Milk Purity: మీరు తాగే పాలు అసలైనవేనా? కల్తీ పాలను గుర్తించే 5 సింపుల్ పద్ధతులు ఇవే!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Milk Purity: చిన్న పిల్లల నుంచి వృద్ధుల వరకు అందరికీ అవసరమైన విటమిన్ డి, బి12 వంటి కీలక పోషకాలు పాలలో పుష్కలంగా ఉంటాయి. అయితే, ఇటీవల కాలంలో పాలు, పాల ఉత్పత్తుల కల్తీ కేసులు విపరీతంగా పెరిగిపోతున్నాయి. కేవలం నీటినే కాకుండా.. డిటర్జెంట్లు, యూరియా, హైడ్రోజన్ పెరాక్సైడ్ వంటి ప్రమాదకర రసాయనాలను పాలల్లో కలుపుతున్నారు. ఇవి మీ కుటుంబ ఆరోగ్యాన్ని దెబ్బతీసే ప్రమాదం ఉంది. అందుకే మీరు కొనుగోలు చేసిన పాలు స్వచ్ఛమైనవో కాదో ఇంట్లోనే ఈ 5 సింపుల్ పద్ధతుల్లో తెలుసుకోండి.
READ ALSO: Hyderabad: పాతబస్తీలో అదృశ్యమైన యువకుడు.. బావిలో కుళ్లిపోయి ఇలా.. ఏం జరిగిందంటే..
Also Read
- Dussehra Special Recipes: కరకరలాడే జంతికల నుంచి స్వీట్ షాప్ స్టైల్ చిక్కీ వరకు పిండివంటలు ట్రై చేయండి..!
- Tea Drinking Mistakes: 'టీ' తాగడం ఓకే.. కానీ, తాగే సమయలో ఈ తప్పులు చేసారో.. క్యాన్సర్ వచ్చే ప్రమాదం సుమీ..!
- Lunch Recipes: ఇంటికి చుట్టాలొస్తే కంగారేలా.? చిటికెలో సులువుగా చేసుకోగల రకరకాల కమ్మని కూరలు ఇదిగో..!
- Crispy Snacks: నూనెను ఎక్కువగా పీల్చుకోకుండా బొంబాయి రవ్వతో 'క్రిస్పీ బైట్స్'.. తినడం మొదలు పెడితే గిన్నె ఖాళీ కావాల్సిందే.!
1. ఫ్లో టెస్ట్
పాలల్లో నీటి కల్తీని గుర్తించడానికి ఇది అత్యంత సులభమైన మార్గం అని నిపుణులు చెబుతున్నారు. ఈ పద్ధతిలో పాలను ఎలా టెస్ట్ చేయాలంటే.. ఒక మెరుగుపెట్టిన ప్లేట్ లేదా ఏటవాలుగా ఉన్న ఉపరితలంపై ఒక చుక్క పాలను వేయండి. ఆ ప్లేట్‌పై పాలు నెమ్మదిగా ప్రవహిస్తూ, వెనుక తెల్లటి గీతలాంటి జాడను వదిలివేస్తే అవి స్వచ్ఛమైనవి. ఒకవేళ ఆ చుక్క వేగంగా కిందకు ప్రవహించి, ఎలాంటి గుర్తులు వదలకుంటే అందులో నీరు కలిపినట్లు అర్థం.
2. అయోడిన్ పరీక్ష
పాలలో పిండి పదార్థాలు కలిపారో లేదో దీని ద్వారా తెలుసుకోవచ్చు. ఈ పద్ధతిలో ఎలా పరీక్ష చేయాలంటే.. పాలను వేడి చేసి, అది గోరువెచ్చగా ఉన్నప్పుడు కొన్ని చుక్కల అయోడిన్ టింక్చర్ వేయండి. అప్పుడు పాలు నీలం లేదా నలుపు రంగులోకి మారితే అది కల్తీ జరిగినట్లు సంకేతం. స్వచ్ఛమైన పాలు రంగు మారవు.
3. బాటిల్ షేక్ టెస్ట్
పాలు తెల్లగా, చిక్కగా కనిపించడానికి డిటర్జెంట్లు వాడుతుంటారు. బాటిల్ షేక్ టెస్ట్ ఎలా చేయాలంటే.. ఒక గాజు సీసాలో కొంచెం పాలు పోసి గట్టిగా షేక్ చేయండి. అప్పుడు పాలలో అధిక మొత్తంలో నురుగు వచ్చి, అది ఎక్కువ సేపు అలాగే ఉంటే అందులో డిటర్జెంట్ కలిపారని అర్థం.
4. పప్పు పొడితో పరీక్ష
కొంచెం పాలలో సోయాబీన్ లేదా కంది పప్పు పొడిని కలిపి, అందులో ఎర్రటి లిట్మస్ కాగితాన్ని ముంచండి. అప్పుడు ఎర్ర లిట్మస్ కాగితం నీలం రంగులోకి మారితే ఆ పాలలో యూరియా లేదా ఇతర రసాయనాలు ఉన్నాయని అర్థం.
ప్రముఖ బ్రాండ్ల పేరుతో నకిలీ ప్యాకెట్లు మార్కెట్లోకి వచ్చే అవకాశం ఉంది. కాబట్టి ప్యాకేజింగ్‌ను జాగ్రత్తగా గమనించాలి. వీలైనంత వరకు నమ్మకమైన వాళ్ల నుంచి పాలను కొనుగోలు చేయడం ఉత్తమం అని నిపుణులు సూచిస్తున్నారు. కల్తీ పాలు తాగడం వల్ల కిడ్నీ సమస్యలు, జీర్ణకోశ వ్యాధులు వచ్చే ప్రమాదం ఉందని, కాబట్టి పైన పేర్కొన్న పరీక్షల ద్వారా మీరు కొనుగోలు చేసిన పాలు స్వచ్ఛమైనవా లేదా జాగ్రత్త పరీక్షించండి.
READ ALSO: viral video: ఏం పని ఆంటీ ఇది? వైరల్ వీడియో చూశారా!
తాజావార్తలు
-
CM Revanth Reddy: విద్యుత్ అంతరాయాలపై సీఎం రేవంత్ ఆగ్రహం.. నిర్లక్ష్యం వహిస్తే సస్పెన్షన్ తప్పదు!
-
AP MPTC, ZPTC Elections: ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికలపై హైకోర్టులో కీలక పరిణామం.. తీర్పు రిజర్వ్
-
OTR: పవన్ పట్టు.. బాబు వ్యూహం.. ఎవరికి ఎన్ని సీట్లు?
-
Dada: బాలయ్య ఫ్యాన్స్కి గుడ్ న్యూస్… హైదరాబాద్లోనే ‘దాదా’ లాస్ట్ పంచ్!
-
Acer Sospiro A70 5G: Acer కొత్త 5G ఫోన్ లాంచ్.. డ్యుయల్ డిస్ప్లేలు, 20GB RAM, 64MP కెమెరా!
ట్రెండింగ్
-
రూ.14,999కే itel 5G ఫోన్.. 120Hz డిస్‌ప్లే, 5000mAh బ్యాటరీతో City 300 లాంచ్..!
-
Dussehra Special Recipes: కరకరలాడే జంతికల నుంచి స్వీట్ షాప్ స్టైల్ చిక్కీ వరకు పిండివంటలు ట్రై చేయండి..!
-
Qais Ahmad: మాములు యాక్టింగ్ కాదయ్యా.. నీ పెర్ఫార్మన్స్కు ఆస్కార్ కూడా పనికిరాదేమో.! వీడియో వైరల్..
-
టాటా.. బైబై.. గయా.. WCL 2026 లీగ్ స్టేజీలోనే ఇండియా చాంపియన్స్ ఔట్..!
-
How To Grow Tej Patta In Pots: మార్కెట్ నుంచి తెచ్చే పని లేదు.. ఇంట్లోనే ఈజీగా బిర్యానీ ఆకు మొక్కను పెంచండి..