Ugadi Gift : పేదలకు ఉగాది కానుక.. ఉగాదికి 2,064 ఇళ్ల పంపిణీకి ముహూర్తం ఖరారు.!
- ఉగాది కానుకగా 2,064 టిడ్కో ఇళ్ల పంపిణీ
- మార్చి 17న ప్రారంభించనున్నసీఎం చంద్రబాబు
- నాయుడుపేట వద్ద రూ.168 కోట్లతో నిర్మించిన గృహ సముదాయం
- నిరుపేదల సొంతింటి కల నెరవేర్చుతున్న ప్రభుత్వం
- Follow Us :
-
-
Add as a preferred
source on google
సొంతిల్లు కట్టుకోవాలనే నిరుపేదల కలను నిజం చేస్తూ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఉగాది పండుగ ముందే అదిరిపోయే శుభవార్తను అందించింది. తిరుపతి జిల్లా నాయుడుపేట సమీపంలోని బిరదవాడ వద్ద నిర్మించిన 2,064 టిడ్కో (TIDCO) ఇళ్లను లబ్ధిదారులకు పంపిణీ చేసేందుకు కూటమి ప్రభుత్వం అన్ని ఏర్పాట్లు పూర్తి చేసింది. తెలుగు కొత్త సంవత్సరం ఉగాదిని పురస్కరించుకుని, మార్చి 17న ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఈ భారీ గృహ సముదాయాన్ని అధికారికంగా ప్రారంభించి, నిరుపేదలకు పంపిణీ చేయనున్నారు. ప్రభుత్వం అందించే ఈ కానుకతో వందలాది కుటుంబాల్లో పండుగ వెలుగులు ముందే రానున్నాయి.
ఈ ప్రాజెక్టు చరిత్రను పరిశీలిస్తే, గత టీడీపీ హయాంలోనే నాయుడుపేట పురపాలక సంఘం పరిధిలోని 36 ఎకరాల ప్రభుత్వ భూమిలో ఈ ఇళ్ల నిర్మాణ పనులు ప్రారంభమయ్యాయి. అప్పట్లోనే సుమారు 70 శాతం పనులు పూర్తయినప్పటికీ, తదనంతరం జరిగిన రాజకీయ పరిణామాలు , ప్రభుత్వం మారడంతో ఈ పనులు మధ్యలోనే నిలిచిపోయాయి. అయితే, ఇటీవల మళ్లీ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే నిలిచిపోయిన టిడ్కో ఇళ్లపై ప్రత్యేక దృష్టి సారించింది. సుమారు రూ. 168 కోట్ల వ్యయంతో, నేషనల్ హైవే 16 పక్కన నిర్మించిన ఈ ఇళ్లలో పెండింగ్‌లో ఉన్న అన్ని పనులను యుద్ధ ప్రాతిపదికన పూర్తి చేయించి, సకల మౌలిక వసతులతో వీటిని సుందరంగా తీర్చిదిద్దింది.
Also Read
- YS Jagan : రాయలసీమ హార్టికల్చర్‌పై చంద్రబాబువి అంకెల గారడీలు
- Sajjala Ramakrishna Reddy : లోకల్ ఎలక్షన్స్‌కు వైసీపీ లీగల్ టీమ్ రెడీ.. సజ్జల కీలక ఆదేశాలు
- Pan IIT Summit : చంద్రబాబు చూపు ఈవీపై.. ఏపీకి కొత్త టెక్నాలజీ ప్లాన్..
- AP Drought: ఏపీలో 544 మండలాలను కరువు ప్రాంతాలుగా గుర్తించాలి.. జాతీయ విపత్తుగా ప్రకటించాలి..
ప్రజలకు ఇచ్చిన హామీ మేరకు ఉగాది నాటికి గృహ ప్రవేశాలు చేయించాలనే లక్ష్యంతో ఉన్న ప్రభుత్వం, ఈ నెల 17నే ప్రారంభోత్సవానికి సిద్ధమైంది. సకల సదుపాయాలతో కూడిన ఈ ఇళ్లు అందుబాటులోకి రావడంతో లబ్ధిదారుల్లో హర్షాతిరేకాలు వ్యక్తమవుతున్నాయి. ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను ఒక్కొక్కటిగా నెరవేరుస్తున్న క్రమంలో, ఈ టిడ్కో ఇళ్ల పంపిణీని ప్రభుత్వం ఒక మైలురాయిగా భావిస్తోంది. ఉగాది పండుగకు ముందే నిరుపేదలు తమ సొంతింటి గడప తొక్కబోతుండటం రాష్ట్రవ్యాప్తంగా చర్చనీయాంశమైంది.
తాజావార్తలు
-
Flydubai Attack: ‘‘ప్రార్థన చేస్తూ వెనక నుంచి దాడి’’.. సంచలన విషయాలు చెప్పిన స్మిత్ మచ్చర్
-
India at Asian Games 2026: 21 స్వర్ణాలు.. 27 రజతాలు.. 37 కాంస్యాలు.. ఆసియా క్రీడల్లో భారత్ పూర్తి మెడల్ ట్యాలీ ఇదే
-
Singeetam Srinivasa Rao: టాలీవుడ్లో విషాదం.. ప్రముఖ దర్శకుడు సింగీతం శ్రీనివాసరావు కన్నుమూత
-
Story Board : తెలుగు రాష్ట్రాల్లో కమ్ముకొస్తున్న తాగునీటి కొరత
-
Akbaruddin Owaisi : వచ్చే ఎన్నికల్లో పోటీ చేయను.. ఎంఐఎం ఎమ్మెల్యే అక్బరుద్దీన్ ఓవైసీ సంచలన వ్యాఖ్యలు
ట్రెండింగ్
-
National Boyfriend Day: మీ ప్రేమను మరింత స్పెషల్‌గా మార్చే సింపుల్ టిప్స్.!
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!
-
Rajasthani Dal Baati: నోట్లో వేస్తే కరిగిపోయే నెయ్యి బాటీలు, ఘాటైన దాల్ కాంబినేషన్ ఇలా చేయండి..!