viral video: ఏం పని ఆంటీ ఇది? వైరల్ వీడియో చూశారా!
- పీక్స్‌కు చేరిన రీల్స్ పిచ్చి
- ఎస్కలేటర్‌పై మహిళ ప్రమాదకర విన్యాసాలు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
viral video: సోషల్ మీడియాలో లైక్‌లు, వ్యూస్ కోసం జనం ఎంతటి సాహసానికైనా వెనకాడటం లేదు. ఒక్కోసారి ఈ పిచ్చి ప్రాణాల మీదకు తెస్తోంది. తాజాగా ఓ మహిళ చీర కట్టుకుని ఎస్కలేటర్‌పై చేసిన విన్యాసం చూసి నెటిజన్లు షాక్ అవుతున్నారు. దీనికి సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతోంది. అసలేం జరిగిందంటే..
READ ALSO: South Indian Lemon Rice Recipe: నిమిషాల్లోనే ఘాటైన, టేస్టీ లెమన్ రైస్ రెడీ..
Also Read
- Bats Theft: నా బ్యాట్లు దొబ్బేశారు.. టీమిండియా ప్లేయర్ ఆవేదన.!
- Viral Video: ఛీ.. ఛీ.. ఇలాంటి వారిని ఏం చేసిన తప్పులేదు.! కిక్కిరిసిన రైలు కోచ్‌లో అందరు ఉండగానే మూత్ర విసర్జన..!
- The Paradise Shankaranna: ‘పారడైజ్’లో ఆ నాలుగు నిమిషాలు.. తెలంగాణ రాజకీయాల్లో మాత్రం ఫుల్ టైమ్ రచ్చ..!
- Monkey Massage: “మంకేశ్ భాయ్‌ని డిస్టర్బ్ చేయకండి”.. బార్బర్ షాపులో కోతి మసాజ్ రచ్చ! వీడియో వైరల్..
వైరల్ అవుతున్న వీడియో ప్రకారం.. ఒక రద్దీగా ఉండే మాల్ లేదా మెట్రో స్టేషన్‌లో ఒక మహిళ చీర కట్టుకుని ఎస్కలేటర్ వద్దకు వచ్చింది. సాధారణంగా ఎస్కలేటర్ ఎక్కాల్సింది పోయి, ఆమె ఒక్కసారిగా ఎస్కలేటర్ పక్కన ఉండే రైలింగ్ పైకి ఎక్కింది. అది చూసి అక్కడ ఉన్న ప్రయాణికులు ఒక్కసారిగా అవాక్కయ్యారు. అంతటితో ఆగకుండా, ఆమె రైలింగ్ పైనుంచి కదులుతున్న ఎస్కలేటర్‌పైకి ప్రమాదకరంగా దూకింది. అక్కడ కూడా వింత చేష్టలు చేస్తూ, ఎస్కలేటర్ పైకి వెళ్తుంటే ఆమె దానికి వ్యతిరేక దిశలో కిందకు పరిగెత్తడం ప్రారంభించింది. చీర కట్టుకుని ఉండటంతో ఏ మాత్రం పట్టు తప్పినా ప్రాణాపాయం జరిగే అవకాశం ఉన్నా, ఆమె అవేమీ పట్టించుకోకుండా రీల్ కోసం ఈ ఫీట్లు చేయడం వీడియోలో స్పష్టంగా కనిపిస్తుంది.
నెటిజన్ల ఆగ్రహం..
ఈ వీడియోను ‘@desimojito’ అనే ఎక్స్ (ట్విట్టర్) ఖాతాలో షేర్ చేస్తూ.. “ఏదైనా ప్రమాదం జరిగితే వీళ్లు ప్రభుత్వాన్ని నిందిస్తారు” అనే క్యాప్షన్ ఇచ్చారు. దాదాపు 6 లక్షలకు పైగా వీక్షణలు పొందిన ఈ వీడియోపై నెటిజన్లు తీవ్రంగా మండిపడుతున్నారు. “ఇలాంటి వారి వల్లే ప్రమాదాలు జరుగుతాయి. సోషల్ మీడియా సంస్థలు ఇలాంటి కంటెంట్‌ను ప్రోత్సహించకూడదు” అని ఒకరు కామెంట్ చేయగా, “కేవలం కొన్ని లైకుల కోసం ప్రాణాలను పణంగా పెట్టడం మూర్ఖత్వం. ఏదైనా తప్పు జరిగితే బాధ్యత ఎవరిది?” అంటూ మరొకరు నెటిజన్ ప్రశ్నించారు. సోషల్ మీడియా క్రేజ్ ఉండొచ్చు కానీ, అది ప్రాణాలతో చెలగాటం ఆడేలా ఉండకూడదు. ఇలాంటి ఘటనలపై అధికారులు కఠిన చర్యలు తీసుకోవాలని నెటిజన్లు కోరుతున్నారు.
They will blame the government in case of mishappening pic.twitter.com/jtbmTOCoSg
— desi mojito (@desimojito) March 12, 2026
READ ALSO: Kuldeep Yadav Marriage: పెళ్లికొడుకు అయిన టీమిండియా స్టార్ క్రికెటర్.. భార్య ఆస్తి ఎంతో తెలుసా?
తాజావార్తలు
-
Story Board: Fly Dubai విమానంలో అసలేం జరిగింది..?
-
Punjab: కాంగ్రెస్ కొత్త అధ్యక్షుడిగా పర్గత్ సింగ్ నియామకం.. వరంగ్ స్థానంలో మాజీ హాకీ కెప్టెన్‌కు అవకాశం
-
Harish Rao: టీజీ ట్రాన్స్‌కో వాటాల విక్రయంపై రాహుల్ గాంధీకి హరీశ్ రావు లేఖ
-
OTR: తాడేపల్లిలో జగన్ మార్క్ క్లాస్! స్థానిక ఎన్నికల్లో పోటీ చేసి తీరాల్సిందేనా?
-
Off The Record: విజయవాడ మేయర్ సీటుపై వైసీపీ మైండ్ గేమ్?
ట్రెండింగ్
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్‌వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!
-
Rajasthani Dal Baati: నోట్లో వేస్తే కరిగిపోయే నెయ్యి బాటీలు, ఘాటైన దాల్ కాంబినేషన్ ఇలా చేయండి..!
-
Breakfast Quesadillas: రోజూ టిఫిన్ గురించి టెన్షన్ వద్దు.. జస్ట్ 20 నిమిషాల్లో రెడీ అయ్యే ఈ బ్రేక్‌ఫాస్ట్‌ను ట్రై చేయండి..