Breaking News: మొయినాబాద్ ఫామ్ హౌస్‌లో కాల్పుల కలకలం.. పోలీసులపై డ్రగ్స్ బ్యాచ్ దాడి.!
- > మొయినాబాద్ ఫామ్‌హౌస్‌లో కాల్పుల కలకలం
- ఫామ్‌హౌస్‌లో డ్రగ్స్‌పార్టీ జరుగుతున్నట్లు పోలీసులకు సమాచారం
- సోదాలు చేసేందుకు వెళ్లిన పోలీసులపై కాల్పులు
- మాజీ ఎమ్మెల్యేకు చెందిన ఫామ్‌హౌస్‌గా గుర్తింపు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
హైదరాబాద్ శివార్లలోని మొయినాబాద్ మరోసారి వార్తల్లో నిలిచింది. ఒక మాజీ ఎమ్మెల్యేకు చెందిన ఫామ్ హౌస్‌లో డ్రగ్స్ పార్టీ జరుగుతుందన్న సమాచారంతో పోలీసులు జరిపిన మెరుపు దాడులు సంచలనానికి దారితీశాయి. కేవలం డ్రగ్స్ సేవించడమే కాకుండా, పార్టీలో గాలిలోకి కాల్పులు జరపడం స్థానికంగా తీవ్ర భయాందోళనలకు గురిచేసింది. మొయినాబాద్‌లోని ఒక ఫామ్ హౌస్‌లో భారీగా డ్రగ్స్ పార్టీ జరుగుతోందని ఈగల్ టీమ్‌కు ముందస్తు సమాచారం అందింది. దీంతో అధికారులు సోదాలకు వెళ్లగా, అక్కడ ఉన్న యువకులు పోలీసులను అడ్డుకుని హంగామా సృష్టించారు. పార్టీలో ఉన్న కొందరు యువకులు రివాల్వర్‌తో గాలిలోకి కాల్పులు జరిపినట్లు సమాచారం. పరిస్థితి ఉద్రిక్తంగా మారడంతో వెంటనే స్పెషల్ ఆపరేషన్ టీమ్ (SOT) రంగంలోకి దిగి ఫామ్ హౌస్‌ను చుట్టుముట్టింది.
Sangareddy: బతుకుదెరువు కోసం వలస వచ్చిన భార్యాభర్తలు.. తెల్లవారుజామున దారుణం..
Also Read
- Chhattisgarh: పెళ్లికి ‘నో’ చెప్పిందని 22 ఏళ్ల యువతిపై యాసిడ్ దాడి..
- Fraud: విదేశాల్లో ఉద్యోగాలంటూ మోసం.. నిరుద్యోగుల నుంచి రూ.50 లక్షలు వసూలు చేసిన కేటుగాడు..
- Pakistan Spy Network: నేవీ, రక్షణ సంస్థలే టార్గెట్? ఏపీలో పాక్ స్పై నెట్వర్క్ తీవ్ర కలకలం..
- Hyderabad: హనీట్రాప్ సైబర్ మోసం.. రిటైర్డ్ ఉద్యోగి నుంచి రూ.38 లక్షలు వసూలు.!
పోలీసుల సోదాల్లో ఫామ్ హౌస్‌లో భారీగా కొకైన్ , ఇతర మత్తు పదార్థాలు లభించాయి. అలాగే కాల్పులు జరిపిన రివాల్వర్‌ను కూడా అధికారులు స్వాధీనం చేసుకున్నట్లు సమాచారం. ఈ డ్రగ్స్ పార్టీకి సంబంధించి పోలీసులు ఒక మాజీ ఎమ్మెల్యేతో పాటు మొత్తం ఎనిమిది మందిని అదుపులోకి తీసుకున్నారు. వీరిలో ఒక ప్రజాప్రతినిధి సహా పలువురు వీఐపీలు ఉన్నట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. వీరంతా రాజకీయ పలుకుబడి ఉన్నవారే కావడంతో పోలీసులు ఈ కేసును అత్యంత రహస్యంగా, లోతుగా విచారిస్తున్నారు.
Ugadi Gift : పేదలకు ఉగాది కానుక.. ఉగాదికి 2,064 ఇళ్ల పంపిణీకి ముహూర్తం ఖరారు.!
మాజీ ఎమ్మెల్యేకు చెందిన ఫామ్ హౌస్ కావడంతో పాటు, పట్టుబడిన వారిలో ప్రముఖ రాజకీయ నేతలు ఉన్నారనే వార్తలు రాజకీయ వర్గాల్లో ప్రకంపనలు సృష్టిస్తున్నాయి. ఈగల్ టీమ్ , ఎస్వోటీ పోలీసులు అరెస్ట్ చేసిన ఎనిమిది మందిని పోలీస్ స్టేషన్‌కు తరలించి, వారికి డ్రగ్స్ టెస్టులు నిర్వహించేందుకు సిద్ధమవుతున్నారు. పట్టుబడిన వీఐపీలు ఎవరు? డ్రగ్స్ ఎక్కడి నుంచి సరఫరా అయ్యాయి? అనే కోణంలో విచారణ కొనసాగుతోంది.
తాజావార్తలు
-
Erravalli Lands : ఎర్రవల్లి భూములపై సీఎం రేవంత్ ఫోకస్.. 45 ఎకరాలు ఏమయ్యాయి?
-
TGSRTC : ఎయిర్పోర్ట్ ప్రయాణికులకు గుడ్‌న్యూస్.. పుష్పక్ ఛార్జీలు భారీగా తగ్గింపు
-
Team India: న్యూజిలాండ్‌తో టీ20 సిరీస్‌కు భారత జట్టు ప్రకటన.. 4 ఏళ్ల తర్వాత జట్టులోకి స్టార్ ప్లేయర్..
-
Smit Machchhar: స్మిత్ మచ్చర్‌కు అరుదైన గౌరవం.. అమెరికా ప్రతినిధుల సభలో తీర్మానం
-
Israel-Gaza: ఇజ్రాయెల్-గాజా యుద్ధానికి రేపటితో మూడేళ్లు.. ఇప్పుడెలా ఉందంటే..!
ట్రెండింగ్
-
Hong Kong Sixes 2026: మరోసారి భారత్-పాకిస్థాన్ మ్యాచ్.. కెప్టెన్‌గా భువీ..!
-
Smriti Mandhana: బీసీసీఐ కీలక నిర్ణయం.. భారత మహిళల కొత్త కెప్టెన్‌గా స్మృతి మంధాన..!?
-
Captain Changes: ఆసియా గేమ్స్‌లో ఓటమి.. పాకిస్థాన్ కెప్టెన్ పై వేటు..! కొత్త కెప్టెన్ ఎవరంటే.?
-
WCL 2026 నుంచి పాకిస్థాన్ ఛాంపియన్స్ ఔట్.. NOC ఇవ్వని PCB.!
-
Kakarakaya Vepudu: అన్నంలోకి ‘కాకరకాయ వేపుడు’.. ఇలా చేస్తే ప్లేట్ ఖాళీ అవ్వాల్సిందే.!