ప్రైవసీ కోసం కొత్త సేవ.. మహిళలకు BSNL ‘Kavach Number’ ప్రారంభం..!
- మహిళల భద్రత, ప్రైవసీ కోసం “Kavach Number” అనే కొత్త సేవ
- సేవ ద్వారా మహిళలకు 10 అంకెల టెంపరరీ మొబైల్ నంబర్
- ప్రస్తుతం ఈ సేవ BSNL వెబ్‌సైట్ లేదా సెల్ఫ్ కేర్ యాప్‌లో అందుబాటులో..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
BSNL ‘Kavach Number’: డిజిటల్ ఇండియా యుగంలో మహిళల భద్రత, ప్రైవసీకి ప్రాధాన్యత ఇస్తూ ప్రభుత్వ టెలికాం సంస్థ భారత్ సంచార నిగమ్ లిమిటెడ్ (BSNL) కొత్త సేవను ప్రారంభించింది. “కవచ్ నంబర్” పేరుతో వచ్చిన ఈ సేవ మహిళల వ్యక్తిగత మొబైల్ నంబర్‌ను రహస్యంగా ఉంచేందుకు సహాయపడుతుంది. ఈ సేవ ద్వారా మహిళలకు ఒక 10 అంకెల ప్రత్యామ్నాయ (టెంపరరీ) నంబర్ అందుతుంది.
LPG Gas Saving Tips: ఈ చిట్కాలు పాటిస్తే.. సిలిండర్ ఎక్కువ రోజులు వస్తుంది..!
Also Read
- 144Hz AMOLED డిస్‌ప్లే, 7,200mAh బ్యాటరీ, ZEISS కెమెరా వ్యవస్థతో Vivo V80 లాంచ్.. ధర, ఫీచర్లు ఇవే!
- 10,000mAh బ్యాటరీ, మిలిటరీ గ్రేడ్ మన్నిక, AMOLED డిస్ప్లేతో గిన్నిస్ వరల్డ్ రికార్డ్ మొబైల్ vivo S2 FE లాంచ్.. ధర, ఫీచర్లు ఇవే..!
- vivo X Fold6: 200MP కెమెరా.. 6900mAh బ్యాటరీ.. vivo కొత్త ఫోల్డబుల్ ఫోన్ వచ్చేసింది! ఫీచర్లు అదిరిపోయాయ్
- Big Billion Days Offers: రూ.20,000 లోపు లభించే టాప్ స్మార్ట్‌ఫోన్ డీల్స్ ఇదిగో.. అస్సలు మిస్ కావద్దు.!
సాధారణంగా ఫిజికల్ స్టోర్లలో రీచార్జ్ చేసేటప్పుడు వ్యక్తిగత మొబైల్ నంబర్ ఇవ్వాల్సి వస్తుంది. కానీ ఇప్పుడు “కవచ్ నంబర్” ద్వారా అసలు నంబర్ వెల్లడించకుండా రీచార్జ్ చేయించుకోవచ్చు. అసలు ఈ BSNL కవచ్ నంబర్ అంటే ఏంటంటే.. ఈ సేవను యాక్టివేట్ చేసిన తర్వాత మహిళలకు వారి ప్రాథమిక మొబైల్ నంబర్ కు అనుసంధానమైన మరో 10 అంకెల టెంపరరీ నంబర్ ఇవ్వబడుతుంది. దీనితో మీకు తెలియని స్టోర్‌లో రీచార్జ్ చేయాల్సి వచ్చినప్పుడు లేదా మీ మొబైల్ నంబర్ ఇవ్వడానికి ఇష్టంలేని పరిస్థితుల్లో.. అసలు నంబర్ కు బదులుగా ఈ కవచ్ నంబర్ ను ఇవ్వవచ్చు.
ఆ స్టోర్ ఆ టెంపరరీ నంబర్ తో రీచార్జ్ చేస్తే, టాక్‌టైమ్ లేదా డేటా నేరుగా మీ అసలు మొబైల్ నంబర్ కే చేరుతుంది. అయితే భద్రత కారణాల వల్ల ఈ టెంపరరీ నంబర్‌కు కాల్స్ రావు, మెసేజ్‌లు కూడా పంపలేరు. ఇది కేవలం రీచార్జ్, లావాదేవీల కోసం మాత్రమే ఉపయోగించే డమ్మీ నంబర్. ప్రస్తుతం ఈ సేవ బిఎస్ఎన్ఎల్ అధికారిక వెబ్‌సైట్ లేదా సెల్ఫ్ కేర్ యాప్‌లో అందుబాటులో లేదు. దీన్ని యాక్టివేట్ చేయడానికి సులభమైన మాన్యువల్ ప్రక్రియ ఉంది.
టీ20 ప్రపంచకప్ విజయం ప్రేరణగా ‘Ola Champions Edition’ కొత్త ఎలక్ట్రిక్ వాహనాలు.. ఫీచర్స్ ఇలా.!
* ముందుగా మీ BSNL నంబర్ నుంచి 1800-180-1503 అనే టోల్ ఫ్రీ నంబర్ కు కాల్ చేయాలి.
* కాల్ కనెక్ట్ అయిన తరువాత IVR సూచనలను అనుసరించాలి.
* కస్టమర్ కేర్ ఎగ్జిక్యూటివ్ తో మాట్లాడే ఆప్షన్‌ను ఎంచుకోవాలి.
* మీ సర్వీస్ ఏరియా, పిన్ కోడ్ వంటి ప్రాథమిక వివరాలను అడిగి ధృవీకరిస్తారు.
* వివరాలు ధృవీకరించిన తరువాత మీకు 10 అంకెల కవచ్ నంబర్ SMS ద్వారా పంపిస్తారు.
* ఆ తరువాత మీరు మీ అసలు మొబైల్ నంబర్ గోప్యంగా ఉంచాలనుకున్న ప్రతిచోటా ఈ కవచ్ నంబర్ ను ఉపయోగించవచ్చు.
Your phone number is personal.
Keep it that way.Show your Kavach number at a BSNL store and recharge without revealing your real number.
BSNL Kavach – Recharge with Privacy. #BSNLKavach #RechargeSecurely #WomenSafetyMatters #BSNLAP @CMDBSNL@robertravi21 pic.twitter.com/iBnv94nDkA
— BSNL_Andhrapradesh (@bsnl_ap_circle) March 11, 2026
తాజావార్తలు
-
Bathroom Tiles Cleaning Tips: హార్పిక్, యాసిడ్ అక్కర్లేదు.. కెమికల్స్ లేకుండానే బాత్రూమ్ టైల్స్‌పై మొండి గార మరకలను సులువుగా తొలగించండి ఇలా.!
-
Bhuvneshwar Kumar 2.O: 36 ఏళ్ల వయసులో రీఎంట్రీ.. భువీ ఊహించని పునరాగమనం వెనుక అసలు కథ ఇదే!
-
Operation Firewall 2026: పాక్ ఇంటెలిజెన్స్‌తో నేరుగా టచ్.. ఏపీ కౌంటర్ ఇంటెలిజెన్స్ దర్యాప్తులో సంచలన అంశాలు..
-
Adarsha Kutumbam : ఆదర్శ కుటుంబం కోసం GV ప్రకాష్.. అసలు మ్యాటర్ ఏంటంటే?
-
Homemade Sesame Oil: మెషిన్ అవసరం లేకుండా ఇంట్లోనే 100% స్వచ్ఛమైన నువ్వుల నూనె.. తయారీ విధానం చాలా సింపుల్!
ట్రెండింగ్
-
Shreyas Iyer History: శ్రేయస్ అయ్యర్ నయా రికార్డు.. సెంచరీ చేసిన మొదటి కెప్టెన్‌గా సర్పంచ్ సాబ్!
-
Pet Hair Cleaning Tips: సోఫా, బెడ్, కార్పెట్‌పై పెంపుడు కుక్క లేదా పిల్లి హెయిర్ పోవడం లేదా? ఈ ట్రిక్స్‌తో ఈజీగా తొలగించండి
-
144Hz AMOLED డిస్‌ప్లే, 7,200mAh బ్యాటరీ, ZEISS కెమెరా వ్యవస్థతో Vivo V80 లాంచ్.. ధర, ఫీచర్లు ఇవే!
-
10,000mAh బ్యాటరీ, మిలిటరీ గ్రేడ్ మన్నిక, AMOLED డిస్ప్లేతో గిన్నిస్ వరల్డ్ రికార్డ్ మొబైల్ vivo S2 FE లాంచ్.. ధర, ఫీచర్లు ఇవే..!
-
Shreyas Iyer: నేను ఎక్కడ ఉన్నానో కూడా అర్థం కాలేదు.! కలలు నిజమయ్యాయి.. కెప్టెన్ ఆసక్తికర వ్యాఖ్యలు.!