Twin Sister: తోడబుట్టిన చెల్లి అని కూడా చూడలేదు.. 40 సార్లు కత్తితో పొడిచి చంపేశాడు..
- కవల చెల్లిని హత్య చేసిన అన్న..
- తల్లిని కూడా చంపేందుకు ప్రయత్నం..
- కెరీర్ మీద ఫోకస్ చేయమన్నందుకే ఈ దారుణం..?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఉత్తరప్రదేశ్‌లోని మొరాదాబాద్‌లో దారుణ ఘటన చోటు చేసుకుంది. ఒక యువకుడు తన కవల సోదరిని కత్తితో 40 సార్లకు పైగా పొడిచి చంపేశాడు. ఆ తర్వాత తన తల్లిని కూడా కత్తితో దాడి చేసి గాయపరిచాడు. ఈ ఘటన స్థానికంగా అందరినీ కలచివేసింది.
అసలేం జరిగింది..?
హార్దిక్, హింశిక అనే కవలలు (25 ఏళ్లు) గురుగ్రామ్‌లో పని చేస్తున్నారు. హోలీ పండుగ కోసం వారు తమ తల్లి నీలిమ వద్దకు మొరాదాబాద్ వచ్చారు. శుక్రవారం తిరిగి వెళ్లడానికి సిద్ధమవుతుండగా ఈ దారుణం జరిగింది.
Also Read
- Minister Nara Lokesh: స్పీడ్.. సర్వీస్.. స్టెబిలిటీ.. ఏపీ అభివృద్ధిపై మంత్రి లోకేష్ కీలక వ్యాఖ్యలు
- Flydubai Attack: అల్-ఖైదా ఫోటోలు, తీవ్రవాద భావాలు.. కో-పైలట్ ఉగ్రకోణం బట్టబయలు..!
- Vijayawada Crime: విజయవాడలో కలకలం.. పెళ్లికి ఒప్పుకోలేదని ప్రియురాలిపై దాడి.. ప్రియుడు మృతి
- Amaravati Flood Control System: 200 ఏళ్ల వర్షపాతంపై అధ్యయనం.. అమరావతి వరద నియంత్రణకు పక్కా ప్లాన్..!
Also Read:Subsidy: టీ కొట్టు, హోటల్ యజమానులకు శుభవార్త.. దానిపై రూ.2 తగ్గింపు..
దాడి ఎలా జరిగింది..?
తల్లి ఆఫీస్‌కు వెళ్లిన సమయంలో ఇంట్లో ఉన్న హార్దిక్, తన సోదరి హింశికపై కత్తితో విచక్షణారహితంగా దాడి చేశాడు. ఆమె అక్కడికక్కడే మరణించింది. ఆ తర్వాత.. ఏదో ఒక కారణం చెప్పి ఆఫీసులో ఉన్న తల్లిని ఇంటికి పిలిపించాడు. ఇంటికి రాగానే తల్లిని కూడా కత్తితో పొడిచి.. కారులో అక్కడి నుంచి పారిపోయాడు.
తల్లి కేకలు విన్న చుట్టుపక్కల వారు వెంటనే స్పందించి.. వారిని ఆసుపత్రికి తరలించారు. అప్పటికే హింశిక చనిపోయిందని వైద్యులు నిర్ధారించారు. హింశిక పోస్ట్ మార్టం రిపోర్ట్ లో కత్తి పోట్లు 40 సార్లు ఉన్నట్లు తెలిపారు. గాయపడిన తల్లి ప్రస్తుతం చికిత్స పొందుతోంది.
Also Read:SSY Account: ‘సుకన్య సమృద్ధి యోజన’ ఖాతాదారులకు బిగ్ అలర్ట్.. మార్చి 31 చివరి తేదీ..
ఎందుకు ఇలా చేశాడు..?
పోలీసుల విచారణలో షాకింగ్ విషయాలు తెలిశాయి. హార్దిక్ ఇన్‌స్టాగ్రామ్‌లో ఒక అమ్మాయితో ప్రేమలో ఉన్నాడు. ఏడు నెలల క్రితం వారి మధ్య బ్రేకప్ అయ్యింది. అప్పటి నుంచి హార్దిక్ తీవ్ర మనస్తాపానికి లోనయ్యాడు. తన ప్రేమ విఫలం కావడానికి తన తల్లి, సోదరే కారణమని నమ్మి… వారిపై కోపం పెంచుకున్నాడు. అంతే కాకుండా.. కెరీర్ మీద ఫోకస్ పెట్టాలని పదే పదే చెప్పడం తనకు ఇబ్బంది కలిగించిందని అతడు పోలీసుల విచారణలో తెలిపాడు. ఆ కోపంలోనే ఈ దారుణానికి పాల్పడ్డాడు.
తాజావార్తలు
-
Aishwarya Lekshmi: బన్నీ – అట్లీ కాంబోలో ఈ బ్యూటీ లేనట్టే! అసలు సీక్రెట్ బయటపెట్టిన హీరోయిన్ ..
-
Minister Nara Lokesh: స్పీడ్.. సర్వీస్.. స్టెబిలిటీ.. ఏపీ అభివృద్ధిపై మంత్రి లోకేష్ కీలక వ్యాఖ్యలు
-
Flydubai Attack: అల్-ఖైదా ఫోటోలు, తీవ్రవాద భావాలు.. కో-పైలట్ ఉగ్రకోణం బట్టబయలు..!
-
Heart Attacks: 18ఏళ్లకే గుండెపోటు.. కారణాలు ఇవే!
-
Vijayawada Crime: విజయవాడలో కలకలం.. పెళ్లికి ఒప్పుకోలేదని ప్రియురాలిపై దాడి.. ప్రియుడు మృతి
ట్రెండింగ్
-
National Boyfriend Day: మీ ప్రేమను మరింత స్పెషల్‌గా మార్చే సింపుల్ టిప్స్.!
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!
-
Rajasthani Dal Baati: నోట్లో వేస్తే కరిగిపోయే నెయ్యి బాటీలు, ఘాటైన దాల్ కాంబినేషన్ ఇలా చేయండి..!