఫలాలు.. ఆ రాశుల వారికి ఊహించని లాభాలు!
-
Chairman’s Desk : ఎల్‌నినో సంక్షోభం.. ఒత్తిడిలో ప్రపంచం..!
-
Sajjala Ramakrishna Reddy: మీ పాలనపై నమ్మకముంటే ఈ భయమేంటి.. సజ్జల ఘాటు వ్యాఖ్యలు
-
Sai Pallavi: సీత పాత్రతో చాలా నేర్చుకున్నా.. సాయి పల్లవి ఆసక్తికర వ్యాఖ్యలు.!
-
Yash: రావణుడిగా ఎవరైనా చేస్తారు.. రాముడి పాత్ర అంత ఈజీ కాదు: యశ్
ట్రెండింగ్
-
29kmpl మైలేజ్, 160PS పవర్, పనోరమిక్ సన్‌రూఫ్ తో Renault Duster Hybrid E-Tech లాంచ్..
-
Asian Para Games: తొలిరోజే 11 పతకాలు..! ఆసియా పారా గేమ్స్‌లో భారత్‌కు అదిరిపోయే ఆరంభం..
-
India Playing XI: రోహిత్-గిల్ ఓపెనర్స్.. కోహ్లీ మూడో స్థానంలో.! 2027 ప్రపంచ కప్ జట్టును ఎంపిక చేసిన టీమిండియా మాజీ ప్లేయర్.!
-
New Recharge Plans: డేటా అవసరం లేదా? కొత్త రీఛార్జ్ ప్లాన్స్ వచ్చేశాయ్.. రూ.185 నుంచి మొదలు.!
-
WPL 2027 Auction: 27 స్థానాల కోసం 146 మంది ప్లేయర్లు.. WPL వేలం తేదీ, వేదిక ఖరారు..!