Anil Agarwal: వేల కోట్ల సామ్రాజ్యం ఉన్నా తీరని పుత్రశోకం.. కుమారుడి మరణంపై బిలియనీర్ ఎమోషనల్!
- నాకు ఒక్కడే కొడుకు.. అతడిని కోల్పోయాను
- దేశం కోసం నేను ఇంకా చాలా చేయాల్సి ఉంది..
- అందుకే నేను కుప్పకూలిపోకుండా లేచి ముందుకు సాగాను
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Anil Agarwal: వేదాంత రిసోర్సెస్ ఛైర్మన్, ప్రముఖ పారిశ్రామికవేత్త అనిల్ అగర్వాల్ తన కుమారుడి మరణం తర్వాత ఎదుర్కొన్న మానసిక వేదనను పంచుకుంటూ ‘ఇండియా టుడే కాన్‌క్లేవ్ 2026’లో అత్యంత భావోద్వేగంగా మాట్లాడారు. తన ఏకైక కుమారుడిని కోల్పోయినా, దేశాభివృద్ధి కోసం తన పయనాన్ని ఆపనని ఆయన స్పష్టం చేశారు. భారతదేశం దగ్గర అపారమైన అవకాశాలు ఉన్నాయని, స్వయం సమృద్ధి దిశగా మనం అడుగులు వేయాలని ఈ సందర్భంగా ఆయన పిలుపునిచ్చారు.
READ ALSO: Best Income: నాడు ఎకరం రూ.15 వేలు.. నేడు నెలకు రూ.14.50 లక్షల ఆదాయం.. ఎలా అంటే..
Also Read
- Luxury Sneakers: జెన్ జీ, మిలీనియల్స్‌ను తెగ ఆకర్షిస్తున్న స్నీకర్స్.. అంత స్పెషల్ ఏంటో తెలుసా..?
- LPG Subsidy: సిలిండర్ బుక్ చేసుకునేవారికి శుభవార్త.. రూ.300 సబ్సిడీకి కేంద్రం గ్రీన్ సిగ్నల్!
- Petrol Diesel Price Hike: వాహనదారులకు షాక్.. పెట్రోల్ రూ.5, డీజిల్ రూ.3 పెంపు
- October 15: అక్టోబర్ 15 నుంచి ఏటీఎంలలో సరికొత్త రూల్స్! ఇక ఆ చిక్కులు ఉండవు..
అనిల్ అగర్వాల్ కుమారుడు అగ్నివేష్ (49) ఇటీవల న్యూయార్క్‌లో స్కీయింగ్ ప్రమాదం నుంచి కోలుకుంటున్న సమయంలో గుండెపోటుతో మరణించిన సంగతి తెలిసిందే. వేదాంత గ్రూప్‌లో అగ్నివేష్ కీలక బాధ్యతలు నిర్వహిస్తున్నారు. ఈ విషాదంపై స్పందిస్తూ అగర్వాల్ కన్నీటి పర్యంతమయ్యారు. “నాకు ఒక్కడే కొడుకు.. అతడిని కోల్పోయాను. ఈ ఘటన తర్వాత నేను కుప్పకూలిపోవాలి లేదా లేచి నిలబడి ముందుకు సాగాలి. నేను రెండో మార్గాన్ని ఎంచుకున్నాను. ఎందుకంటే నా గుండెల్లో భారతదేశం ఉంది. దేశం కోసం నేను ఇంకా చాలా చేయాల్సి ఉంది. ఈ అనుభవం నన్ను నిడరంగా మార్చింది, ఇప్పుడు నాకు దేనికీ భయం లేదు” అని ఆయన పేర్కొన్నారు.
విదేశీ విద్య కంటే స్వదేశీ విద్యే మిన్న!
భారతదేశం నుంచి ఏటా సుమారు 7 లక్షల మంది విద్యార్థులు చదువు కోసం విదేశాలకు వెళ్లడంపై అనిల్ అగర్వాల్ ఆందోళన వ్యక్తం చేశారు. మన దేశంలోనే అంతర్జాతీయ స్థాయి విద్యను అందించే అవకాశాలు ఉన్నాయని, యువతకు ఇక్కడే అవకాశాలు కల్పించాలని ఆయన సూచించారు. “మన దేశంలోని యువత, మహిళలు, రిటైర్డ్ సైనిక అధికారులకు సరైన అవకాశాలు ఇస్తే భారత్ ప్రపంచంలోనే తిరుగులేని శక్తిగా మారుతుంది” అని ఆయన విశ్వాసం వ్యక్తం చేశారు. భారతదేశం తన ఇంధన అవసరాల కోసం దిగుమతులపై ఆధారపడటం తగ్గించుకోవాలని ఆయన పిలుపునిచ్చారు. భారత్‌కు అవసరమైన చమురు డిమాండ్‌లో 90% దిగుమతుల ద్వారానే తీరుతోందని, దేశంలో అపారమైన సహజ వనరులు ఉన్నా విధానపరమైన అనుమతుల జాప్యం వల్ల వెలికితీత సాధ్యం కావడం లేదని అన్నారు. మధ్యప్రాచ్య దేశాలు భారత్ ఎప్పుడూ తమపై ఆధారపడాలని కోరుకుంటున్నాయని, భారత్ స్వయం సమృద్ధి సాధించడాన్ని అవి ఇష్టపడటం లేదని అగర్వాల్ సంచలన వ్యాఖ్యలు చేశారు. దేశ ఆర్థిక వ్యవస్థను బలోపేతం చేయడానికి దేశీయ ఇంధన వనరులను విస్తరించడం అత్యవసరమని, తక్షణమే విధానపరమైన సంస్కరణలు చేపట్టాలని ఆయన ప్రభుత్వానికి విన్నవించారు.
READ ALSO: Pawan Kalyan: అడవి బిడ్డల మధ్య జనసేన ఆవిర్భావ వేడుకలు.. 70 ఏళ్ల నాటి కల తీర్చిన పవన్ కళ్యాణ్
తాజావార్తలు
-
Local Body Elections: స్థానిక ఎన్నికలపై సుప్రీం కోర్టు తలుపు తట్టిన వైఎస్సార్సీపీ.. డిమాండ్ ఏంటంటే.?
-
KBR పార్క్ చుట్టూ శాశ్వతంగా వన్‌వే.. 7 ఫ్లైఓవర్ల స్థానంలో ఒకే భారీ ఎలివేటెడ్ కారిడార్..
-
5000 నిట్స్ డిస్‌ప్లే, 9,020mAh బ్యాటరీ, IP69 రేటింగ్‌తో Vivo Y600k Turbo లాంచ్..!
-
Komaki MG-Pro+ Electric Scooter: రూ.85,999కే 150+KM రేంజ్.. 4 వేరియంట్లతో వచ్చిన ఈ ఎలక్ట్రిక్ స్కూటర్ అదిరింది!
-
ఆఫర్లే ఆఫర్లు.. OnePlus Festive Sale వచ్చేసిందోచ్.. వాటిపై భారీ డిస్కౌంట్స్.!
ట్రెండింగ్
-
Family Secrets Leak : ఇంటి గుట్టు లంకేశ్వరుడికి ఎరుక.. కుటుంబ రహస్యాలు పొరుగువారికి చేరుతున్నాయా.?
-
World Teachers Day 2026 : చాట్‌జీపీటీ అన్నీ చెప్పేస్తుందా.. మరి టీచర్ ఎందుకు కావాలి.?
-
Shreyas Iyer: పాకిస్థాన్ బ్యాటర్లు భయపెట్టారు.. గోల్డ్ మెడల్ పోతుందనుకున్నా.. అతడే కాపాడాడు!
-
National Boyfriend Day: మీ ప్రేమను మరింత స్పెషల్‌గా మార్చే సింపుల్ టిప్స్.!
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్‌వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..