Fatty Liver: ఫ్యాటీలివర్ సమస్యతో బాధపడుతున్నారా..? మందులతో పని లేకుండా తగ్గించుకోండిలా..
- ఫ్యాటీ లివర్ తో బాధపడే వారికి చిట్కాలు..
- ఎలాంటి మందులు అవసరం లేకుండానే తగ్గించుకోవచ్చు..
- సహజ మూలికలు, వ్యాయామం, ఆహార నియమాల ద్వారా సాధ్యం..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
కాలేయం మన శరీరంలోని అత్యంత కీలకమైన అవయవం. ఇది విషతుల్యాలను తొలగించడం, జీర్ణక్రియకు సహకరించడం, పోషకాలను నిల్వ చేయడం వంటి అనేక బాధ్యతలను నిర్వర్తిస్తుంది. అయితే.. ఆధునిక జీవనశైలి, ఆహారపు అలవాట్ల కారణంగా ప్రస్తుతం చాలామంది ‘ఫ్యాటీ లివర్’ సమస్యతో బాధపడుతున్నారు. కాలేయంలో కొవ్వు పేరుకుపోవడం వల్ల వచ్చే ఈ స్థితిని నిర్లక్ష్యం చేస్తే, అది కాలక్రమేణా లివర్ సిర్రోసిస్‌కు దారితీసే అవకాశం ఉందని వైద్యులు హెచ్చరిస్తున్నారు. సరైన జాగ్రత్తలు తీసుకుంటే.. ఈ సమస్యను తొలి దశలోనే సమర్థవంతంగా అదుపులోకి తీసుకురావచ్చు.
ఫ్యాటీ లివర్‌ను తగ్గించుకోవడానికి వైద్యులు సూచిస్తున్న ప్రధాన మార్గాలు ఇవే..
Also Read
- Protein Rich Foods: ఒంట్లో బలం అమాంతం పెంచే హై ప్రోటీన్ రొట్టె.. చాలా సింపుల్ ఇలా చేసుకోండి!
- Homemade Recipes: రొటీన్ పచ్చళ్లు బోర్ కొట్టాయా? ఈ పచ్చడి ట్రై చేయండి.. ఒక్క ముద్ద తిన్నా వదిలిపెట్టరు!
- Egg Lababdar Recipe: ఎగ్ లవర్స్ కోసం పర్ఫెక్ట్ డిష్.. రెస్టారెంట్ స్టైల్ సూపర్ టేస్టీ "ఎగ్ లబాబ్దార్" సులువుగా చేసుకోండి ఇలా..!
- Heart Health Tips: గుండె ఆరోగ్య రహస్యం ఇదే.. మంచి ఆహారంతో పాటు మంచి అనుబంధాలు కూడా!
1. ఆహార నియమాలు
ఆరోగ్యకరమైన కాలేయం కోసం ఆహారంలో మార్పులు అత్యవసరం. చక్కెర, మైదా, జంక్ ఫుడ్స్, మరియు వేపుళ్లకు దూరంగా ఉండటం మొదటి మెట్టు. సోరకాయ జ్యూస్, బీట్రూట్ జ్యూస్ వంటివి ఉదయం వేళ తీసుకోవడం వల్ల లివర్ శుద్ధి అవుతుంది. అలాగే, డైట్లో పెసరపప్పు, ఓట్స్, తాజా ఆకుకూరలు, కూరగాయలను అధికంగా చేర్చుకోవాలి.
Also Read:Car Sold: ఇదెక్కడి పనికిమాలిన ఐడియా రా.. అద్దెకు తీసుకున్న కారును అమ్మడం ఏంటి రా బాబు..
2. వ్యాయామం
శారీరక శ్రమ శరీరంలోని టాక్సిన్స్‌ను బయటకు పంపి, కాలేయంపై ఒత్తిడిని తగ్గిస్తుంది. ప్రతిరోజూ కనీసం 30 నిమిషాల పాటు వేగంగా నడవడం (బ్రిస్క్ వాకింగ్) చాలా ఉత్తమం. యోగాలో నౌకాసనం, పవన ముక్తాసనం వంటి ఆసనాలు కాలేయం పనితీరును మెరుగుపరుస్తాయి. అంతేకాకుండా, పొత్తికడుపు భాగంలో తేలికపాటి మసాజ్ చేసుకోవడం వల్ల రక్త ప్రసరణ మెరుగుపడి లివర్ చురుగ్గా మారుతుంది.
3. సహజ మూలికలు
కాలేయాన్ని సహజంగా డీటాక్స్ చేయడానికి కొన్ని మూలికలు అద్భుతంగా పనిచేస్తాయి. రాత్రి పడుకునే ముందు త్రిఫల చూర్ణాన్ని తీసుకోవడం, ఉదయాన్నే ఆమ్లా టీ తాగడం వల్ల మంచి ఫలితాలు ఉంటాయి. ఈ నియమాలను క్రమం తప్పకుండా 3 నెలల పాటు పాటిస్తే.. ఎటువంటి మందుల అవసరం లేకుండానే ఫ్యాటీ లివర్ సమస్య నుంచి బయటపడవచ్చు. ఆరోగ్యకరమైన జీవనశైలిని అలవాటు చేసుకోవడమే కాలేయ రక్షణకు శాశ్వత మార్గం.
తాజావార్తలు
-
Rahul Gandhi: రాహుల్ గాంధీ నా స్కూటీ ఎక్కడం మర్చిపోలేని అనుభూతి.. మహిళా గిగ్ వర్కర్ ఫుల్ ఖుషి
-
Virat Kohli: విరాట్ కోహ్లీ ఖాతాలో చెత్త రికార్డు.. మొదటి బ్యాటర్‌గా.. మరీ తక్కువ మ్యాచ్‌ల్లోనే!
-
Palak Paneer Pakoda Recipe: ఇంట్లోనే సింపుల్‌గా పాలక్ పనీర్ పకోడాలు.. తయారీ విధానం ఇదిగో!
-
Vivo T6x 5G: Vivo T6x 5G త్వరలో భారత్‌లో లాంచ్.. BIS సర్టిఫికేషన్‌లో ప్రత్యక్షం.. 50MP కెమెరా, భారీ బ్యాటరీ
-
PM Modi: ప్రధాని మోడీ గొప్ప మనసు.. వృద్ధురాలికి స్వయంగా సాయం
ట్రెండింగ్
-
India All Out List: వన్డేల్లో టీమిండియాకు ఘోర పరాభవం.. 100 లోపే భారత్ ఇన్నిసార్లు ఆలౌట్ అయిందా?
-
Children’s Day 2026 : మార్కుల వేట వద్దు.. పిల్లల్లో క్రియేటివిటీ పెంచండి
-
Red Line on Medicine Strips: మెడిసిన్ స్ట్రిప్‌పై ఎర్రగీత ఉందా? ఈ విషయం తప్పక తెలుసుకోండి..!
-
IND vs NZ 4th ODI: అదే మా కొంపముంచింది.. ఓటమిని జీర్ణించుకోవడం కష్టం.. శ్రేయస్ భావోద్వేగ వ్యాఖ్యలు!
-
Matt Henry: భారత్‌ను మడతెట్టెస్తున్న మాట్ హెన్రీ.. ఇది మూడోసారి.. ఏకంగా 8 వికెట్స్!