శరీరానికి ఎన్నో రకాల ఆరోగ్యకర ప్రయోజనాలను అందించే సిరి ధాన్యాలలో రాగులు కూడా చాలా ముఖ్యమైనవి. 

రాగుల‌తో జావ చేసుకుని తాగితే దాంతో ఎన్నో ర‌కాల లాభాలు క‌లుగుతాయి. ముఖ్యంగా వేసవికాలంలో రాగి జావా తాగడం ఆరోగ్యానికి చాలా మంచిది.

వేసవిలో డీహైడ్రేషన్ సమస్యలకు పరిష్కారంగా రాగులు ఉపయోగపడతాయి.

రాగులతో చేసిన ఆహార పదార్థాలు తీసుకోవడం వల్ల నూతన శక్తి వస్తుంది.

బరువు తగ్గాలనుకునే వారు రాగులు తీసుకుంటే చాలా మంచిది. వీటిలో ఉండే అమినో యాసిడ్స్, ట్రిప్టోఫాన్ అనే అమినో ఆమ్లం కలిగి ఉండడం వల్ల ఆకలి తక్కువగా అనిపిస్తుంది. 

 రాగుల్లో ఐరన్ శాతం ఎక్కువగా ఉంటుంది. ఇది రక్తహీనతను తగ్గిస్తుంది. అంతే కాదండి దీనివల్ల మలబద్ధక సమస్య తీరుతుంది.

బీపీ, షుగర్ ఉన్నవాళ్లు రాగి జావ తీసుకోవడం వల్ల నియంత్రణలో ఉంటాయి. 

కాలేయ వ్యాధులు, గుండె బలహీనత, ఉబ్బసం వంటి సమస్యలు తగ్గాలంటే తరచూ రాగులని తీసుకుంటే ఎంతో మేలు. 

రాగుల‌తో జావ చేసుకుని తాగితే దాంతో ఎన్నో ర‌కాల లాభాలు క‌లుగుతాయి. ముఖ్యంగా వేసవికాలంలో రాగి జావా తాగడం ఆరోగ్యానికి చాలా మంచిది.